PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpfd738bdf-7ba7-4218-8147-48840f63e902-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpfd738bdf-7ba7-4218-8147-48840f63e902-415x250-IndiaHerald.jpgఏపీలో వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందంటే? జగన్ పనితీరు బాగుంటే ఆటోమేటిక్‌గా ఎమ్మెల్యేల పనితీరు బాగుంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏపీలో మెజారిటీ ఎమ్మెల్యేలు జగన్ ఇమేజ్ మీద ఆధారపడి ఉన్నారు. ఎన్నికల్లోనే పలువురు జగన్ బొమ్మ వల్లే ఎమ్మెల్యేలుగా గెలిచారు. కానీ ఇప్పటికీ చాలామంది ఎమ్మెల్యేలకు జగన్ బొమ్మే అండగా ఉంది.ysrcp{#}YCP;Jagan;Krishna River;TDP;Vallabhaneni Vamsi;District;Pedanaఅక్కడ ఎమ్మెల్యేలు హైలైట్ అవ్వడం కష్టమేనా!అక్కడ ఎమ్మెల్యేలు హైలైట్ అవ్వడం కష్టమేనా!ysrcp{#}YCP;Jagan;Krishna River;TDP;Vallabhaneni Vamsi;District;PedanaFri, 04 Jun 2021 04:00:00 GMTఏపీలో వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందంటే? జగన్ పనితీరు బాగుంటే ఆటోమేటిక్‌గా ఎమ్మెల్యేల పనితీరు బాగుంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏపీలో మెజారిటీ ఎమ్మెల్యేలు జగన్ ఇమేజ్ మీద ఆధారపడి ఉన్నారు. ఎన్నికల్లోనే పలువురు జగన్ బొమ్మ వల్లే ఎమ్మెల్యేలుగా గెలిచారు. కానీ ఇప్పటికీ చాలామంది ఎమ్మెల్యేలకు జగన్ బొమ్మే అండగా ఉంది.


అందుకే ఈ రెండేళ్లలో పలువురు ఎమ్మెల్యేలు రాష్ట్ర స్థాయిలో హైలైట్ అయిన సందర్భాలు లేవు. ఇక కీలకమైన కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యేల పరిస్తితి ఇలాగే ఉంది. గత ఎన్నికల్లో జిల్లాలో 16 సీట్లలో వైసీపీ 14 గెలుచుకుంది. టీడీపీ 2 సీట్లు గెలుచుకుంది. ఇక టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ సైతం వైసీపీ వైపుకు వచ్చేశారు.


దీంతో వైసీపీకి 15 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇక 15 మందిలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు జగన్ కేబినెట్‌లో ఉన్నారు. మంత్రులు కావడంతో ఈ ముగ్గురు రాష్ట్ర స్థాయిలో బాగా హైలైట్ అయ్యారు. ఇక జిల్లాలో చాలా తక్కువ మంది మాత్రం జిల్లా స్థాయిలో గానీ, రాష్ట్ర స్థాయిలో గానీ హైలైట్ అవుతున్నారు.


అందులో ముఖ్యంగా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌కు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉంది. ఇక సీనియర్ ఎమ్మెల్యేలు పార్థసారథి, సామినేని ఉదయభాను, మల్లాది విష్ణులకు కూడా గుర్తింపు బాగానే ఉంది. అయితే మిగతా ఎమ్మెల్యేలు నియోజకవర్గ స్థాయికే పరిమితమయ్యారు. ఇక తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు, ఈ రెండేళ్లలో పెద్దగా హైలైట్ అవ్వలేదు.


అటు సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్న మేకా ప్రతాప్, రక్షణనిధిలు సైతం బాగా హైలైట్ అయిన సందర్భాలు లేవు. ఇక టీడీపీని వీడి వైసీలోకి వచ్చిన వల్లభనేని వంశీకి రాష్ట్ర స్థాయిలో బాగానే క్రేజ్ ఉంది. మొత్తానికైతే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు ఇంకా హైలైట్ అవ్వాల్సిన అవసరముంది. 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ మళ్ళీ ఏసేశాడు.. ఆనందయ్య మందుని వదల్లేదు?

విజయం మీదే: ఇవి మీరు పాటించకపోతే ఏదీ సాధించలేరు ?

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్..!

ఓటీటీలో రానా సినిమా..?

ష‌ర్మిలా పార్టీపేరుకు ఈసీ ఆమోదం...పేరు ఇదే

భార్య కంటే అదే బెటర్.. పూరీ షాకింగ్ వ్యాఖ్యలు..?

ఆనందయ్య ఐ డ్రాప్స్.. అందుబాటులోకి ఎప్పుడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>