PoliticsMaddipati Lakshmi Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ias-transfers-in-ape1c856e5-e9ae-4775-8bad-88595bd9d54e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ias-transfers-in-ape1c856e5-e9ae-4775-8bad-88595bd9d54e-415x250-IndiaHerald.jpgఏపీ ప్ర‌భుత్వం గురువారం ప‌లువురు ఐఏఎస్‌ల‌ను బ‌దిలీ చేసింది. అనంత‌పురం జిల్లా క‌లెక్ట‌ర్ గంధం చంద్రుడును గ్రామ వార్డు స‌చివాల‌యాల డైరెక్ట‌ర్‌గా బ‌దిలీ చేశారు. కృష్టా జిల్లా క‌లెక్ట‌ర్ ఇంతియాజ్‌ను ఏపీ మైనారిటీ సంక్షేమ శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శిగా పంపించారు. అనంత‌పురం జిల్లా క‌లెక్ట‌ర్‌గా నాగ‌ల‌క్ష్మిని నియ‌మించారు.IAS transfers in AP{#}Andhra Pradesh;thursday;District;YCP;Moon;mandalam;Ananthapuram;Governmentఏపీలో ప‌లువురు ఐఏఎస్‌ల బ‌దిలీ.. నేత‌ల ఒత్తిడులే కార‌ణ‌మా..?ఏపీలో ప‌లువురు ఐఏఎస్‌ల బ‌దిలీ.. నేత‌ల ఒత్తిడులే కార‌ణ‌మా..?IAS transfers in AP{#}Andhra Pradesh;thursday;District;YCP;Moon;mandalam;Ananthapuram;GovernmentFri, 04 Jun 2021 22:47:00 GMTఏపీ ప్ర‌భుత్వం శుక్ర‌వారం ప‌లువురు ఐఏఎస్‌ల‌ను బ‌దిలీ చేసింది. అనంత‌పురం జిల్లా క‌లెక్ట‌ర్ గంధం చంద్రుడును గ్రామ వార్డు స‌చివాల‌యాల డైరెక్ట‌ర్‌గా బ‌దిలీ చేశారు. కృష్టా జిల్లా క‌లెక్ట‌ర్ ఇంతియాజ్‌ను ఏపీ మైనారిటీ సంక్షేమ శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శిగా పంపించారు. అనంత‌పురం జిల్లా క‌లెక్ట‌ర్‌గా నాగ‌ల‌క్ష్మిని నియ‌మించారు. కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్‌గా నివాస్ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. వీరి బ‌దిలీల వెనుక స్థానిక వైసీపీ నేత‌ల ఒత్తిడులే ప్ర‌ధానంగా ప‌నిచేసిన‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అనంత‌పురం జిల్లా క‌లెక్ట‌ర్ గంధం చంద్రుడు బ‌దిలీ విష‌యంలో ధ‌ర్మ‌వ‌రం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌టరామిరెడ్డి గ‌ట్టిగా ప‌ట్టుబ‌ట్టిన‌ట్లు స‌మాచారం. గ‌తంలో వీరిద్ద‌రి మ‌ధ్య నెల‌కొన్న వివాదం రాష్ట్ర‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశమైంది. అప్ప‌ట్లో కేతిరెడ్డి క‌లెక్ట‌ర్ గంధం చంద్రుడుని ఉద్దేశించి ప‌రుష ప‌ద‌జాలంతో విమ‌ర్శించారు.

