PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/china-vennulo-vanuku-putinchela-bharath-keelaka-nirnayamb334c911-6240-4595-86c9-1a76d838e4b7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/china-vennulo-vanuku-putinchela-bharath-keelaka-nirnayamb334c911-6240-4595-86c9-1a76d838e4b7-415x250-IndiaHerald.jpgభారత్, చైనా మధ్య ఉన్న ఉద్రిక్తల సంగతి తెలిసిందే. చైనా కట్టడికి భారత్ అనేక వ్యూహాలు అనురిస్తోంది. ఇందులో దౌత్య వ్యూహాలతో పాటు రక్షణ వ్యూహాలూ ఉన్నాయి. క్వాడ్‌ దేశాల సంఖ్యను పెంచడం ద్వారా చైనా కట్టడికి బాటలు పరుస్తూనే సొంత సైన్యాన్ని మరింత శక్తివంతం చేసుకుంటోంది ఇండియా. అందులో భాగంగానే..ఏకంగా ఆరు జలాంతర్గాములను నిర్మించాలని భారత్ నిర్ణయించింది. రక్షణ శాఖలో ఇది భారీ నిర్ణయం.. దాదాపు రూ. 50 కోట్లు ఖర్చు చేసేందుకు భారత్ సిద్దంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా మేక్china{#}India;Government;Korea, South;Russiaచైనా వెన్నులో వణుకు పుట్టించేలా.. భారత్ కీలక నిర్ణయం..?చైనా వెన్నులో వణుకు పుట్టించేలా.. భారత్ కీలక నిర్ణయం..?china{#}India;Government;Korea, South;RussiaFri, 04 Jun 2021 10:00:00 GMTభారత్, చైనా మధ్య ఉన్న ఉద్రిక్తల సంగతి తెలిసిందే. చైనా కట్టడికి భారత్ అనేక వ్యూహాలు అనురిస్తోంది. ఇందులో దౌత్య వ్యూహాలతో పాటు రక్షణ వ్యూహాలూ ఉన్నాయి. క్వాడ్‌ దేశాల సంఖ్యను పెంచడం ద్వారా  చైనా కట్టడికి బాటలు పరుస్తూనే సొంత సైన్యాన్ని మరింత శక్తివంతం చేసుకుంటోంది ఇండియా. అందులో భాగంగానే..ఏకంగా ఆరు జలాంతర్గాములను నిర్మించాలని భారత్ నిర్ణయించింది. రక్షణ శాఖలో ఇది భారీ నిర్ణయం.. దాదాపు రూ. 50 కోట్లు ఖర్చు చేసేందుకు భారత్ సిద్దంగా ఉంది.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా మేక్‌ ఇన్‌ ఇండియా లక్ష్యం కూడా నెరవేరుతుందని భావిస్తున్నారు. గతంలో మాదిరిగా విదేశాల నుంచి జలాంతర్గాములు నేరుగా దిగుమతి చేసుకోకుండా వీటిని ఇండియాలోనే నిర్మించిబోతున్నారు. 6 అధునాతన జలాంతర్గాముల నిర్మాణానికి  50 వేల కోట్ల విలువచేసే టెండర్లను నౌకాదళం ఆహ్వానించబోతోంది. ఇవాళ జరిగే ఉన్నత స్థాయి భేటీలో ఈ ప్రాజెక్టుపై....రక్షణమంత్రిత్వ శాఖ పూర్తిస్థాయిలో చర్చించనుంది.

ఈ జలాంతర్గాముల కొనుగోలు ప్రతిపాదనకు  రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిన తర్వాత నౌకా దళం టెండర్‌ నోటిఫికేషన్ ఇస్తుంది.  స్కార్పియన్‌, కల్వరీ జలాంతర్గాముల నిర్మాణం జరిగిన చాలాకాలం తర్వాత పి-75 ఇండియా ప్రాజెక్టు పేరుతో 6 అధునాతన జలాంతర్గాములను ఫ్రాన్స్‌ భాగస్వామ్యంతో నిర్మించబోతోంది. వీటిని మజగావ్‌ డాక్‌యార్డ్‌ లిమిటెడ్‌ ద్వారా నిర్మించే అవకాశం ఉంది.

ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే మజగావ్‌ డాక్‌యార్డ్‌ లిమిటెడ్‌, ఎల్‌ అండ్‌ టీలను వ్యూహాత్మక భాగస్వాములుగా నౌకాదళం గుర్తించింది. ఐదు ప్రపంచ తయారీ సంస్థలు ఫ్రెంచ్‌ నావల్‌ గ్రూప్‌, జర్మన్‌ టీకేఎమ్మెస్, దక్షిణ కొరియా దేవూ, స్పానిష్‌, రష్యా సంస్థలతో  భారత్ ఒప్పందం చేసుకుంటుందని భావిస్తున్నారు. మొత్తానికి ఈ నిర్ణయం చైనా వెన్నులో వణుకు పుట్టించే అవకాశం ఉంది. సముద్ర ప్రాంతాలపై ఆధిపత్యం ద్వారా పొరుగు దేశాలను భయపెట్టాలన్న చైనా వ్యూహానికి ఈ నిర్ణయంతో చెక్‌ పెట్టే అవకాశం కనిపిస్తోంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కేసిఆర్ గ్రీన్ సిగ్నల్.. ఇక వారికి కూడా వ్యాక్సిన్?

గానగంధర్వుడు ఎస్పీ బాలు..మొదటి, చివరి పాటలు ఇవే

ఈటల రాజీనామా ప్రకటన?

ఎస్పీ బాలు కి టాలీవుడ్ స్వర నీరాజనం ...

మరణ శిక్ష నుంచి కేరళ వ్యక్తిని కాపాడిన ఎన్ఆర్ఐ..?

సమంత ను కలవర పెడుతున్న హ్యాష్ ట్యాగ్ !

విజయం మీదే: ఇవి మీరు పాటించకపోతే ఏదీ సాధించలేరు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>