PoliticsMaddipati Lakshmi Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/rrr-etela2e8539bd-0109-4b09-bc75-aa39fc459258-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/rrr-etela2e8539bd-0109-4b09-bc75-aa39fc459258-415x250-IndiaHerald.jpgరెండు తెలుగు రాష్ట్రాల్లో కొంత‌కాలంగా రాజ‌కీయంగా సంచ‌ల‌న ప‌రిణామాలు జ‌రుగుతున్నాయి. తెలంగాణ‌లో రాష్ట్ర విభ‌జ‌న ఉద్య‌మ కాలం నుంచీ టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్‌కు న‌మ్మిన‌బంటుగా, పార్టీ అగ్ర‌నాయ‌కుల్లో ఒక‌రిగా ఉంటూ వ‌స్తున్న ఈటెల రాజేంద‌ర్ అధినాయ‌క‌త్వంపై తిరుగుబాటు బావుటా ఎగుర‌వేసి పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు.RRR-Etela{#}రాజీనామా;Telugu;Telangana Rashtra Samithi TRS;Party;Delhi;KCR;Minister;MLA;CBI;Smart phone;YCP;media;Bharatiya Janata Partyఏపీలో ర‌ఘురామ‌.. తెలంగాణ‌లో ఈటెల.. పోలిక ఉందా..?ఏపీలో ర‌ఘురామ‌.. తెలంగాణ‌లో ఈటెల.. పోలిక ఉందా..?RRR-Etela{#}రాజీనామా;Telugu;Telangana Rashtra Samithi TRS;Party;Delhi;KCR;Minister;MLA;CBI;Smart phone;YCP;media;Bharatiya Janata PartyFri, 04 Jun 2021 18:39:14 GMTరెండు తెలుగు రాష్ట్రాల్లో కొంత‌కాలంగా రాజ‌కీయంగా సంచ‌ల‌న ప‌రిణామాలు జ‌రుగుతున్నాయి. తెలంగాణ‌లో రాష్ట్ర విభ‌జ‌న ఉద్య‌మ కాలం నుంచీ టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్‌కు న‌మ్మిన‌బంటుగా, పార్టీ అగ్ర‌నాయ‌కుల్లో ఒక‌రిగా ఉంటూ వ‌స్తున్న ఈటెల రాజేంద‌ర్ అధినాయ‌క‌త్వంపై తిరుగుబాటు బావుటా ఎగుర‌వేసి పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. మ‌రోప‌క్క ఏపీకి సంబంధించి వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా పేరున్న ఆ పార్టీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు సొంత పార్టీ పాల‌న పైన‌, నాయ‌క‌త్వం పైనా ఘాటుగా విమ‌ర్శ‌లు చేస్తూ ర‌చ్చ‌కెక్కారు. ఈయ‌న వ్య‌వ‌హారం ఏకంగా అరెస్టు వ‌ర‌కు దారితీసి ప్ర‌స్తుతం న్యాయ‌స్థానాలకు చేరింది. ఢిల్లీ స్థాయిలో సంచ‌ల‌నాల‌కు వేదిక‌గా మారింది. ఇక్క‌డ వేర్వేరు రాష్ట్రాల‌కు పార్టీల‌కు చెందిన ఈ ఇరువురు నాయ‌కుల ఉదంతాల‌ మ‌ధ్య కొన్ని పోలిక‌లు, వైరుధ్యాలు ఉన్నాయి.