ఇంత‌కీ కేతీరెడ్డి క‌లెక్ట‌ర్‌పై ఆగ్రహించ‌డానికి కార‌ణ‌మేమిటంటే అప్ప‌ట్లో జ‌రిగిన‌ శివరాత్రి ఉత్స‌వాలే. తాడిమర్రి మండలం చిల్లవారిపల్లెలో కాటకోటేశ్వరస్వామి ఉత్సవాలను ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా నిర్వహిస్తారు. అయితే ఈ సంద‌ర్భంలోనే కడప జిల్లా పులివెందుల మండలం అంకేపల్లి, చిల్లవారిపల్లె గ్రామాల మధ్య ఉత్సవ విగ్రహాల ఊరేగింపులో వివాదం చోటుచేసుకుంది. ఊరేగింపు విషయంలో రెండు గ్రామాల మధ్య ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి. ఇలాంటి వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించండం మంచిది కాదని, ఉత్సవ విగ్రహాలు ఊరిగించవద్దని కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలిచ్చారు. ప్ర‌జ‌లు విన‌క‌పోవ‌డంతో గ్రామంలోని ఆలయానికి తలుపులు వేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కలెక్టర్‌ చంద్రుడు ఇగోయిస్టు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆయన. గంధం చంద్రుడు ఇవాళ ఉండి రేపు పోతారని, ఎవరిని నాశనం చేయడానికి పుట్టాడంటూ చిందులేశారు. పత్రికల్లో హనీట్రాప్ రాకపోతే ఎప్పుడో ఇక్కడ నుంచి పోయేవారు అంటూ మండిపడ్డారు. కలెక్టర్‌ కులాల మధ్య చిచ్చురేపే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గంధం చంద్రుడు అనంతపురం జిల్లా కలెక్టర్‌గా ప్రజల ఆదరాభిమానాలు పొందారు. ఓ సామాన్య కుటుంబంలో పుట్టి ఉన్నత శిఖరాలకు ఎదిగిన వ్య‌క్తిగా ఆయ‌న‌కు పేరుంది. టికెట్ కలెక్టర్ గా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఆయన పట్టుదలతో శ్రమించి జిల్లా కలెక్టర్ స్థాయికి ఎదిగినట్టు తెలుస్తోంది. అనంతపురం జిల్లా కలెక్టర్‌గా ప‌లు ప్రజల్లో ఆద‌ర‌ణ సంపాదించుకున్నారు. జిల్లాలో కుల వివక్షను రూపు మాపేందుకు తన వంతుగా ప్రయత్నం చేశారు. దేశంలోనే తొలిసారిగా కులాలను సూచించేలా ఉన్న కాలనీ పేర్లు తొలగించాలని ఆదేశించారు. మాల పల్లె, మాదిగ పల్లె, హరిజనవాడ, దళితవాడ వంటి కులాలను సూచించే పేర్లను మార్చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను దేశంలోనే తొలిసారి ఏపీలోని అనంతపురం జిల్లాలో ఆయన అమలు చేశారు.  ప్రతిష్టాత్మక పీఎం కిసాన్ అవార్డును కలెక్టర్ గంధం చంద్రుడు స్వయంగా కేంద్ర వ్యవసాయశాఖామంత్రి తోమర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఇప్పుడు రాజ‌కీయ ఒత్తిళ్ల నేప‌థ్యంలో బ‌దిలీ అయ్యారు. రాష్ట్రంలోని ఇత‌ర ఐఏఎస్‌ల బ‌దిలీల వెనుక ఇవే ఒత్తిళ్లు ప‌ని చేసిన‌ట్టు ఆరోప‌ణలొస్తున్నాయి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సంచలనానికి ముందు సంయనం తప్పదు మరి ..... ??

శ్యామలాని దారుణంగా ఏకిపారెస్తున్న నెటిజన్స్....

అక్కడ ఓకే అంటే టాలీవుడ్ రెడీ... ?

ఏపీకి శుభవార్త.. రాష్ట్రంలో తగ్గుతున్న కేసులు..

‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ టీజర్ రిలీజ్ అప్పుడే..?

విడాకుల కోసం రచ్చ చేసిన రంభ.. ఎందుకు సైలెంట్ అయ్యింది

బ్రేకింగ్ : 12 నుండి 15 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆమోదం..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Maddipati Lakshmi Sailaja]]>