MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/zareen-khan7dd1ff17-386e-4ae6-8b5e-f9dae30ac946-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/zareen-khan7dd1ff17-386e-4ae6-8b5e-f9dae30ac946-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో నటీమణులు లైంగిక వేధింపులకు గురి కావడం సర్వసాధారణం అయ్యింది. సినిమా ఇండస్ట్రీలో పదహారేళ్ల అమ్మాయిల నుంచి 60 ఏళ్ల ఆంటీల వరకు ఏ ఒక్కరినీ వదలని నీచమైన కామాంధులు ఉన్నారని పలువురు నటీమణులు సైతం వెల్లడించిన సందర్భాలున్నాయి. ఇక బుల్లితెర యాంకర్స్ నుంచి వెండితెర అగ్ర హీరోయిన్ల వరకు క్యాస్టింగ్ కౌచ్ పై ఎన్నో సంచలన నిజాలు బయటపెట్టిన సామాన్య ప్రజలను నివ్వెరపోయారు చేశారు. అయితే తాజాగా బాలీవుడ్ నటీమణి జరీన్‌ ఖాన్ కూడా తనకు ఎదురైన ఒక చేదు అనుభవం గురించి వెల్లడించారు. ఈ ముద్దగుమ్మ సల్మాన్‌ఖాzareen khan{#}bollywood;Cinema;Heroine;Athadu;Industries;Manam;jobముద్దు సీన్‌ రిహార్సల్‌ అంటూ బలవంతం చేసిన బాలీవుడ్ డైరెక్టర్..?ముద్దు సీన్‌ రిహార్సల్‌ అంటూ బలవంతం చేసిన బాలీవుడ్ డైరెక్టర్..?zareen khan{#}bollywood;Cinema;Heroine;Athadu;Industries;Manam;jobSat, 05 Jun 2021 15:00:00 GMTసినిమా ఇండస్ట్రీలో నటీమణులు లైంగిక వేధింపులకు గురి కావడం సర్వసాధారణం అయ్యింది. సినిమా ఇండస్ట్రీలో పదహారేళ్ల అమ్మాయిల నుంచి 60 ఏళ్ల ఆంటీల వరకు ఏ ఒక్కరినీ వదలని నీచమైన కామాంధులు ఉన్నారని పలువురు నటీమణులు సైతం వెల్లడించిన సందర్భాలున్నాయి. ఇక బుల్లితెర యాంకర్స్ నుంచి వెండితెర అగ్ర హీరోయిన్ల వరకు క్యాస్టింగ్ కౌచ్ పై ఎన్నో సంచలన నిజాలు బయటపెట్టి సామాన్య ప్రజలను నివ్వెరపోయారు చేశారు.


అయితే తాజాగా బాలీవుడ్ నటీమణి జరీన్‌ ఖాన్ కూడా తనకు ఎదురైన ఒక చేదు అనుభవం గురించి వెల్లడించారు. ఈ ముద్దగుమ్మ సల్మాన్‌ఖాన్‌ హీరోగా నటించిన ‘వీర్‌’ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకు హీరోయిన్ గా పరిచయం అయ్యారు. తర్వాత ‘హేట్‌ స్టోరీ -3’, ‘హౌస్‌ఫుల్‌-2’ సినిమాలతో సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నారు. తెలుగులో ఆమె 2019 లో విడుదలైన చాణక్య సినిమాలో "రా ఏజెంట్" గా నటించారు.



అయితే ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...  'నన్ను లైంగికంగా ఇబ్బంది పెట్టిన వాళ్ల పేర్లను వెల్లడించాలని అనుకోవడం లేదు. బాలీవుడ్‌ ఇండస్ట్రీకి వచ్చిన సమయంలో నాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. మొదట్లో అతడు నాతో చాలా మంచిగా మాట్లాడాడు. బాలీవుడ్ పరిశ్రమ మొత్తంలో అతడి కంటే మంచి వ్యక్తి లేడు అనే విధంగా నాతో చాలా మంచిగా ప్రవర్తించేవాడు. కొన్ని రోజుల తర్వాత అతను ఒక సినిమాలో నటించే అవకాశం ఇప్పిస్తానని నాతో చెప్పాడు. దీనితో నేను సరే అన్నాను కానీ అతను సినిమాలో ముద్దు సీన్‌ ఉంటుందని.. దానికి మనం ముందే రిహార్సల్‌ చేద్దామని నన్ను ఇంటికి పిలిపించి చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడు. నాకు ఇలాంటివి నచ్చవని.. వద్దని చెప్పి ఎంత వారించినా.. అతను మాత్రం మనసులోని భయాలన్ని పక్కన పెట్టు అంటూ పదే పదే నాతో చాలా దారుణంగా ప్రవర్తించాడు... "



"ఆయన విపరీత చేష్టలకి నేను షాక్ అయ్యాను. అప్పుడు అతను ‘మనం స్నేహితుల కంటే ఎక్కువ. ఇకపై నీ సినిమా వ్యవహారాలన్నింటినీ నేనే దగ్గరుండి చూసుకుంటా. అవసరమైతే ప్రతి ఒక్క సినిమాలో నిన్నే మెయిన్‌ హీరోయిన్‌గా ఉండేలా చూస్తా’ అని నన్ను తన దారిలోకి తెచ్చుకునేందుకు చాలా ప్రయత్నించాడు. కానీ నేను అతడిని దూరం పెట్టి కాల్ సెంటర్లో ఉద్యోగం చేస్తూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించాను," ఆమె సంచలన విషయాలు బయట పెట్టింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్ టాప్ 10 హీరోల భార్యల ప్రొఫెషనల్ లైఫ్ గురించి తెలుసా.. ?

అలా చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం: మహేష్ బాబు

ఈ వెరై "టీ " ట్రై చేశారా...?

హనుమ జన్మ నిర్ధారణలో ఒకడుగు వెనక్కు తగ్గిన టీటీడీ..!

ఆ అశ్లీల వీడియో లో ప్రముఖ నటి.. పోస్ట్ పెట్టి మరీ

వివాహ వ్యవస్థ పై పూరీ జగన్నాథ్ వివాదాస్పద కామెంట్స్ !

వామ్మో.. ఈ కరెంటు బిల్లుల దోపిడీ నిజమేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>