KidsN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/children-f0c49133-fdf9-4e9d-9c83-05f8885adcf2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/children-f0c49133-fdf9-4e9d-9c83-05f8885adcf2-415x250-IndiaHerald.jpgఈ వాసన పీల్చితే ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగి చిన్నారులకు ఏకాగ్రత పెరిగే అవకాశం ఉంటుంది. పిల్లలకు ఆయిల్ ఫ్రైలను తినిపించడం తగ్గించాలి. అయితే ముఖ్యంగా కూల్‌డ్రింకులు, వేపుళ్లను తినిపించకూడదు. ఎందుకంటే ఇవి శరీరంలోని జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. అంతేకాక ఇవి వారి మూడ్‌పైనా ప్రభావం చూపిస్తాయి.children{#}oil;Evening;Cardamomబుడుగు: పిల్లలు పడుకునే ముందు ఇలా చేయండి..?బుడుగు: పిల్లలు పడుకునే ముందు ఇలా చేయండి..?children{#}oil;Evening;CardamomFri, 04 Jun 2021 17:00:00 GMTఆయిల్ ఫ్రైలను తినిపించడం తగ్గించాలి.

అయితే ముఖ్యంగా కూల్‌డ్రింకులు, వేపుళ్లను తినిపించకూడదు. ఎందుకంటే ఇవి శరీరంలోని జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. అంతేకాక ఇవి వారి మూడ్‌పైనా ప్రభావం చూపిస్తాయి. కంటి నిండా సరైన నిద్ర అవసరం. పెద్దలకు 7-9 గంటల నిద్ర సరిపోయినా పిల్లలకు మాత్రం 10-12 గంటల నిద్ర అవసరం అని ఆయుర్వేద నిపుణులు సూచించారు.

ఇక ముక్కు రంధ్రాల ద్వారా నస్యా లేదా కొన్ని చుక్కల నూనెను వేయాలి. ఇలా చేస్తే తలనొప్పి వెంటనే తగ్గుముఖం పడుతుంది. అయితే నస్యా ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఇన్‌ఫ్యూజ్ చేయాల్సిన పదార్థం నాణ్యతగా ఉండటంతో పాటు దాని పరిమాణం నిర్దిష్టంగా ఉండాలి. పడుకునేముందు పాదాల మర్దన చేస్తే శరీరానికి తగిన విశ్రాంతి లభిస్తుంది. అంతేకాకుండా శరీరంలో సాధారణ అసమతుల్యతలను మెరుగుపరుచుకోవడానికి ఈ విధానం సహాయపడుతుంది.

అలాగే చిన్నారులకు మంచి నిద్ర కోసం గోరువెచ్చని పసుపుపాలు లేదా యాలకులు వేసిన పాలు లేదా కుంకుమపువ్వు వేసిన పాలు ఇవ్వండి. ఇలా పాలు ఇవ్వడం వల్ల పిల్లల ఏకాగ్రత మరింత మెరుగుపడే అవకాశం ఉంటుంది. చిన్నారుల పట్ల అమ్మానాన్నలు కూడా మరీ గారాబంగా ఉండకూడదు. అతి గారాబం వల్ల పిల్లల మానసిక స్థితి వేరేలా ఉందని, దాని వల్ల కూడా వారు బద్దకంగా, పరధ్యానంగా ఉంటారని పలు అధ్యయనాలు చెప్తున్నాయి.

అయితే అమ్మానాన్నల మధ్య అనుబంధం పిల్లలపై ప్రభావం చూపుతుంది. భార్యాభర్తలిద్దరూ తరచూ కీచులాడుకుంటే అది చిన్నారుల హృదయాలను గాయపరుస్తుంది. తల్లిదండ్రులపై ప్రేమాభిమానాలు పెరిగే చోట భయం, ద్వేషం కలుగుతాయి. అందుకే గొడవలకు స్వస్తి పలకాలి. పేరెంట్స్‌ ఇచ్చే చిన్న చిన్న ప్రశంసలు చిన్నారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అప్పుడప్పుడు చిన్న చిన్న బహుమతులు ఇస్తూ ప్రోత్సహిస్తే పిల్లలు ఎప్పుడూ చలాకీగా ఉంటారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తమిళ ఎంట్రీ ప్లాన్ చేస్తున్న యంగ్ హీరో.. హిట్టవుతాడా..!

బ్రేకింగ్ : 12 నుండి 15 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆమోదం..!

సత్కరించుకునే అవకాశం దక్కినందుకు గర్వంగా ఉంది!

ధూళిపాళ్లకి సెట్ అయినట్లేనా..!

ప్రేమ దేశం హీరో ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసా?

ఆ వారసుల ఎంట్రీ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులు

ఏపీ ప్ర‌భుత్వానికి "మెఘా" సాయం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>