PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/eetala-vs-trsdb5f74b0-cc0b-45f6-82fc-f448bdc43ce4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/eetala-vs-trsdb5f74b0-cc0b-45f6-82fc-f448bdc43ce4-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాజకీయాలు గత రెండు నెలల నుండి మంచి జోరుమీదున్నాయి. మామూలుగా రాజకీయాల్లో అధికార పార్టీ మరియు విపక్షాలకు మధ్యన వాదోపవాదాలు జరగడం చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ మాత్రం సరాసరి అధికార తెరాసా లోనే వివాదాలు రాజుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ భూ కబ్జాలకు పాల్పడిన కారణంగా ఆయనపై విచారణ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. EETALA VS TRS{#}రాజీనామా;Bharatiya Janata Party;Telangana;Party;Eatala Rajendar;politics;court;media;war;MLA;Delhi;Congressపోయిన పరువుని ఈటెల తో బిజెపి కాపాడుకుంటుందా...?పోయిన పరువుని ఈటెల తో బిజెపి కాపాడుకుంటుందా...?EETALA VS TRS{#}రాజీనామా;Bharatiya Janata Party;Telangana;Party;Eatala Rajendar;politics;court;media;war;MLA;Delhi;CongressFri, 04 Jun 2021 13:00:00 GMTతెలంగాణ రాజకీయాలు గత రెండు నెలల నుండి మంచి జోరుమీదున్నాయి. మామూలుగా రాజకీయాల్లో అధికార పార్టీ మరియు విపక్షాలకు మధ్యన వాదోపవాదాలు జరగడం చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ మాత్రం సరాసరి అధికార తెరాసా లోనే వివాదాలు రాజుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ భూ కబ్జాలకు పాల్పడిన కారణంగా ఆయనపై విచారణ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హై కోర్టు విచారణ పద్ధతిని తప్పు పడుతూ తెలంగాణ ప్రభుత్వాన్ని మందలించింది. ఇలా రోజూ రోజుకీ కేసిఆర్ ఈటల రాజేందర్ ను అణగదొక్కాలని రాజకీయంగా రకరకాల వ్యూహాలను మరియు పన్నాగాలను పన్నాడు. ఈ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని మీడియా ముఖంగానే చాలా సార్లు కెసిఆర్ కి సవాలు విసిరారు ఈటల. కనీసం విచారణకు ఆదేశించే ముందు ఒక్క మాట కూడా చెప్పకపోవడం తీవ్రంగా కలచివేసిందని రాజేందర్ బాధపడ్డాడు.
  ఇలా ఎతుకు పై ఎతులతో కెసిఆర్ మరియు ఈటల రాజేందర్ మధ్యన పొలిటికల్ వార్ జరుగుతూ వచ్చింది. కానీ ఈటల రాజకీయ భవిష్యత్తు ఏమిటనే విషయం మాత్రం తేలలేదు. అటు తెరాసా పార్టీ రాజేందర్ ను పార్టీనుంచి తొలగించలేదు, అలాగే రాజేందర్ కూడా పార్టీని వీడలేదు. అయితే రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇతర పార్టీలయిన భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలలోకి చేరుతున్నారనే ప్రచారం గత రెండు వారాలుగా ఎక్కువయింది. అటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈటల పార్టీలో చేరుతున్నారనే  సంకేతాలు ఇవ్వడంతో అనుమానాలు మరింత బలం చేకూరింది. ఇదంతా ఇలా ఉంటే ఈ రోజు ఈటల రాజేందర్ హుజురాబాద్ ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేశారు.
 కానీ అంతా అనుకున్నట్లుగా బీజేపీ లో చేరుతున్నట్లు చెప్పకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాజేందర్ బండి సంజయ్ తో కలిసి ఢిల్లీ వెళ్లి అధిష్టానాన్ని కలిసి పార్టీలో చేరడానికి చర్చలు పూర్తయ్యాయి. అయినా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోవడం వెనుకున్న రాజకీయ ఆంతర్యం ఏమిటో తెలియట్లేదు. హుజూరాబాద్ ఎమ్మెల్యే స్థానం ఖాళీ అవడంతో బీజేపీ ఇప్పుడు ఉపఎన్నికకు  రంగం సిద్దం చేసుకుంటుంది. మొన్న జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో ఓటమి పాలైన బీజేపీ హుజూరాబాద్ లో అయినా గెలిచి పరువు మరియు బీజేపీ పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. అంతే కాకుండా దీని ద్వారా ఇప్పటికీ, ఒక ఎప్పటికీ తెరాసాతో బీజేపీ కి మాత్రమే పోటీ అని కాంగ్రెస్ పార్టీకి చెప్పకనే చెబుతుంది. మరి ముందు ముందు ఎటువంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాలయ్య బర్త్ డే రోజున 2 భారీ అప్డేట్స్..?

ఆ ఒక్క పాట కోసం బాలు తీసుకున్న పారితోషకం ఎంతో తెలుసా.. ?

ఎవరన్నారు .. ఎస్ పి బాలు చనిపోయారని ?

భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు..?

హరీష్ రావుకు కూడా అవమానాలు: ఈటల

ఎస్పీ బాలు ప్రయాణంలో ప్రజల గుండెల్లో నిలిచిన టాప్ 10 పాటలు ఇవే..!

ఏపీలో థర్డ్‌వేవ్ కలకలం?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>