MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/priyamani-birthday-specialfdca7465-ee8f-4f6f-8ff3-4e01d1644567-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/priyamani-birthday-specialfdca7465-ee8f-4f6f-8ff3-4e01d1644567-415x250-IndiaHerald.jpgహీరోయిన్ ప్రియమణి అంటే కుర్రకారుకు యమ క్రేజ్ ఉంది. తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం చిత్ర పరిశ్రమల్లో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి నేడు నేడు పుట్టినరోజు జరుపుకుంటోంది. ప్రియమణి జూన్ 4, 1984న కేరళలోని పాలక్కడ్‌లో జన్మించింది. తండ్రి వసుదేవ మణి అయ్యర్. తల్లి లతా మణి అయ్యర్. ప్రియమణి పూర్తి పేరు ప్రియ వసుదేవ మణి అయ్యర్. దాన్నే షార్ట్ చేసి ప్రియమణి అని స్క్రీన్ నేమ్ పెట్టుకుంది. బీఏ చేసిన ప్రియమణి సినిమాలపై ఆసక్తితో ఈ రంగంలో అడుగుపెట్టింది. తెలుగులో మొదట 2003లో 'ఎవరే అతగాడు?' సినిమాతో తెpriyamani birthday special{#}priyamani;Father;Heroine;June;Chitram;Cinemaఅందం, అభినయం కలగలిపితే ప్రియమణిఅందం, అభినయం కలగలిపితే ప్రియమణిpriyamani birthday special{#}priyamani;Father;Heroine;June;Chitram;CinemaFri, 04 Jun 2021 11:10:00 GMTహీరోయిన్ ప్రియమణి అంటే కుర్రకారుకు యమ క్రేజ్ ఉంది. తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం చిత్ర పరిశ్రమల్లో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి నేడు నేడు పుట్టినరోజు జరుపుకుంటోంది. ప్రియమణి జూన్ 4, 1984న కేరళలోని పాలక్కడ్‌లో జన్మించింది. తండ్రి వసుదేవ మణి అయ్యర్. తల్లి లతా మణి అయ్యర్. ప్రియమణి పూర్తి పేరు ప్రియ వసుదేవ మణి అయ్యర్.



దాన్నే షార్ట్ చేసి ప్రియమణి అని స్క్రీన్ నేమ్ పెట్టుకుంది. బీఏ చేసిన ప్రియమణి సినిమాలపై ఆసక్తితో ఈ రంగంలో అడుగుపెట్టింది. తెలుగులో మొదట 2003లో 'ఎవరే అతగాడు?' సినిమాతో తెరంగేట్రం చేసినా ప్రేక్షకులకు చేరువ కాలేకపోయింది. తర్వాత తమిళంవైపు కొన్నాళ్లు దృష్టి పెట్టింది. మళ్లీ తెలుగులో 'పెళ్ళైనకొత్తలో..' అంటూ హీరో జగపతి బాబుతో జతకట్టింది. ఈ సినిమాతో ప్రియమణి సుడి తిరిగిపోయింది. ప్రియమణి కెరీర్లో ‘పరుత్తి వీరన్' అనే తమిళ చిత్రం ల్యాండ్ మార్క్ సినిమాగా చెప్పొచ్చు. అమీర్ సుల్తాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియమణి కార్తికి జోడీగా నటించింది.


ఈ చిత్రంలో నటనకు గాను ఆమె జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. ఇదే చిత్రం తెలుగులో ‘మల్లిగాడు'గా అనువాధం అయ్యింది. ప్రియమణి బర్త్ డే కావడంతో ప్రస్తుతం ఆమె నటించిన కొత్త చిత్రం విరాటపర్వంలో ఆమె పాత్రకు సంబంధించిన లుక్‌తో సర్ ప్రైజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో  ‘కామ్రేడ్ భారతక్క’ గా నక్సలైట్ పాత్రలో కనిపించబోతుంది ప్రియమణి. మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది.ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో విరాట ప‌ర్వం లో ‘కామ్రేడ్ భారతక్క’ కూడా అంతే కీలకం అంటూ ఈ ఫస్ట్‌లుక్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో నల్లటి డ్రెస్ చిరునవ్వులు చిందిస్తూ.. గన్ పట్టుకుని ‘కామ్రేడ్ భారతక్క’ పాత్రలో ఇమిడిపోయింది ప్రియమణి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎస్పీ బాలు పాడిన తొలి పాట ఏదో తెలుసా?

భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు..?

హరీష్ రావుకు కూడా అవమానాలు: ఈటల

ఎస్పీ బాలు ప్రయాణంలో ప్రజల గుండెల్లో నిలిచిన టాప్ 10 పాటలు ఇవే..!

ఏపీలో థర్డ్‌వేవ్ కలకలం?

కేసిఆర్ గ్రీన్ సిగ్నల్.. ఇక వారికి కూడా వ్యాక్సిన్?

గానగంధర్వుడు ఎస్పీ బాలు..మొదటి, చివరి పాటలు ఇవే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>