MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venu-thottempudi688c37f4-a2c0-4255-9c6f-d26d517aac32-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venu-thottempudi688c37f4-a2c0-4255-9c6f-d26d517aac32-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో మంది హీరోలు వస్తుంటారు. అయితే కొంతమంది హీరోలు తమ కెరీర్ నీ చక్కగా బిల్డ్ చేసుకుని ఒక్కో మెట్టు ఎదుగుతూ స్టార్ హీరో అవడం మనం చూస్తున్నాం. ఇంకొంత మంది హీరోలు ఒకటో రెండో సినిమాలకే పరిమితమై కనుమరుగైపోవడం కూడా చూస్తున్నాం. ఇంకొంతమంది హీరో లు అదృష్టం లేకపోయినా సినిమా పరిశ్రమ లోనే ఉంటూ ఏదో ఒక పాత్ర చేస్తూ ఎక్కడో ఒక దగ్గర తమకు అదృష్టం కలిసి రాదా అన్నట్లూ కూడా చూస్తున్నారు. అన్న మన టాలీవుడ్ లో అదృష్టం తక్కువగా టాలెంట్ ఎక్కువగా ఉండే హీరోలలో మనకు మొదటి వరుసలోనే కనిపిస్తారు హీరోvenu thottempudi{#}Hero;Telugu;Manam;Cinema;Tollywood;Venu Thottempudi;Audience;Blockbuster hit;Comedy;NTR;Hanu Raghavapudi;Assembly;Thummala Nageswara Rao;Akkineni Nageswara Raoఆ కారణంగానే హీరో వేణు సినిమాలకు దూరం అయ్యాడు!ఆ కారణంగానే హీరో వేణు సినిమాలకు దూరం అయ్యాడు!venu thottempudi{#}Hero;Telugu;Manam;Cinema;Tollywood;Venu Thottempudi;Audience;Blockbuster hit;Comedy;NTR;Hanu Raghavapudi;Assembly;Thummala Nageswara Rao;Akkineni Nageswara RaoFri, 04 Jun 2021 11:00:00 GMTతెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో మంది హీరోలు వస్తుంటారు. అయితే కొంతమంది హీరోలు తమ కెరీర్ నీ చక్కగా బిల్డ్ చేసుకుని ఒక్కో మెట్టు ఎదుగుతూ స్టార్ హీరో అవడం మనం చూస్తున్నాం. ఇంకొంత మంది హీరోలు ఒకటో రెండో సినిమాలకే పరిమితమై కనుమరుగైపోవడం కూడా చూస్తున్నాం. ఇంకొంతమంది హీరో లు అదృష్టం లేకపోయినా సినిమా పరిశ్రమ లోనే ఉంటూ ఏదో ఒక పాత్ర చేస్తూ ఎక్కడో ఒక దగ్గర తమకు అదృష్టం కలిసి రాదా అన్నట్లూ కూడా చూస్తున్నారు. అన్న మన టాలీవుడ్ లో అదృష్టం తక్కువగా టాలెంట్ ఎక్కువగా ఉండే హీరోలలో మనకు మొదటి వరుసలోనే కనిపిస్తారు హీరో వేణు తొట్టెంపూడి.

స్వయంవరం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వేణు ప్రస్తుతం సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు. వరుస ఫ్లాప్ ల వల్లే ఆయన ఇండస్ట్రీకి దూరమయ్యారు అనేకంటే ఓ కారణం వల్ల ఆయన ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయారని చెప్పవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎంతో పేరు తెచ్చుకున్న వేణు సడన్ గా ఇండస్ట్రీని వదిలేయడంతో ఆయన అభిమానులు ఎంతో నిరాశ పడ్డారు. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఆ తరువాత ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీ మరియు సెంటిమెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆరడుగుల పొడుగు ఉన్నప్పటికీ తన బాడీ ఇమేజ్ కి తగినట్లుగా పాత్రలను ఎంపిక చేసుకుని హీరోగా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు.

సుమారు 26 సినిమాల్లో హీరోగా నటించిన వేణు ఎక్కువ శాతం హిట్లను తన ఖాతాలో వేసుకుని 2006 తర్వాత సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నరు. మళ్ళీ 2012లో ఎన్టీఆర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన దమ్ము సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించాడు. రీ ఎంట్రీ లో వరుస సినిమాలు చేస్తాడు అనుకుంటే ఆ సినిమా కాస్త పరాజయం పాలయింది. ఆ వెంటనే ఆయన హీరోగా రామాచారి అనే సినిమా వచ్చిన అది కూడా ఫ్లాప్ అవడంతో తన వ్యాపార పనుల్లో బిజీ అయిపోయాడు. అలా అలా సినిమాలకు పూర్తిగా దూరం అయిపోయాడు. 2019 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ తరఫున ఆయన భావ నామా నాగేశ్వరరావు తరపున ప్రచారం చేశాడు. మరి భవిష్యత్తులో వేణు సినిమాల్లో నటిస్తారా లేదా రాజకీయాలవైపు మల్లుతారా అనేది చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎస్‌పీబీ నటనా పరిపూర్ణత్వం ఈ ‘మిథునం’..

హరీష్ రావుకు కూడా అవమానాలు: ఈటల

ఎస్పీ బాలు ప్రయాణంలో ప్రజల గుండెల్లో నిలిచిన టాప్ 10 పాటలు ఇవే..!

ఏపీలో థర్డ్‌వేవ్ కలకలం?

కేసిఆర్ గ్రీన్ సిగ్నల్.. ఇక వారికి కూడా వ్యాక్సిన్?

గానగంధర్వుడు ఎస్పీ బాలు..మొదటి, చివరి పాటలు ఇవే

ఈటల రాజీనామా ప్రకటన?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>