MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/nbk-ntr0239d734-2a0e-431a-b802-c657d4204874-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/nbk-ntr0239d734-2a0e-431a-b802-c657d4204874-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ప్రేక్షకులు కొన్ని కాంబినేషన్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. వాటిలో నందమూరి నటసింహం బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ కాంబో తప్పక ఉంటుంది. నందమూరి ఫ్యామీలీలో నటన పరంగా, డైలాగ్ డెలివరీ పరంగా కూడా వీరిద్దరికి ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. నందమూరీ ఫ్యామిలీలో భారీ క్రేజ్ అందుకున్నది కూడా వీరిద్దరే. దాంతో వీరిద్దరిని ఒకే బిగ్..nbk-ntr{#}Jr NTR;Tollywood;Audience;Cinema;kalyan ram;RRR Movie;News;Balakrishnaబాలయ్య ఓకే అన్నా జూనియర్ నో అంటున్నాడా...?బాలయ్య ఓకే అన్నా జూనియర్ నో అంటున్నాడా...?nbk-ntr{#}Jr NTR;Tollywood;Audience;Cinema;kalyan ram;RRR Movie;News;BalakrishnaSat, 05 Jun 2021 17:28:31 GMTటాలీవుడ్ ప్రేక్షకులు కొన్ని కాంబినేషన్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. వాటిలో నందమూరి నటసింహం బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ కాంబో తప్పక ఉంటుంది. నందమూరి ఫ్యామీలీలో నటన పరంగా, డైలాగ్ డెలివరీ పరంగా కూడా వీరిద్దరికి ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. నందమూరీ ఫ్యామిలీలో భారీ క్రేజ్ అందుకున్నది కూడా వీరిద్దరే. దాంతో వీరిద్దరిని ఒకే బిగ్ స్క్రిన్‌పై చూడాలని నందమూరి అభిమానులు తెగ ముచ్చట పడుతుంటారు. వీరిద్దరు ఒకే స్క్రీన్‌పై నటిస్తే ఆ సినిమా రేంజ్ మామూలుగా ఉండదు. ఇందుకోసం ఇదివరకు కళ్యాణ్ రామ్ ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్ కూడా వచ్చింది.


వీరిద్దరి కాంబోలో సినిమా చేసేందుకు మరికొందరు నిర్మాతలు కూడా ఎప్పుడుప్పుడా అని వేచి చూస్తున్నారు. కానీ ఈ విషయంపై వీరిద్దరిలో ఏ ఒక్కరు నోరు మెదపడం లేదు. కాంబో గురించి అసలు ఆలోచిస్తున్నట్లుగా కూడా తెలియడం లేదు. దీనికి తోడు వీరిద్దరూ కూడా తమతమ సినిమాల్లో బిజీ అయిపోయి ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా అయిన తరువాత ఎన్‌టీఆర్ మరో రెండు సినిమాలు చేయనున్నాడని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా బాలయ్య బాబు కూడా అఖండ తరువాత చేసేందుకు వరుస సినిమాలు ఓకే చేస్తున్నాడు. వాటిలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒకటి ఉండనుంది.


అయితే తాజాగా వీరిద్దరి కాంబో గురించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. వీరిద్దరి మల్టీస్లారర్‌కి కథలు ఇప్పటికే చాలా వచ్చాయట, వాటిలో కొన్నింటికి బాలయ్య ఓకే అన్నా యంగ్ టైగర్ మాత్రం నో చెప్తున్నాడని టాక్ వస్తుంది. అంతేకాకుండా బాలయ్యతో మల్టీస్టారర్ గురించి ఎన్‌టీఆర్‌ మాత్రం బాబాయ్‌ పక్కన నేను నటించడం ఏంటని చిరునవ్వుతో టాపిక్ పక్క దారి పట్టిస్తున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఎన్‌టీఆర్ కూడా వీరిద్దరి మల్టీస్టారర్ కోసం పవర్ ఫుల్ కథ కోసం వేచి చూస్తున్నాడేమో అని అభిమానులు అంటున్నారు. మరి ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుందో వేచి చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆదిపురుష్ కోసం ప్ర‌భాస్ అంత తీసుకుంటున్నాడా..?

ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరూ తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట.. ఎక్కడో తెలుసా..?

త్వరలో సినీ ప్రముఖులతో కేసీఆర్ భేటీ..?

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు

ఈ వెరై "టీ " ట్రై చేశారా...?

హనుమ జన్మ నిర్ధారణలో ఒకడుగు వెనక్కు తగ్గిన టీటీడీ..!

ఆ అశ్లీల వీడియో లో ప్రముఖ నటి.. పోస్ట్ పెట్టి మరీ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>