Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/corona9260dca0-da7f-4c22-a0c7-8a0fa28303ca-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/corona9260dca0-da7f-4c22-a0c7-8a0fa28303ca-415x250-IndiaHerald.jpgనవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లిని వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన పిల్లలు చివరికి ఆ తల్లిదండ్రులు భారంగా భావిస్తున్నారు. దీంతో ఎంతో మంది పిల్లలు తమను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల విషయంలో కాస్త అయినా జాలి దయ చూపించడం లేదు. కనీసం మానవతా దృక్పథంతో కూడా ఆలోచించడంలేదు. దీంతో తల్లిదండ్రులు వృద్ధాప్యం లోకి రాగానే ఏకంగా ఓల్డ్ ఏజ్ హోమ్ లో వదిలేస్తున్న ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి. అంతేకాకుండా వృద్ధాప్యంలో కూడా ఎంతో మంది వృద్ధులైన తమ తల్లిదండ్రులకు వచ్చే పింఛను మీద కూడా ఆశ పెంచుకుని చివరికిMurder{#}Parents;House;Murder.;Medak;Petta;Husband;marriage;Hyderabad;policeఎంత దారుణం.. కూతురే తల్లిని చంపేసింది?ఎంత దారుణం.. కూతురే తల్లిని చంపేసింది?Murder{#}Parents;House;Murder.;Medak;Petta;Husband;marriage;Hyderabad;policeFri, 04 Jun 2021 19:00:00 GMTనవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లిని వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన పిల్లలు చివరికి ఆ తల్లిదండ్రులు భారంగా భావిస్తున్నారు. దీంతో ఎంతో మంది పిల్లలు తమను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల విషయంలో కాస్త అయినా జాలి దయ చూపించడం లేదు. కనీసం మానవతా దృక్పథంతో కూడా ఆలోచించడంలేదు. దీంతో తల్లిదండ్రులు వృద్ధాప్యం లోకి రాగానే ఏకంగా ఓల్డ్ ఏజ్ హోమ్ లో వదిలేస్తున్న ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి.  అంతేకాకుండా వృద్ధాప్యంలో కూడా ఎంతో మంది వృద్ధులైన తమ తల్లిదండ్రులకు వచ్చే పింఛను మీద కూడా ఆశ పెంచుకుని చివరికి దారుణాలకు పాల్పడుతున్న సంఘటనలు కూడా తెర మీదికి వచ్చి సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్నాయి.



 ఇక ఇటీవల ఇలాంటి తరహా దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ తల్లి తనకు కూతురు పుట్టింది అని ఎంతో ఆనంద పడిపోయింది. కానీ పెద్దయ్యాక ఆ కూతురు తన ప్రాణాలు తీస్తుంది అని మాత్రం ఊహించలేకపోయింది.  అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురే పెద్దయ్యాక చివరికి తన పాలిట కాల యముడు గా మారిపోయింది.  పెన్షన్ డబ్బులు కోసం తల్లిని దారుణంగా హత్య చేసి చంపింది ఇక్కడ ఒక కూతురు. ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో చోటుచేసుకుంది. అక్కన్న పేట గ్రామానికి చెందిన  అప్సనా అనే మహిళ పదేళ్ల కిందట భర్త మృతి చెందగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.



 భర్త లేకపోయినప్పటికీ కూతురికి ఎలాంటి లోటు రాకుండా అన్ని బాధ్యతలు తానే తీసుకొని అల్లారుముద్దుగా పెంచింది. తర్వాత కూతురు  ఇటీవలే ఒక వ్యక్తిని ప్రేమించి అతన్నే పెళ్లి చేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఇటీవలే అఫ్సానా అనారోగ్యానికి గురైంది. దీంతో తనకు సహాయం చేసేందుకు ఎవరూ లేకపోవడంతో తన కూతురుని పిలిపించుకుంది. అయితే తల్లికి సహాయం చేయడానికి వచ్చిన కూతురు మాత్రం దారుణంగా వ్యవహరించింది. తల్లి పెన్షన్ డబ్బులు తనకు ఇవ్వలేదు అనుకో నెపంతో దారుణంగా తల్లిని హత్య చేసింది.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ నటుడు ఒక సూపర్ మూవీ దర్శకుడు అని మీకు తెలుసా.. ?

‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ టీజర్ రిలీజ్ అప్పుడే..?

విడాకుల కోసం రచ్చ చేసిన రంభ.. ఎందుకు సైలెంట్ అయ్యింది

బ్రేకింగ్ : 12 నుండి 15 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆమోదం..!

సత్కరించుకునే అవకాశం దక్కినందుకు గర్వంగా ఉంది!

ధూళిపాళ్లకి సెట్ అయినట్లేనా..!

ప్రేమ దేశం హీరో ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>