PoliticsShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/china7694b021-48e9-4cb4-9aeb-b3688c5367c8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/china7694b021-48e9-4cb4-9aeb-b3688c5367c8-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి 2019 నుంచి ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఎప్పటికప్పుడు రూపాలు మారుస్తూ శాస్త్రవేత్తలను సైతం ముప్పుతిప్పలు పెడుతోంది. దీనిని అరికట్టేందుకు, నిలువరించేందుకు శాస్త్రవేత్తలు చేయని ప్రయత్నాలు లేవు. ఇప్పటికీ సరికొత్త ప్రయోగాలు చేస్తూ కరోనాతో పోరాడుతూనే ఉన్నారు. కానీ దీనికి సరైన సమాధానం దొరకడం లేదు. దాంతో దీనికి అరికట్టేందకు సరైన ఔషధం, వ్యాక్సిన్ తయారు చేయాలంటే దీని పుట్టుకను అధ్యయనం..china{#}Hanu Raghavapudi1956 నుంచి 2019 వరకు అన్నీ చైనావే.. అందుకేనా..1956 నుంచి 2019 వరకు అన్నీ చైనావే.. అందుకేనా..china{#}Hanu RaghavapudiFri, 04 Jun 2021 15:31:06 GMTకరోనా మహమ్మారి 2019 నుంచి ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఎప్పటికప్పుడు రూపాలు మారుస్తూ శాస్త్రవేత్తలను సైతం ముప్పుతిప్పలు పెడుతోంది. దీనిని అరికట్టేందుకు, నిలువరించేందుకు శాస్త్రవేత్తలు చేయని ప్రయత్నాలు లేవు. ఇప్పటికీ సరికొత్త ప్రయోగాలు చేస్తూ కరోనాతో పోరాడుతూనే ఉన్నారు. కానీ దీనికి సరైన సమాధానం దొరకడం లేదు. దాంతో దీనికి అరికట్టేందకు సరైన ఔషధం, వ్యాక్సిన్ తయారు చేయాలంటే దీని పుట్టుకను అధ్యయనం చేయాలని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. దాంతో ఈ మహమ్మారి పుట్టుక విషయంలో ప్రతి దేశం దర్యాప్తు చేశాయి. అంతేకాకుండా ఈ విషయంలో అనేక వాదనలు వినిపించాయి. కరోనా పుట్టుకపై వినిపించిన ప్రతి వాదనలోనూ ఈ మహమ్మారి జన్మస్థలం డ్రాగన్ కంట్రీనే అని ప్రపంచ దేశాలు ఘోషిస్తున్నాయి.

 కానీ డ్రాగన్ కంట్రీ చైనా మాత్రం తనకేం సంబంధం లేదంటోంది. అయితే కరోనా మొదటి కేసు నమోదయింది మాత్రం చైనాలోనే. మొదటగా కరోనా బారిన పడిన చైనా ప్రస్తుతం చక్కగా ఉంది. ప్రతి రోజు కేవలం పదుల సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నాయి. అక్కడి ప్రజల్లో అసలు కరోనా అనే ఓ వైరస్ ప్రపంచాన్ని కలచివేస్తుందన్న ఆలోచన కూడా కనిపించడం లేదు. అంతా షరామామూలుగా సాగుతోంది. చైనీయులు మాత్రం ఎటువంటి లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు, కరోనా నిబంధనలు లేకుండా సాధారణ దైనందిక జీవితాన్ని గడుపుతున్నారు. అయితే కరోనా ఒక్కటే కాదు మరికొన్ని వైరస్‌లు గతంలోనే చైనాలో పుట్టాయి. 1956 నుంచి వచ్చిన 4 అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లు డ్రాగన్ కంట్రీలో వెలువడ్డాయి.


 
వాటిలో 1956లో వచ్చిన ఆసియన్ ఫ్లూ చైనాలోనే పుట్టింది. ఈ వైరస్ మొదటి కేసు చైనాలోని ‘ఉజావు’అనే ప్రాంతంలో నమోదయింది. ఆ తరువాత ఏడాది 1997లో వచ్చిన హెచ్ఈఎన్1-బర్డ్ ఫ్లూ కూడా ‘హాంకాంగ్’లో బయటపడింది. 2002లో ‘సార్స్’ వైరస్ వచ్చింది. ఈ వైరస్ మొదటగా చైనాలోని ‘ఉవాంగ్ డాంగ్’ అనే ప్రాంతంలో నమోదైంది. అయితే అసలు అన్ని వైరస్‌లు ఎందుకు చైనాలో పుడుతున్నాయని అడిగితే ఎక్కువ మంది చెప్పే మాట వారి తిండి. వారు అన్నిరకాల జంతువులను తింటారని, అందుకనే వారికే కొత్త వ్యాధులు, వైరస్‌లు వస్తాయని అంటారు.
 అయితే మరికొందరు మాత్రం అన్ని దేశాల ప్రజలు మాంసం తింటారని, వారికి రాని వ్యాధులు, వైరస్‌లు చైనాలో ఎందుకు వస్తాయని అనడంతో పాటు, ఈ వైరస్‌లను చైనానే కావాలని తన ల్యాబ్‌లో తయారు చేస్తుందని వాదిస్తారు. అయితే తాజగా కరోనా పుట్టుక విషయంలో వినిపిస్తున్న వాదనల ప్రకారం చైనా కావాలనే బయోవార్‌ను క్రియేట్ చేస్తుందని అంటున్నారు. మరి ఈ విషయంలో ఎంత వరకు నిజముందో తేలాల్సి ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తమిళ ఎంట్రీ ప్లాన్ చేస్తున్న యంగ్ హీరో.. హిట్టవుతాడా..!

బ్రేకింగ్ : 12 నుండి 15 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆమోదం..!

సత్కరించుకునే అవకాశం దక్కినందుకు గర్వంగా ఉంది!

ధూళిపాళ్లకి సెట్ అయినట్లేనా..!

ప్రేమ దేశం హీరో ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసా?

ఆ వారసుల ఎంట్రీ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులు

ఏపీ ప్ర‌భుత్వానికి "మెఘా" సాయం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>