కేసీఆర్‌కు ఈటెలకూ మ‌ధ్య మొద‌టినుంచీ చాలామంచి స‌బంధాలు ఉండేవి. కేసీఆర్ వ‌ద్ద‌ హ‌రీష్‌రావుతో స‌మాన‌మైన స్థానం ఈటెల‌కూ ఉండేద‌ని ఆ పార్టీ వ‌ర్గాలు చెప్పుకునేవి. అయితే కొంత‌కాలంగా ఈటెల అసంతృప్తిగా ఉన్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. పార్టీ అధిష్ఠానానికి ఆయ‌న‌కూ దూరం పెరుగుతూ వ‌చ్చింది. తాము ఉద్య‌మ నాయ‌కుల‌మ‌ని, బానిస‌లం కాద‌ని రాజేంద‌ర్ ఒక సంద‌ర్భంలో చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టించాయి. ఆ త‌ర్వాత కొద్దికాలానికే అక్ర‌మ ఆస్తుల‌ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఆయ‌న‌ను మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌డంతో విభేదాలు బ‌హిర్గ‌త‌మ‌య్యాయి. ఇప్పుడాయ‌న పార్టీలో త‌న‌కు తీవ్ర అవ‌మానం జ‌రిగింద‌ని పార్టీకి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. కేసీఆర్ కుటుంబ పాల‌న‌కు వ్య‌తిరేకంగా పోరాడ‌తాన‌ని తేల్చి చెప్పారు. ఇక రఘురామ‌రాజు విష‌యానికొస్తే ఆయ‌న రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి భ‌క్తుడిన‌ని చెప్పుకుంటారు. అంతేకాదు.. ఆయ‌న మ‌నుమ‌డికి ఆయ‌న పేరు పెట్టుకున్నారు కూడా. ప‌దేళ్ల క్రితం వైఎస్ జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసు విచార‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలో జ‌గ‌న్‌కు అండ‌గా నిలిచారు. సీబీఐ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ ఫోన్ కాల్స్ డేటా బ‌య‌ట‌పెట్ట‌డం ద్వారా మొద‌టిసారి ర‌ఘురామ‌ పేరు రాష్ట్ర‌వ్యాప్తంగా తెలిసింది. వైఎస్ కుటుంబం మీద త‌న‌కున్న అభిమానం తోనే ఆ విష‌యంలో తాను క‌లుగ‌జేసుకున్న‌ట్టు ఆయ‌న అప్ప‌ట్లో చెప్పారు. వైసీపీ ఎంపీగా గెలిచిన త‌రువాత ఏమైందో ఏమోగాని ముఖ్య‌మంంత్రి జ‌గ‌న్‌.. ఎంపీనైన త‌న‌కు క‌నీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వ‌డం లేద‌ని, పాల‌న‌లో లోపాల‌పై వివ‌రించేందుకూ అవ‌కాశం లేదంటూ మీడియా వేదిక‌గా విమ‌ర్శ‌ల ప‌ర్వం మొద‌లుపెట్టారు.  తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న వైసీపీ ప్ర‌భుత్వ ప‌త‌నానికి, వైఎస్ జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు లక్ష్యంగా పోరాటం చేస్తున్నారు.  

సొంత పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి పార్టీ అధినాయ‌క‌త్వంతో  పోరాటానికి సిద్ధ‌మైన ఈ ఇరువురు నాయ‌కుల మ‌ధ్య ఇంత‌వ‌ర‌కు మాత్ర‌మే పోలిక ఉంది. త‌న‌ను పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయేలా టీఆర్ఎస్ నాయ‌క‌త్వం పొమ్మ‌న‌లేక పొగ‌బొట్టేలా వ్య‌వ‌హ‌రించింద‌ని, అవ‌మానాల‌కు గురిచేసింద‌ని ఈటెల ఆరోపిస్తున్నారు. ఈ విష‌యంలో ఆయ‌న‌కు ప్ర‌జ‌ల‌నుంచి సానుభూతి వ్య‌క్త‌మ‌వుతుండ‌టం విశేషం. ఈ కార‌ణంగానే ఆయ‌న‌ను త‌మ పార్టీలోకి చేర్చుకునేందుకు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పార్టీలు పోటీప‌డి ఆహ్వానం ప‌లికాయి. అయితే ఆయ‌న ఇంకా ఏ పార్టీలోకి చేరేదీ పూర్తిస్థాయిలో స్పష్టం చేయ‌లేదు. కానీ ఈటెల కాషాయ కండువా క‌ప్పుకోవ‌డం ఖాయ‌మ‌ని జ‌రుగుతున్న ప‌రిణామాలు సూచిస్తున్నాయి. మొత్తానికి ఈటెల న‌మ్ముకున్న‌ది మాత్రం ప్ర‌జాబ‌లాన్ని. కానీ ర‌ఘురామ‌రాజు వ్య‌వ‌హారం వేరు. ఆయ‌న పార్టీకి గాని ప‌ద‌వికి గాని ఇప్ప‌టికీ రాజీనామా చేయ‌లేదు. ప్ర‌జాక్షేత్రంలో త‌న‌కున్న బ‌ల‌మేమిటో నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం లేదు. రాజీనామా చేస్తే తిరిగి గెల‌వ‌డం ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అంత సులువు కాద‌ని ఆయ‌న‌కు తెలుసు. పార్టీ త‌న‌ను స‌స్పెండ్ చేస్తే త‌న‌కు అనుకూల‌మైన పార్టీలో చేరేందుకు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతున్నాయి. మ‌రి ఈ ఇద్ద‌రు నాయ‌కుల పోరాటం వీరిని ఏ తీరాలకు చేర్చ‌నుందో రాబోయే రోజుల్లో తేల‌నుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాబుపై సాయిరెడ్డి వ్యంగ్య‌స్త్రాలు...

‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ టీజర్ రిలీజ్ అప్పుడే..?

విడాకుల కోసం రచ్చ చేసిన రంభ.. ఎందుకు సైలెంట్ అయ్యింది

బ్రేకింగ్ : 12 నుండి 15 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆమోదం..!

సత్కరించుకునే అవకాశం దక్కినందుకు గర్వంగా ఉంది!

ధూళిపాళ్లకి సెట్ అయినట్లేనా..!

ప్రేమ దేశం హీరో ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Maddipati Lakshmi Sailaja]]>