MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/priyamani42062770-41c1-40b0-9be7-bcebd054bffd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/priyamani42062770-41c1-40b0-9be7-bcebd054bffd-415x250-IndiaHerald.jpgఎవరే అతగాడు అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ ప్రియమణి. తెలుగులో రెండో ఛాన్స్ కోసం మూడు సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది ఆమె. అలా జగపతిబాబు హీరోగా నటించిన పెళ్లయిన కొత్తలో సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీని అందుకుంది. నటన, అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వడం ప్రియమణి వచ్చిన తొలినాళ్ళలో మంచి సినిమాలతో దూసుకు వెళ్ళింది. ఆమె కెరీర్లో యమదొంగ, నవ వసంతం, శంభో శివ శంభో, గోలీమార్ వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు తీసుకు వచ్చాయి. Priyamani{#}Heroine;Tollywood;Cinema;priyamani;Shiva;lord siva;Tamil;Rajamouli;NTR;Venkateshటాలీవుడ్ లో ద్విపాత్రాభినయం తో అదరగొట్టిన హీరోయిన్ ప్రియమణి..టాలీవుడ్ లో ద్విపాత్రాభినయం తో అదరగొట్టిన హీరోయిన్ ప్రియమణి..Priyamani{#}Heroine;Tollywood;Cinema;priyamani;Shiva;lord siva;Tamil;Rajamouli;NTR;VenkateshFri, 04 Jun 2021 10:00:00 GMTఎవరే అతగాడు అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ ప్రియమణి. తెలుగులో రెండో ఛాన్స్ కోసం మూడు సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది ఆమె. అలా జగపతిబాబు హీరోగా నటించిన పెళ్లయిన కొత్తలో సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీని అందుకుంది. నటన, అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వడం ప్రియమణి వచ్చిన తొలినాళ్ళలో మంచి సినిమాలతో దూసుకు వెళ్ళింది. ఆమె కెరీర్లో యమదొంగ, నవ వసంతం, శంభో శివ శంభో, గోలీమార్ వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు తీసుకు వచ్చాయి.

తెలుగులో ఆమె పెళ్లయిన కొత్తలో సినిమా చేస్తున్న సమయంలోనే తమిళ్ లో హీరోయిన్ గా నటించిన పరుత్తివీరన్ సినిమా తో నేషనల్ అవార్డును అందుకుంది ప్రియమణి. దాంతో అటు తమిళ్లో, ఇటు తెలుగులో మంచి అవకాశాలు అందుకోవడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే దర్శక ధీరుడు రాజమౌళి కళ్ళల్లో పడింది ప్రియమణి. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన యమదొంగ సినిమాలో హీరోయిన్ గా చేసి మరింత పాపులారిటీ దక్కించుకుంది. అయితే క్రమ క్రమంగా కొత్త హీరోయిన్ల రాకతో ప్రియమణి జోరు తెలుగులో తగ్గిపోయింది. ఐటెం సాంగ్ లలో కనిపించిన కూడా పెద్దగా ఉపయోగం లేకపోయింది.

దాంతో కొంత గ్యాప్ ఇచ్చి బుల్లితెరపై కి వచ్చి అక్కడ అలరిస్తూ మళ్ళీ సినిమా అవకాశాలను అందుకుంటుంది. ప్రస్తుతం ఆమె చేతిలో లో ఉన్న పర్వం మరియు వెంకటేష్ నారప్ప సినిమాలు ఉన్నాయి. అయితే తెలుగులో ఏ హీరోయిన్ కి దక్కని అరుదైన ఛాన్స్ కొట్టేసింది ప్రియమణి. హీరోలు డబల్ రోల్ చేయడానికి కథలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎప్పుడో గానీ హీరోయిన్లకు ఇలాంటి అవకాశం రాదు. ఆ అవకాశాన్ని రెండు చేతిలో ఒడిసి పట్టుకుంది చారులత అనే సినిమాతో ప్రియమణి. దక్షిణాదిన అన్ని భాషల్లో విడుదలైన ఈ సినిమా ఆమెకు మంచి గుర్తింపుతో పాటు నటిగా మంచి మార్కులు కూడా పొందింది. డ్యూయల్ రోల్లో తన సత్తా చాటి ఈ సినిమా తరువాత మరిన్ని అవకాశాలు పొందింది ప్రియమణి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కేసిఆర్ గ్రీన్ సిగ్నల్.. ఇక వారికి కూడా వ్యాక్సిన్?

గానగంధర్వుడు ఎస్పీ బాలు..మొదటి, చివరి పాటలు ఇవే

ఈటల రాజీనామా ప్రకటన?

ఎస్పీ బాలు కి టాలీవుడ్ స్వర నీరాజనం ...

మరణ శిక్ష నుంచి కేరళ వ్యక్తిని కాపాడిన ఎన్ఆర్ఐ..?

సమంత ను కలవర పెడుతున్న హ్యాష్ ట్యాగ్ !

విజయం మీదే: ఇవి మీరు పాటించకపోతే ఏదీ సాధించలేరు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>