MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/akhil-naga-chaitanyafe28894c-d45f-475e-a62f-f85dda776bec-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/akhil-naga-chaitanyafe28894c-d45f-475e-a62f-f85dda776bec-415x250-IndiaHerald.jpgఅక్కినేని ఫ్యామిలీకి చెందిన మూడవ తరం వారసులు అక్కినేని నాగచైతన్య, అఖిల్ ప్రస్తుతం ఒకదాని వెంట మరొకటి సినిమాలు చేస్తూ హీరోలుగా ఆడియన్స్ నుంచి మంచి క్రేజ్ దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు. తొలిసారిగా వాసు వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన జోష్ మూవీ ద్వారా హీరోగా పరిచయమయ్యారు నాగచైతన్. కార్తీక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా 2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ గా నిలిచింది. నిజానికి సినిమా ప్రారంభోత్సవాన్ని, అలానే ఆడియో రిలీజ్ ఫంక్షన్ ని ఎంతో వేడుకగా జరిపారు నాగార్జున. akhil-naga chaitanya{#}akhil akkineni;Audience;vasu varma;Josh;Heroine;Cinema;Audio;gautham menon;Naga Chaitanya;maya;Sisindri;Manam;sudhakar;Vikram Kumar;Hello;Mr Majnuప్చ్... పాపం అన్నదమ్ములిద్దరికీ ఆ దెబ్బ మాత్రం తప్పలేదు .... ??ప్చ్... పాపం అన్నదమ్ములిద్దరికీ ఆ దెబ్బ మాత్రం తప్పలేదు .... ??akhil-naga chaitanya{#}akhil akkineni;Audience;vasu varma;Josh;Heroine;Cinema;Audio;gautham menon;Naga Chaitanya;maya;Sisindri;Manam;sudhakar;Vikram Kumar;Hello;Mr MajnuFri, 04 Jun 2021 21:54:00 GMTఅక్కినేని ఫ్యామిలీకి చెందిన మూడవ తరం వారసులు అక్కినేని నాగచైతన్య, అఖిల్ ప్రస్తుతం ఒకదాని వెంట మరొకటి సినిమాలు చేస్తూ హీరోలుగా ఆడియన్స్ నుంచి మంచి క్రేజ్ దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు. తొలిసారిగా వాసు వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన జోష్ మూవీ ద్వారా హీరోగా పరిచయమయ్యారు నాగచైతన్. కార్తీక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా 2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ గా నిలిచింది. నిజానికి సినిమా ప్రారంభోత్సవాన్ని, అలానే ఆడియో రిలీజ్ ఫంక్షన్ ని ఎంతో వేడుకగా జరిపారు నాగార్జున.

ఆ సమయంలో ఈ సినిమాపై అందరిలోనూ విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఒక్కసారిగా మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో అక్కినేని ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. కాగా ఆ తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య నటించిన ఏ మాయ చేసావే సినిమా సూపర్ హిట్ కొట్టి ఆయన కెరీర్ కి మంచి బ్రేక్ ను అందించింది. ఇక నాగచైతన్య సోదరుడు అఖిల్ చిన్నతనంలోనే సిసింద్రీ మూవీ ద్వారా తెరంగేట్రం చేసారు. ఇక ఇటీవల అక్కినేని హీరోలందరూ కలిసి నటించిన మనం మూవీ లో చిన్న పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చిన అఖిల్, దాని తర్వాత హీరోగా అఖిల్ మూవీ ద్వారా రంగ ప్రవేశం చేసారు. అయితే అఖిల్ కూడా ఊహించని విధంగా ఫస్ట్ మూవీ ద్వారా భారీ డిజాస్టర్ ను చవిచూశారు.

శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి వివి వినాయక్ దర్శకత్వం వహించగా సాయేషా హీరోయిన్ గా నటించింది. ఇక తొలి సినిమాతోనే పరాజయాన్ని చవిచూడటంతో కొంత నిరాశ చెందిన అఖిల్ ఆపై తదుపరి సినిమాని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేసారు. అదే హలో మూవీ, కాగా ఈ మూవీ యావరేజ్ విజయాన్ని అందుకుంది. అనంతరం మిస్టర్ మజ్ను సినిమా చేసి తద్వారా ఎబోవ్ యావరేజ్ విజయాన్ని అందుకున్న అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ చేస్తున్నారు. మొత్తంగా దీనిని బట్టి అన్నదమ్ములైన నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ కూడా తమ తొలి సినిమాలతో ఊహించని విధంగా భారీ దెబ్బలే ఎదుర్కొన్నారని చెప్పాలి ...... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వామ్మో ..... ఇదేమి లైనప్ నీల్ భాయ్ ..... ??

శ్యామలాని దారుణంగా ఏకిపారెస్తున్న నెటిజన్స్....

అక్కడ ఓకే అంటే టాలీవుడ్ రెడీ... ?

ఏపీకి శుభవార్త.. రాష్ట్రంలో తగ్గుతున్న కేసులు..

‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ టీజర్ రిలీజ్ అప్పుడే..?

విడాకుల కోసం రచ్చ చేసిన రంభ.. ఎందుకు సైలెంట్ అయ్యింది

బ్రేకింగ్ : 12 నుండి 15 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆమోదం..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>