MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balgauagbaslyag-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balgauagbaslyag-415x250-IndiaHerald.jpgఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అంటే తెలుగు సినీ సంగీత ప్రపంచంలో తెలియని వారుండరు. ఒక రకంగా ఆయనకు ముందు ఆ తర్వాత అనేంతగా తెలుగుతో పాటు దక్షిణాది సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు బాలు. గత ఏడాది ఆయన భౌతికంగా దూరం అయినా పాటల రూపంలో మన మధ్యే ఉన్నారు. ఆయన చివరి కోరిక ఏమిటో తెలుసా ? ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆ విషయం ఏంటో పరిశీలిద్దాం. ఇంజినీరింగ్ మధ్యలో మానేసి ఆయన సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టారు. నాలుగు దశాబ్దాల కెరీర్ లో సుమారు 40 వేలకు పైగా పాటలు పాడారు ఆయన. కెరీర్ లో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన బాలు భారతీయSP-Balasubramaniam{#}Telugu;Sangeetha;Jayanthi;Cigaretteఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చివరి కోరిక ఇదే..ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చివరి కోరిక ఇదే..SP-Balasubramaniam{#}Telugu;Sangeetha;Jayanthi;CigaretteFri, 04 Jun 2021 07:12:00 GMTఎస్పీ బాల సుబ్రహ్మణ్యం  అంటే తెలుగు సినీ సంగీత ప్రపంచంలో తెలియని వారుండరు. ఒక రకంగా ఆయనకు ముందు ఆ తర్వాత అనేంతగా తెలుగుతో పాటు దక్షిణాది సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు బాలు. గత ఏడాది ఆయన భౌతికంగా దూరం అయినా పాటల రూపంలో మన మధ్యే ఉన్నారు. ఆయన చివరి కోరిక ఏమిటో తెలుసా ? ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆ విషయం ఏంటో పరిశీలిద్దాం. ఇంజినీరింగ్ మధ్యలో మానేసి ఆయన సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టారు. నాలుగు దశాబ్దాల కెరీర్ లో సుమారు 40 వేలకు పైగా పాటలు పాడారు ఆయన. కెరీర్ లో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన బాలు భారతీయ సంగీత ప్రపంచంలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. 


ఏకంగా 16 భాషల్లో పాటలు పాడారు బాల సుబ్రహ్మణ్యం. అయితే తన జీవితంలో చివరి కోరిక ఏమిటనేది ఆయన ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన జీవితం వింతైనదని పేర్కొన ఆయన మొదట్లో నాకు సంగీతంపై ఆసక్తి లేదని ఇంజనీర్ కావాలని కలలు కని చివరికి గాయకుడిని అయ్యానని అన్నారు. సింగర్‌గా ఎలాంటి నిబంధనలు పెట్టుకోలేదన్న ఆయన సుమారు 20ఏళ్ల పాటు సిగరెట్లు తాగానన్న ఆయన 40 ఏళ్ల కెరీర్ లో రోజుకు 10 గంటలు పాటలు పాడానని అన్నారు. అయితే నేను అందరికీ గాత్రం మార్చి పాడలేదు. 


అల్లురామలింగయ్యకు, రాజబాబుకు వారివారి గాత్రాలకు దగ్గరగా పాడానని, కేవలం ఎన్టీయార్‌, ఏఎన్నార్‌లకు మాత్రమే గాత్రం మార్చి పాడేవాడినని అన్నారు. తనకున్న పేరు ప్రతిష్టలు వల్ల నా కొడుకు కెరీర్ సక్రమంగా కొనసాగలేదని చరణ్‌ను అందరూ తనతో పోల్చి చూడటం వల్ల వాడికి చాలా నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు. మరణించే వరకు పాడుతూనే ఉండాలని చావు నా దగ్గరికి వచ్చినట్టు తెలియకుండా నేను కన్ను మూయాలి అని అదే తన చివరి కోరిక’ అంటూ బాలు తన మనసులో మాట సదరు ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కానీ ఆయన కోరిక తీరకుండానే కన్నుమూశారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కెనడాకు కోవాగ్జిన్... మనసంగతేంటి.. ?

విజయం మీదే: ఇవి మీరు పాటించకపోతే ఏదీ సాధించలేరు ?

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్..!

ఓటీటీలో రానా సినిమా..?

ష‌ర్మిలా పార్టీపేరుకు ఈసీ ఆమోదం...పేరు ఇదే

భార్య కంటే అదే బెటర్.. పూరీ షాకింగ్ వ్యాఖ్యలు..?

ఆనందయ్య ఐ డ్రాప్స్.. అందుబాటులోకి ఎప్పుడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>