PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jaganbed0c632-fc6f-42df-9dc7-60c9d52b716b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jaganbed0c632-fc6f-42df-9dc7-60c9d52b716b-415x250-IndiaHerald.jpgహనుమంతుడి జన్మస్థలంపై కొద్దికాలంగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. హనుమంతుడు తిరుమలలోని అంజనాద్రిలోనే జన్మించారని టీటీడీ అంటోంది. ఇవాళ హనుమంతుడి జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. దీంతో తిరుపతిలో గోవింద ఆనంద సరస్వతి స్వామి ప్రెస్మీట్ పెట్టి మరీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీ హనుమంతుడి జయంతి వ్యవహారం హాస్య దారవాహికంలా ఉందని ఆయన అన్నారు. హనుమంతుడిపై టీటీడీ ప్రచురించిన పుస్తకంలో ఇచ్చిన జయంతికి, ఇప్పుడు నిర్వహిస్తున్న తేదీలకు పొంతన లేదని అన్నారు. టీటీడీ చెప్పినట్టు శ్రావణ మాసం అంటే జులjagan{#}CM;Tirumala Tirupathi Devasthanam;Jayanthi;Govinda;Vishakapatnam;Dwaraka;kanchi;Kanchipuram;shankar;Jaganజగన్ లాంటి వ్యక్తిని మారు వేషంలో తీసుకు వస్తే సీఎం పోస్ట్ ఇచ్చేస్తారా?జగన్ లాంటి వ్యక్తిని మారు వేషంలో తీసుకు వస్తే సీఎం పోస్ట్ ఇచ్చేస్తారా?jagan{#}CM;Tirumala Tirupathi Devasthanam;Jayanthi;Govinda;Vishakapatnam;Dwaraka;kanchi;Kanchipuram;shankar;JaganFri, 04 Jun 2021 15:00:00 GMTహనుమంతుడి జన్మస్థలంపై కొద్దికాలంగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. హనుమంతుడు తిరుమలలోని అంజనాద్రిలోనే జన్మించారని టీటీడీ అంటోంది. ఇవాళ హనుమంతుడి జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. దీంతో తిరుపతిలో గోవింద ఆనంద సరస్వతి స్వామి ప్రెస్మీట్ పెట్టి మరీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీ  హనుమంతుడి జయంతి వ్యవహారం హాస్య దారవాహికంలా ఉందని ఆయన అన్నారు. హనుమంతుడిపై టీటీడీ ప్రచురించిన పుస్తకంలో ఇచ్చిన జయంతికి, ఇప్పుడు నిర్వహిస్తున్న తేదీలకు పొంతన లేదని అన్నారు. టీటీడీ చెప్పినట్టు శ్రావణ మాసం అంటే జులై లో జరగాలని, ఇదేనా టీటీడీ పండితులు, వీసీలు హనుమంతుడికి బర్త్ సర్టిఫికెట్ ఇచ్చేదని ప్రశ్నించారు. 


హనుమంతుడి జన్మపై తెలుగులో ఎందుకు బుక్ ప్రింట్ చేస్తారా? ఇంగ్లీష్ లో చేస్తే టీటీడీ గుట్టు అందరికి తెలిసిపోతుంది అనా అని ఆయన ప్రశ్నించారు. రాత్రికి రాత్రి కల గన్నారా ? టీటీడీ అహంకారాన్ని వదలాలని ఆయన అన్నారు. తప్పును ఒప్పుకుంటే పరువు పోతుంది అని తప్పుల పైన తప్పులు చేస్తున్నారని ఆయన విమర్సించారు. దేశ వ్యాప్తంగా చైత్ర మాసంలో అంటే మార్చిలో చేస్తారని టీటీడీ సత్యాన్ని చెప్పకుండా, తప్పుదారి పట్టిస్తోంది. అబద్ధాల పైన అబద్దాలు చెబుతున్నారని అన్నారు.  జపాలి తీర్థంలో హనుమంతుడు పుట్టాడు అన్నారు. ఇప్పుడు ఆకాశగంగా అంటున్నారు, ఇలా క్షణానికి ఒక మాట టీటీడీ చెప్పటం తగదని అన్నారు. 


శంకర, మద్వ, రామానుజ పెద్దలను టీటీడీ వెంటనే సంప్రదించాలన్న ఆయన నేను అంగీకరించినట్టు  ప్రచారం చేశారని ఆయన అన్నారు. విశాఖ శారదా పీఠం డూప్లికేట్ పీఠం, శంకరాచార్యులు పెట్టిన శృంగేరి, బద్రి, పూరి, ద్వారక ఈ నాలుగుపీఠాలు, కంచి పీఠం మాత్రమే శంకర పీఠాలని ఆయన అన్నారు. ఉత్తర భారతంలో ఇలాంటి డూప్లికేట్ మాటలు చెపితే వదలరు. తరుముకుంటారని ఆయన అన్నారు. సీఎం మద్దతు ఉంటే శంకర్ పీఠం అవుతుందా? జగన్ లాంటి వ్యక్తిని మారు వేషంలో తీసుకు వస్తే సీఎం పోస్ట్ ఇచ్చేస్తారా? అని రాస్నించారు. సన్యాసులు రాజనీతిలో రాకూడదని ఆయన కామెంట్ చేశారు. 

 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అమ్మ పాత్రల్లో పవన్ కళ్యాణ్ హీరోయిన్స్

మంచిమాట : మోసాన్ని మోసంతోనే జయించాలి..

ఆ ఒక్క పాట కోసం బాలు తీసుకున్న పారితోషకం ఎంతో తెలుసా.. ?

ఎవరన్నారు .. ఎస్ పి బాలు చనిపోయారని ?

భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు..?

హరీష్ రావుకు కూడా అవమానాలు: ఈటల

ఎస్పీ బాలు ప్రయాణంలో ప్రజల గుండెల్లో నిలిచిన టాప్ 10 పాటలు ఇవే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>