PoliticsShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pfizera5539e99-1593-4845-9e2d-576d626acb62-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pfizera5539e99-1593-4845-9e2d-576d626acb62-415x250-IndiaHerald.jpgప్రపంచంలో ఇప్పటి వరకు కరోనాలో ఎన్నో వేరియంట్లు వెలుగు చూశాయి. వీటికి ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ నామకరణం చేసింది. వాటిలో ఇండియాలో అధికంగా వ్యాప్తి చెందిన బీ 1.167కు డెల్టా వైరస్‌గా పేరు పెట్టింది. ప్రతి దేశం కరోనా వేరియంట్లను వాటి పేర్లతోనే పిలవాలని, అలా కాకుండా దేశం పేరుతో పిలవడం సబబు కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అంతేకాకుండా ఇప్పటి వరకు వచ్చిన ప్రమాదకర వేరియంట్లలో డెల్టా వేరియంట్ ప్రమాదకరమని తెలిపిన డబ్ల్యూహెచ్‌ఓ తన నిర్ణయం మార్చుకుంటూ డెల్టా వేరియంట్..pfizer{#}Coronavirusప్రమాదకర కరోనా వైరస్ వేరియంట్‌ని ఈ కంపెనీ వ్యాక్సిన్ నలిపేస్తోందా...?ప్రమాదకర కరోనా వైరస్ వేరియంట్‌ని ఈ కంపెనీ వ్యాక్సిన్ నలిపేస్తోందా...?pfizer{#}CoronavirusFri, 04 Jun 2021 19:16:00 GMTలండన్: ప్రపంచంలో ఇప్పటి వరకు కరోనాలో ఎన్నో వేరియంట్లు వెలుగు చూశాయి. వీటికి ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ నామకరణం చేసింది. వాటిలో ఇండియాలో అధికంగా వ్యాప్తి చెందిన బీ 1.167కు డెల్టా వైరస్‌గా పేరు పెట్టింది. ప్రతి దేశం కరోనా వేరియంట్లను వాటి పేర్లతోనే పిలవాలని, అలా కాకుండా దేశం పేరుతో పిలవడం సబబు కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అంతేకాకుండా ఇప్పటి వరకు వచ్చిన ప్రమాదకర వేరియంట్లలో డెల్టా వేరియంట్ ప్రమాదకరమని తెలిపిన డబ్ల్యూహెచ్‌ఓ తన నిర్ణయం మార్చుకుంటూ డెల్టా వేరియంట్ మరో మూడు వేరియంట్లుగా మారుతుందని వాటిలో బి.1.167.2 అనే వేరియంట్ మరింత ప్రమాదకరమని తేలిపింది.


దీంతో ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ దేశాలు వాడుతున్న ఫైజర్ టీకాను ఈ వేరియంట్‌పై ప్రయోగించారు. ఈ పరీక్షకు వచ్చిన ఫలితాలను చూసి శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు. ఈ ఫలితాలు సామాన్య ప్రజల గుండెల్లో గుబులును మరింత అధికం చేస్తున్నాయి. ఈ వేరియంట్‌పై ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ రూపొందించిన కరోనా టీకా విడుదల చేసే యాంటీబాడీల స్థాయి తక్కువేనని తెలిపింది. ఫైజర్‌ టీకాతో తొలుత ఉన్న కరోనా వైరస్‌పై పోరాడేందుకు విడుదలయ్యే యాంటీబాడీలతో పోలిస్తే.. డెల్టా రకం వైరస్‌కు ఉత్పత్తయ్యే యాంటీబాడీల స్థాయి ఐదు రెట్లు తక్కువని యూకేలోని ‘ఫాన్సిస్‌ క్రిక్‌ ఇన్‌స్టిట్యూట్‌’ పరిశోధకులు జరిపిన అధ్యయనం పేర్కొంది.



అంతేకాకుండా ఈ వేరియంట్‌తో అధిక ముప్పు ఉన్న వారికి బూస్టర్‌ డోసు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే డెల్టా వేరియంట్‌ వ్యాప్తి నేపథ్యంలో ఫైజర్‌ రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గించాలని కూడా యూకే నిర్ణయించుకుంది. ఈ నిర్ణయాన్ని పరిశోధకుల అధ్యయనం సమర్థించింది. డెల్టా వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు కావాల్సిన స్థాయిలో యాంటీబాడీలు కేవలం ఒక్క డోసుతో ఉత్పత్తి కావడం లేదని పేర్కొంది. అంతేకాకుండా కేవలం యాంటీ బాడీలను దృష్టిలో పెట్టుకొని వ్యాక్సిన్ సామర్థ్యాన్ని తెలపలేమని, దీనిపై మరింత పరిశోధన చేసిన తరువాత ఓ నిర్ణయాన్ని తీసుకోవాలని పరిశోధకులు అంటున్నారు. మరి వీరి అధ్యయనంలో ఏం తేలుతుందో వేచి చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అక్కడ ఓకే అంటే టాలీవుడ్ రెడీ... ?

‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ టీజర్ రిలీజ్ అప్పుడే..?

విడాకుల కోసం రచ్చ చేసిన రంభ.. ఎందుకు సైలెంట్ అయ్యింది

బ్రేకింగ్ : 12 నుండి 15 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆమోదం..!

సత్కరించుకునే అవకాశం దక్కినందుకు గర్వంగా ఉంది!

ధూళిపాళ్లకి సెట్ అయినట్లేనా..!

ప్రేమ దేశం హీరో ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>