MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-birthdaye119d227-850f-4e49-8dc3-9b5b2be26362-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-birthdaye119d227-850f-4e49-8dc3-9b5b2be26362-415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ ఈనెల అనగా జూన్ పదవ తేదీన తన 61వ వసంతంలో అడుగు పెట్టనున్నారు. అయితే ఆయన పుట్టిన రోజు సందర్భంగా పలు భారీ ప్రకటనలు వెలువడే అవకాశాలున్నాయని సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రెండు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. పండగ చేస్కో, క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన గోపీచంద్ మలినేని తో బాలయ్య సినిమా చేయనున్నారని గత కొద్ బాలయ్య బర్త్ డే రోజున 2 భారీ అప్డేట్స్..?balakrishna birthday{#}lion;June;advertisement;News;Balakrishna;Krack;Blockbuster hit;Cinema;Sarileru Neekevvaru;anil ravipudiబాలయ్య బర్త్ డే రోజున 2 భారీ అప్డేట్స్..?బాలయ్య బర్త్ డే రోజున 2 భారీ అప్డేట్స్..?balakrishna birthday{#}lion;June;advertisement;News;Balakrishna;Krack;Blockbuster hit;Cinema;Sarileru Neekevvaru;anil ravipudiFri, 04 Jun 2021 13:30:00 GMTబాలకృష్ణ ఈనెల అనగా జూన్ పదవ తేదీన తన 61వ వసంతంలో అడుగు పెట్టనున్నారు. అయితే ఆయన పుట్టిన రోజు సందర్భంగా పలు భారీ ప్రకటనలు వెలువడే అవకాశాలున్నాయని సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రెండు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

పండగ చేస్కో, క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన గోపీచంద్ మలినేని తో బాలయ్య సినిమా చేయనున్నారని గత కొద్ది రోజులుగా సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బాలకృష్ణ గోపీచంద్ తో కలిసి సినిమా చేసేందుకు రెడీ అయ్యారని.. స్క్రిప్ట్ విషయంలో చర్చలు కూడా జరుపుతున్నారని తెలుస్తోంది. అయితే బాలయ్య బర్త్ డే సందర్భంగా.. వీరిద్దరి కాంబోలో రూపొందనున్న సినిమా ప్రాజెక్టుకి సంబంధించి ఓ అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

ఇకపోతే బాలకృష్ణ పుట్టిన రోజున మరొక కొత్త సినిమా గురించి అప్డేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న అనిల్ రావిపూడి తో కలిసి బాలయ్య ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. నిజానికి బాలకృష్ణతో కలిసి "రామారావు" టైటిల్ తో ఒక సినిమా చేయాలని అనిల్ రావిపూడి ఎప్పుడో ప్లాన్ చేశారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో సినిమా రూపొందలేదు.

అయితే ప్రస్తుతం బాలయ్య, అనిల్ రావిపూడి "రామారావు" సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారని.. ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకు కూడా వచ్చిందని సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా బాలయ్య పుట్టినరోజు నాడే విడుదల కానుందని సమాచారం. ఒకవేళ ఆయన పుట్టిన రోజు సందర్భంగా రెండు సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ వస్తే పండగ చేసుకోవడం ఖాయం.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ ఒక్క పాట కోసం బాలు తీసుకున్న పారితోషకం ఎంతో తెలుసా.. ?

ఎవరన్నారు .. ఎస్ పి బాలు చనిపోయారని ?

భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు..?

హరీష్ రావుకు కూడా అవమానాలు: ఈటల

ఎస్పీ బాలు ప్రయాణంలో ప్రజల గుండెల్లో నిలిచిన టాప్ 10 పాటలు ఇవే..!

ఏపీలో థర్డ్‌వేవ్ కలకలం?

కేసిఆర్ గ్రీన్ సిగ్నల్.. ఇక వారికి కూడా వ్యాక్సిన్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>