MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-c1be5dcf-4ee3-4e45-bc02-7cf951a059f8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-c1be5dcf-4ee3-4e45-bc02-7cf951a059f8-415x250-IndiaHerald.jpgకరోనా రెండవ దశ నెమ్మదిగా తగ్గుతోంది. ఒక అంచనా ప్రకారం జూలై నెలాఖరు నాటికి సాధారణ పరిస్థితులు ఉంటాయని అంతా భావిస్తున్నారు. ఆ మీదట మెల్లగా ఒక్కో యాక్టివిటీ మొదలవుతుంది అని కూడా అంటున్నారు. అందరి కంటే ఎక్కువ ఆశగా టాలీవుడ్ వేచి చూస్తోంది tollywood{#}Tollywood;Chiranjeevi;Cinema;Director;Balakrishna;Government;gunasekhar;Mass;Ravi;Venkatesh;Narappa;Dussehra;Vijayadashamiఅక్కడ ఓకే అంటే టాలీవుడ్ రెడీ... ?అక్కడ ఓకే అంటే టాలీవుడ్ రెడీ... ?tollywood{#}Tollywood;Chiranjeevi;Cinema;Director;Balakrishna;Government;gunasekhar;Mass;Ravi;Venkatesh;Narappa;Dussehra;VijayadashamiFri, 04 Jun 2021 20:00:00 GMTకరోనా రెండవ దశ నెమ్మదిగా తగ్గుతోంది. ఒక అంచనా ప్రకారం జూలై నెలాఖరు నాటికి సాధారణ పరిస్థితులు ఉంటాయని అంతా భావిస్తున్నారు. ఆ మీదట మెల్లగా ఒక్కో యాక్టివిటీ మొదలవుతుంది అని కూడా అంటున్నారు.

అందరి కంటే ఎక్కువ ఆశగా టాలీవుడ్ వేచి చూస్తోంది. కరోనా తగ్గితే తమకు షూటింగునకు అనుమతులు వస్తాయని భావిస్తోంది. టాలీవుడ్ లో ఇపుడు కొన్ని చిత్రాలు జస్ట్ టెన్ డేస్ షూటింగ్ చేస్తే చాలు పూర్తి అవుతాయిట‌. అవన్నీ ఇపుడు అనుమతుల కోసమే వెయిట్ చేస్తున్నాయి. ఈ జాబితాలో మొదట చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి అచార్య మూవీ.

ఆయన సినిమా కేవలం పది రోజుల షూటింగ్ మాత్రమే ఉంది అంటున్నారు. అది పూర్తి అయితే పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు చూసుకుని రిలీజ్ కి సిద్ధమైపోవచ్చు. దాంతో డైరెక్టర్ కొరటాల అన్నీ సిద్ధం చేసుకుంటున్నారుట. మరో వైపు చూస్తే బాలయ్య అఖండ మూవీ కూడా కొంత పార్ట్ షూటింగ్ మిగిలి ఉంది అంటున్నారు. ప్రభుత్వం అనుమతి కనుక ఇస్తే కచ్చితంగా ఈ సినిమా కూడా షూటింగ్ చకచకా కానిచ్చేస్తామని అంటోంది. బోయ‌పాటి కూడా దానికి అంతా ప్రిపేర్ చేసుకున్నారుట.

మరో వైపు చూస్తే గుణశేఖర్ శాకుంతలం కూడా షూటింగ్ నలభ శాతం ఉంది అంటోంది. పర్మిషన్ ఇస్తే జోరుగా షూట్ చేయడానికి అన్ని రకాలుగా రెడీ అవుతున్నారుట. ఇలాగే మాస్ మహారాజా రవితేజా ఖిలాడీ మూవీ కూడా షూటింగ్ కొంత భాగం ఉంది అంటున్నారు. ఇక విక్టరీ వెంకటేష్ నారప్ప షూటింగ్ కూడా చాలా కొద్దిగా మిగిలి ఉందని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే ఈ మూవీస్ అన్నీ షూటింగ్ త్వరగా  పూర్తి చేసుకునేలా ఉన్నాయి. ఇందులో కొన్ని సినిమాలు దసరా బరిలోకి నిలవాలని కూడా చూస్తున్నాయిట. మొత్తానికి చూస్తే అనుమతులు ఇవ్వడమేంటి సినిమా  కెమెరా కన్ను కొట్టడం ఖాయమని అంటున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ టీజర్ రిలీజ్ అప్పుడే..?

విడాకుల కోసం రచ్చ చేసిన రంభ.. ఎందుకు సైలెంట్ అయ్యింది

బ్రేకింగ్ : 12 నుండి 15 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆమోదం..!

సత్కరించుకునే అవకాశం దక్కినందుకు గర్వంగా ఉంది!

ధూళిపాళ్లకి సెట్ అయినట్లేనా..!

ప్రేమ దేశం హీరో ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసా?

ఆ వారసుల ఎంట్రీ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>