MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kgf-directer-bhirathday-videos-virelb682e74b-cd2e-4cf0-8e72-2f94fd1f1a0f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kgf-directer-bhirathday-videos-virelb682e74b-cd2e-4cf0-8e72-2f94fd1f1a0f-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో ఓవర్ నైట్ లోనే స్టార్స్ అయిన హీరోలు, హీరోయిన్లు ఉన్నారు. అలాగే ఏదైనా సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయితే ఆ డైరెక్టర్ కోసం వేచి వుండే హీరోలు కూడా ఉన్నారు. అలాంటి వరసలో ముందున్న డైరెక్టర్ ఎవరంటే "ప్రశాంత్ " ( కేజిఎఫ్ డైరెక్టర్) అని చెప్పవచ్చు.అయితే సరైన బ్లాక్ బాస్టర్ హిట్ పడితే.. టెక్నీషియన్లు, ఆర్టిస్టుల కెరీర్ లు మారిపోతాయి అనడానికి కే జి ఎఫ్, బాహుబలి లాంటి సినిమాలను ఉదాహరణగా తీసుకోవచ్చు. అందులో రాజమౌళి దాదాపుగా ఎక్కువ సినిమాలు తీశాడు అని చెప్పవచ్చు. కానీ కేజిఎఫ్ డైరెక్టర్ మాKGF DIRECTER BHIRATHDAY VIDEOS VIREL{#}Director;Cinema;KGF;Bahubali;Rajamouli;Kannada;Indian;Telugu;prasanth;Prashant Kishor;Chitram;Yash;Hero;Indiaకేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ పుట్టినరోజు సందర్భంగా వీడియో వైరల్..కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ పుట్టినరోజు సందర్భంగా వీడియో వైరల్..KGF DIRECTER BHIRATHDAY VIDEOS VIREL{#}Director;Cinema;KGF;Bahubali;Rajamouli;Kannada;Indian;Telugu;prasanth;Prashant Kishor;Chitram;Yash;Hero;IndiaFri, 04 Jun 2021 19:07:39 GMT
సినిమా ఇండస్ట్రీలో ఓవర్ నైట్ లోనే స్టార్స్ అయిన హీరోలు, హీరోయిన్లు ఉన్నారు. అలాగే ఏదైనా సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయితే ఆ డైరెక్టర్ కోసం వేచి వుండే హీరోలు కూడా ఉన్నారు. అలాంటి వరసలో ముందున్న డైరెక్టర్ ఎవరంటే "ప్రశాంత్  " ( కేజిఎఫ్ డైరెక్టర్) అని చెప్పవచ్చు.

అయితే సరైన బ్లాక్ బాస్టర్ హిట్ పడితే.. టెక్నీషియన్లు, ఆర్టిస్టుల కెరీర్ లు  మారిపోతాయి అనడానికి కే జి ఎఫ్, బాహుబలి  లాంటి సినిమాలను ఉదాహరణగా తీసుకోవచ్చు. అందులో రాజమౌళి దాదాపుగా ఎక్కువ సినిమాలు తీశాడు అని చెప్పవచ్చు. కానీ కేజిఎఫ్ డైరెక్టర్ మాత్రం కేవలం ఒకే ఒక్క సినిమా "ఉగ్రం  " అనే కన్నడ సినిమాతో ఎంట్రీ చేశాడు.


ఉగ్రం సినిమా బాగున్నప్పటికీ.. తన ప్రతిభను మాత్రం బయటపెట్టిన రెండవ సినిమా కేజీఎఫ్ అని చెప్పవచ్చు. ఈ సినిమా ఇతనిని ఏకంగా పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ గా చేసింది. ఈ సినిమా చూసిన పలు భాషల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. తెలుగు ప్రజలే కాకుండా, హీరోలు, నిర్మాతలు ప్రశాంత్ డైరెక్టర్ ని మెచ్చుకున్నారు. ఇప్పటికే పలు ( ఎన్టీఆర్,ప్రభాస్) స్టార్  హీరోలు అతడి డైరెక్షన్ లో నటించడానికి ఓకే చెప్పారు.
" style="height: 370px;">



ఇంత పేరు సంపాదించిన కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ పుట్టిన రోజు నేడు. సలార్ చిత్రం నిర్మిస్తున్న హోంబేలే ఫిలిమ్స్ ఒక ట్రిబ్యూట్  వీడియోను రూపొందించింది. ఆ వీడియోలో ప్రశాంత్ తన టీంతో కలిసి ఎంత ఉత్సాహంగా పని చేస్తున్నాడో చూపించే వీడియో ఇది. ఈ వీడియోకి కేజిఎఫ్ హీరో యష్ చేసిన వ్యాఖ్యలు సైతం దీనికి జోడించారు. ప్రశాంత్ ప్రతిభ విషయంలో కేజిఎఫ్ ఆరంభం మాత్రమే అని.. అతడి నుంచి చాలా అద్భుతాలు చూడబోతారని హీరో యష్ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. కేవలం తన రెండవ సినిమాతోనే ఏకంగా పాన్ ఇండియా లెవెల్ కి ఎదిగిన ప్రశాంత్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. అంతలా తన దర్శకత్వం తో అందరినీ మెప్పించారు. ఇక స్టార్ హీరో యష్ సినీ కెరీర్ నే మార్చేశాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ నటుడు ఒక సూపర్ మూవీ దర్శకుడు అని మీకు తెలుసా.. ?

‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ టీజర్ రిలీజ్ అప్పుడే..?

విడాకుల కోసం రచ్చ చేసిన రంభ.. ఎందుకు సైలెంట్ అయ్యింది

బ్రేకింగ్ : 12 నుండి 15 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆమోదం..!

సత్కరించుకునే అవకాశం దక్కినందుకు గర్వంగా ఉంది!

ధూళిపాళ్లకి సెట్ అయినట్లేనా..!

ప్రేమ దేశం హీరో ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>