Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-6aed3db5-6caf-45fd-beac-ead94267742c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-6aed3db5-6caf-45fd-beac-ead94267742c-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో వాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు వ్యాక్సిన్ ను కొరతను అధిగమిస్తూ అటు ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందజేసే విధంగా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. ఓవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి టీకా అందించడం ద్వారా వైరస్ పై మరింత సమర్థవంతంగా పోరాటం చేయవచ్చు అని అటు తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ విషయంలో ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది తెలంగాణ ప్Kcr{#}Telangana;Coronavirus;KCRకేసిఆర్ గ్రీన్ సిగ్నల్.. ఇక వారికి కూడా వ్యాక్సిన్?కేసిఆర్ గ్రీన్ సిగ్నల్.. ఇక వారికి కూడా వ్యాక్సిన్?Kcr{#}Telangana;Coronavirus;KCRFri, 04 Jun 2021 10:00:00 GMTతెలంగాణ రాష్ట్రంలో వాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.  ఎప్పటికప్పుడు వ్యాక్సిన్ ను కొరతను అధిగమిస్తూ అటు ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందజేసే విధంగా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది.  ఓవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి టీకా అందించడం ద్వారా వైరస్ పై మరింత సమర్థవంతంగా పోరాటం చేయవచ్చు అని అటు తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ విషయంలో ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది తెలంగాణ ప్రభుత్వం.



 ఇప్పటికే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి..  ప్రజల తో ఎప్పుడూ దగ్గరగా ఉండే పత్రికా విలేకరులు అందరికీ కూడా వ్యాక్సిన్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన వ్యాక్సినేషన్  ప్రక్రియ కూడా కొనసాగుతుంది.  ఎంతో మంది జర్నలిస్టులు ఇక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఇక ఇప్పుడు మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఇంజనీర్లకు కూడా వ్యాక్సిన్ అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.




 ఇక వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు అందరికీ కూడా టీకా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు కేసీఆర్. ఇరిగేషన్,విద్యుత్, పంచాయతీరాజ్,రోడ్లు మరియు భవనాలు, ఆర్డబ్ల్యూఎస్ వంటి విభాగాల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు.. ఇక కరోనా పరిస్థితుల్లో కూడా క్షేత్రస్థాయిలో పని చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.  ఇలాంటి నేపథ్యంలోనే వీరు ప్రజలకు దగ్గరగా ఉండి పని చేసే పరిస్థితులు కూడా ఉంటాయి. దీంతో ఇలా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు అందరికీ టీకా అందించడం ద్వారా ఎంతో ప్రయోజనం ఉంటుంది అని భావించింది తెలంగాణ ప్రభుత్వం. కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకు ఏకంగా 20 మంది ఇంజనీర్లు మృతిచెందిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గానగంధర్వుడు ఎస్పీ బాలు..మొదటి, చివరి పాటలు ఇవే

ఈటల రాజీనామా ప్రకటన?

ఎస్పీ బాలు కి టాలీవుడ్ స్వర నీరాజనం ...

మరణ శిక్ష నుంచి కేరళ వ్యక్తిని కాపాడిన ఎన్ఆర్ఐ..?

సమంత ను కలవర పెడుతున్న హ్యాష్ ట్యాగ్ !

విజయం మీదే: ఇవి మీరు పాటించకపోతే ఏదీ సాధించలేరు ?

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>