SportsDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ms-dhoni-and-ruthuraj-gaikwad-6b34eaa7-1aa9-4499-877c-8d4c311e9b77-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ms-dhoni-and-ruthuraj-gaikwad-6b34eaa7-1aa9-4499-877c-8d4c311e9b77-415x250-IndiaHerald.jpgటీమిండియా మాజీ క్రికెట్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ అంటే చాలు.. లక్షల్లో అభిమానులు ఉంటారు. భారతీయ క్రికెట్ టీం లో అత్యధికంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను పొందిన ఏకైక వ్యక్తి మహేంద్ర సింగ్ ధోనీ అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈయన క్రికెట్ మైదానంలోకి వస్తే చాలు.. ప్రేక్షకులు ఎంత హంగామా చేస్తారో మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా మహేంద్రసింగ్ ధోని ఐపీఎల్ మ్యాచ్ కు కెప్టెన్ గా ఉంటూ ముందుకు నడిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే అనుకోకుండా పోయిన సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ఎవరూ ఊహించని విధంగా మహేంద్ర సింగ్ ధోనీ తన రిటైర్MS DHONI AND RUTHURAJ GAIKWAD{#}BCCI;2020;Cricket;MS Dhoni;Audience;Chennai;raj;Interview;Ideaస్పోర్ట్స్ : ఆ విషయాన్ని ధోనీతో అడగలేకపోయాను అంటున్న సీఎస్కే ప్లేయర్..స్పోర్ట్స్ : ఆ విషయాన్ని ధోనీతో అడగలేకపోయాను అంటున్న సీఎస్కే ప్లేయర్..MS DHONI AND RUTHURAJ GAIKWAD{#}BCCI;2020;Cricket;MS Dhoni;Audience;Chennai;raj;Interview;IdeaFri, 04 Jun 2021 16:00:00 GMT
టీమిండియా మాజీ క్రికెట్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ అంటే చాలు.. లక్షల్లో అభిమానులు ఉంటారు. భారతీయ క్రికెట్ టీం లో అత్యధికంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను పొందిన ఏకైక వ్యక్తి మహేంద్ర సింగ్ ధోనీ అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈయన క్రికెట్ మైదానంలోకి వస్తే చాలు.. ప్రేక్షకులు ఎంత హంగామా చేస్తారో మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా మహేంద్రసింగ్ ధోని ఐపీఎల్ మ్యాచ్ కు కెప్టెన్ గా ఉంటూ ముందుకు నడిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే అనుకోకుండా పోయిన సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ఎవరూ ఊహించని విధంగా మహేంద్ర సింగ్ ధోనీ తన రిటైర్మెంట్ను ప్రకటించాడు. తన రిటైర్మెంట్ గురించి చెన్నై టీం లో కనీసం ఎవరికీ కూడా ఈ విషయం తెలియదు అంటూ సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపారు. అంతేకాకుండా రుతు రాజ్ ఆరోజు జరిగిన కొన్ని సంఘటనలు ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలిపాడు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
రుతు రాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. ధోని రిటైర్మెంట్ నన్ను గతేడాది చాలా షాక్కు గురి చేసింది. 2020, ఆగస్టు 15 ఇంటర్నేషనల్ క్రికెట్ కి ధోని సడన్గా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. అయితే నేను కూడా ఐపీఎల్ 2020 సీజన్ కోసం అప్పుడే ప్రాక్టీస్ ముగించుకొని సహచరులతో కలిసి డిన్నర్ కోసం వెళ్లాను .. అంతలో చెన్నై టీమ్లోని ఒకరు వచ్చి ధోని రిటైర్మెంట్ ప్రకటించినట్లు మాతో చెప్పాడు.. " అంటూ గైక్వాడ్ గుర్తు చేసుకున్నాడు.
అంతేకాదు చెన్నై సూపర్ కింగ్స్ టీం లో ఆ వాతావరణమే కనిపించలేదని ఆయన  తెలిపారు. అంతే కాకుండా ధోని రిటైర్మెంట్ పై కనీసం ఎవ్వరికీ ఆ ఐడియా కూడా లేదు.. నేను అలానే షాక్ లో ఉండిపోయా.. ధోనీ రిటైర్మెంట్ వాస్తవమేనా..? అని ధోనిని ఆ సమయంలో అడిగేందుకు కూడా నాకు ధైర్యం లేకపోయింది. ఆ విషయం విన్నప్పటి నుంచి,  ఆ షాక్ లో నుంచి బయటికి రావడానికి నాకు 2-3 రోజులు సమయం పట్టిందని రుతురాజ్ గైక్వాడ్ వెల్లడించారు.
2021 ఐపీఎల్ సీజన్ ని మే 4న వాయిదా వేసిన  విషయం మనకు తెలిసిందే. అలా వేసిన మ్యాచ్ లను bcci యూఏఈ వేదికగా సెప్టెంబర్-అక్టోబర్ లో మిగిలిన మ్యాచ్ లు నిర్వహించాలని సూచనలు కనిపిస్తున్నాయి. కానీ షెడ్యూల్ ప్రకారం టోర్నీలో మొత్తం 60 మ్యాచులు జరగాల్సి ఉండగా,  ఇప్పటివరకు కేవలం 29 మ్యాచ్ లు మాత్రమే ముగిశాయి. అందులో CSK ఆడిన  మ్యాచ్ లలో ధోని 37 పరుగులు మాత్రమే చేశాడు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రెచ్చిపోయిన స‌మంత‌..ఈ రేంజ్ లో సినిమాల్లో కూడా చూపించ‌లేదుగా.. !

బ్రేకింగ్ : 12 నుండి 15 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆమోదం..!

సత్కరించుకునే అవకాశం దక్కినందుకు గర్వంగా ఉంది!

ధూళిపాళ్లకి సెట్ అయినట్లేనా..!

ప్రేమ దేశం హీరో ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసా?

ఆ వారసుల ఎంట్రీ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులు

ఏపీ ప్ర‌భుత్వానికి "మెఘా" సాయం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>