PoliticsMaddipati Lakshmi Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/kcr2d64c966-9fe7-4c10-b844-6252700da1a8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/kcr2d64c966-9fe7-4c10-b844-6252700da1a8-415x250-IndiaHerald.jpgతెలంగాణలో బీజేపీ ప్ర‌స్తుతం మంచి దూకుడు మీదుంది. దక్షిణాదిన క‌ర్ణాట‌క త‌రువాత అధికారంలోకి వ‌చ్చే రాష్ట్రం తెలంగాణ‌నే అని ఆ పార్టీ గట్టి న‌మ్మ‌కంతో ఉంది. దీంతో క్షేత్ర‌స్థాయిలో బ‌లం పెంచుకునేందుకు సక‌ల ప్ర‌య‌త్నాలు చేస్తోంది. కేంద్రంలో మోదీషాల ఆధ్వ‌ర్యంలో బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక పార్టీ ని వ్యూహాత్మ‌కంగా దేశ‌వ్యాప్తంగా విస్త‌రించే ల‌క్ష్యంతో ఉంది. kcr{#}రాజీనామా;Cheque;Bharatiya Janata Party;Dookudu;Party;Telangana Rashtra Samithi TRS;Congress;thursday;MP;Reddyతెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు చెక్ పెట్టేది బీజేపీనేనా..?తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు చెక్ పెట్టేది బీజేపీనేనా..?kcr{#}రాజీనామా;Cheque;Bharatiya Janata Party;Dookudu;Party;Telangana Rashtra Samithi TRS;Congress;thursday;MP;ReddyFri, 04 Jun 2021 05:00:00 GMTతెలంగాణలో బీజేపీ ప్ర‌స్తుతం మంచి దూకుడు మీదుంది. దక్షిణాదిన క‌ర్ణాట‌క త‌రువాత అధికారంలోకి వ‌చ్చే రాష్ట్రం తెలంగాణ‌నే అని ఆ పార్టీ గట్టి న‌మ్మ‌కంతో ఉంది. దీంతో క్షేత్ర‌స్థాయిలో బ‌లం పెంచుకునేందుకు సక‌ల ప్ర‌య‌త్నాలు చేస్తోంది. కేంద్రంలో మోదీషాల ఆధ్వ‌ర్యంలో బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక పార్టీ ని వ్యూహాత్మ‌కంగా దేశ‌వ్యాప్తంగా విస్త‌రించే ల‌క్ష్యంతో ఉంది. ఇది రాష్ట్ర పార్టీ నేత‌ల్లో ఆత్మ‌విశ్వాసం పెంచింద‌ని చెప్పాలి. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఇత‌ర పార్టీల నుంచి బ‌ల‌మైన నేత‌లు ప‌లువురు ఆ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు ప‌రిస్థితి మారింది. తెలంగాణ‌ బీజేపీ.. అధికారంలో ఉన్న‌ టీఆర్ఎస్ నుంచి సైతం నేత‌ల‌ను ఆక‌ర్షించ‌గ‌లుగుతోంది. ఇది ఒక‌ర‌కంగా కాంగ్రెస్ పార్టీకి మ‌రింత నిరుత్సాహం క‌లిగించే అంశం కాగా.. టీఆర్ఎస్ పార్టీకి  కూడా భ‌విష్య‌త్తులో ప్ర‌మాద ఘంటిక‌లు మోగించే విష‌య‌మేన‌ని చెప్పాలి.

ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మ‌ కాలం నుంచీ టీఆర్ఎస్ పార్టీలో కీల‌క నేత‌ల్లో ఒక‌రిగా ఉన్న ఈటెల రాజేశ్వ‌ర్ బీజేపీ కండువా క‌ప్పుకునేందుకు సిద్ధమైన త‌రుణంలోనే గ‌తంలో టీఆర్ఎస్ ఎంపీగా ఉన్న కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి కూడా కాషాయ జెండాకు జైకొట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. విశ్వేశ్వ‌ర్‌రెడ్డి కుటుంబానికి ఘ‌న‌మైన రాజ‌కీయ చ‌రిత్ర ఉంది. ప్ర‌ముఖ కాంగ్రెస్ నాయ‌కుడు దివంగ‌త రంగారెడ్డికి ఆయ‌న మ‌నుమ‌డు. మాజీ ముఖ్య‌మంత్రి, త‌మిళనాడు గ‌వ‌ర్న‌ర్‌గా ప‌ని చేసిన దివంగ‌త మ‌ర్రి చెన్నారెడ్డి కూడా ఆయ‌న‌కు ద‌గ్గ‌ర బంధువు.  కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి కొంత‌కాలం క్రితం టీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆయ‌నను కాంగ్రెస్ పార్టీలోకి చేర‌మ‌ని ఆహ్వానించినా ఆయ‌న అంగీక‌రించ‌లేదు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో గురువారం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ అయ్యారు. డీకే అరుణ ఫాంహౌజ్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డీకే అరుణ మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డిని బీజేపీలోకి రమ్మని ఆహ్వానించారు. దీనికి కొండా సానుకూలంగా స్పందించిన‌ట్టు తెలుస్తోంది. డీకే అరుణ కుటుంబం కూడా ద‌శాబ్దాల‌పాటు కాంగ్రెస్ పార్టీలో ప్ర‌ముఖ పాత్ర పోషించిన విష‌యం గుర్తు చేసుకోవాలి. బీజేపీ అధిష్ఠానం నుంచి కొన్ని స్ప‌ష్ట‌మైన హామీలు తీసుకుని  త్వరలోనే కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలోకి చేర‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి టీఆర్ఎస్‌కు బీజేపీ నుంచి భ‌విష్య‌త్తులో గ‌ట్టి స‌వాల్ ఎదురుకావ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ మళ్ళీ ఏసేశాడు.. ఆనందయ్య మందుని వదల్లేదు?

విజయం మీదే: ఇవి మీరు పాటించకపోతే ఏదీ సాధించలేరు ?

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్..!

ఓటీటీలో రానా సినిమా..?

ష‌ర్మిలా పార్టీపేరుకు ఈసీ ఆమోదం...పేరు ఇదే

భార్య కంటే అదే బెటర్.. పూరీ షాకింగ్ వ్యాఖ్యలు..?

ఆనందయ్య ఐ డ్రాప్స్.. అందుబాటులోకి ఎప్పుడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Maddipati Lakshmi Sailaja]]>