MoviesGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/what-is-the-future-if-we-believe-in-the-story-instead-of-the-narrator5eab4743-c8a2-4c60-b360-60c32b508bc5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/what-is-the-future-if-we-believe-in-the-story-instead-of-the-narrator5eab4743-c8a2-4c60-b360-60c32b508bc5-415x250-IndiaHerald.jpgచెక్, రంగ్ దె చిత్రాలు ఆశించిన ఫలితాలనివ్వకపోవడంతో యువ క‌థానాయ‌కుడు నితిన్ త‌న ఆలోచ‌న‌ను మార్చుకున్నారు. కొవిడ్ కార‌ణంగా స‌మాజంలో నెల‌కొన్న అస్థిర ప‌రిస్థితులు, ఆర్థిక స‌మ‌స్య‌ల‌తోపాటు త‌న మార్కెట్ కూడా ఆశించినంత‌ డిమాండ్‌గా క‌న‌ప‌డ‌టంలేద‌ని ఒక స్ప‌ష్ట‌త‌కు వ‌చ్చిన‌ట్లున్నారు. ప్ర‌స్తుతానికి వివాదాస్ప‌ద క‌థాంశాలు కాకుండా సేఫ్ జోన్‌తో ఉండే క‌థాంశాలే ఎంచుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. అందుకే ‘పవర్ పేట’ సినిమాను ప‌క్క‌న పెట్టిన‌ట్లు స‌మాచారం. ఈ చిత్రం రాజ‌కీయాలతో ముడిప‌డి ఉండ‌టం, రౌmovies, latest news, nithin, krishnachaitanya{#}Yuva;vegetable market;Chitram;Cinema;vamsi;Telugu;editor mohan;Pettaక‌థానాయ‌కుణ్ని కాకుండా క‌థ‌ను న‌మ్ముకుంటేనే భ‌విష్య‌త్తు?క‌థానాయ‌కుణ్ని కాకుండా క‌థ‌ను న‌మ్ముకుంటేనే భ‌విష్య‌త్తు?movies, latest news, nithin, krishnachaitanya{#}Yuva;vegetable market;Chitram;Cinema;vamsi;Telugu;editor mohan;PettaThu, 03 Jun 2021 10:08:11 GMT
చెక్, రంగ్ దె చిత్రాలు ఆశించిన ఫలితాలనివ్వకపోవడంతో యువ క‌థానాయ‌కుడు నితిన్ త‌న ఆలోచ‌న‌ను మార్చుకున్నారు. కొవిడ్ కార‌ణంగా స‌మాజంలో నెల‌కొన్న అస్థిర ప‌రిస్థితులు, ఆర్థిక స‌మ‌స్య‌ల‌తోపాటు త‌న మార్కెట్ కూడా ఆశించినంత‌ డిమాండ్‌గా క‌న‌ప‌డ‌టంలేద‌ని ఒక స్ప‌ష్ట‌త‌కు వ‌చ్చిన‌ట్లున్నారు. ప్ర‌స్తుతానికి వివాదాస్ప‌ద క‌థాంశాలు కాకుండా సేఫ్ జోన్‌తో ఉండే క‌థాంశాలే ఎంచుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. అందుకే ‘పవర్ పేట’ సినిమాను ప‌క్క‌న పెట్టిన‌ట్లు స‌మాచారం. ఈ చిత్రం రాజ‌కీయాలతో ముడిప‌డి ఉండ‌టం, రౌడీయిజానికి కేంద్ర‌స్థానంగా ఉండే ఒక ప్రాంతంతో ఈ సినిమా క‌థ ఉండ‌టంలాంటి అంశాల‌న్నీ నితిన్ ఆలోచ‌న‌ను మార్చిన‌ట్లున్నాయి.

అట‌కెక్కిన ప‌వ‌ర్‌పేట‌?
వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ కమర్షియల్ ఎంటర్‌టైన‌ర్ చేయాల‌ని నితిన్ నిర్ణ‌యించుకున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా ప్రారంభోత్స‌వం జ‌ర‌గ‌బోతోంది. దీన్నిబ‌ట్టి ‘పవర్ పేట’ అట‌కెక్కిన‌ట్లేనని తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ వ‌ర్గాలంటున్నాయి. భవిష్యత్తులో అయినా నితిన్ ఈ సినిమా చేస్తాడా? అనేది సందేహాస్ప‌దంగా మారింది. ఈ స్క్రిప్టు మీద దాదాపు మూడు సంవ‌త్స‌రాలు పనిచేసిన కృష్ణచైతన్య భ‌విష్య‌త్తు సందిగ్ధంలో ప‌డింది. ఈ క‌థ‌ను ఇంకో క‌థానాయ‌కుడెవ‌రూ చేసే ప‌రిస్థితి కూడా లేదు. దాదాపు ఈ సినిమా స్క్రిప్టు మొత్తం నితిన్ హావ‌భావాల‌ను దృష్టిలో పెట్టుకొని తీర్చిదిద్దారు. త‌న కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, అత్యధిక బడ్జెట్లో ఈ సినిమా ఉండాల‌ని నితిన్ అప్ప‌టికే ఒక నిర్ణ‌యం తీసుకున్నారు. ‘రౌడీ ఫెలో,’ ‘ఛల్ మోహన్ రంగ’ త‌ర్వాత నుంచే కృష్ణచైతన్య ఈ ప్రాజెక్టు మీద పని చేస్తున్నారు.

సందిగ్ధంలో కృష్ణ‌చైత‌న్య భ‌విష్య‌త్తు?
తమిళంలో ‘వడ చెన్నై’ తరహాలో ఆంధ్రాలో ఒక‌ ప్రాంతం రౌడీయిజానికి పెట్టింది పేరు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీర్చిదిద్దడానికి కృష్ణచైతన్య బాగా కసరత్తు చేశారు. పవర్ పేట చరిత్ర, నేపథ్యం మీద ఎంతో పరిశోధన చేసి ఈ సినిమాకు స్క్రిప్టు సిద్ధం చేసిన కృష్ణ‌చైత‌న్య శ్ర‌మంతా ఇప్పుడు బూడిద‌లో పోసిన ప‌న్నీరైంది. బ‌డ్జెట్ ఎక్కువైతే తాను నిధులు స‌మ‌కూర్చ‌డానికి నితిన్ ముందుకు వ‌చ్చారు. కానీ కొవిడ్ కార‌ణంగా ఏర్ప‌డిన అస్త‌వ్య‌స్త ప‌రిస్థితులు, ప్ర‌జ‌ల ఆర్థిక స్థితిగ‌తులు నితిన్ ఆలోచ‌న‌ను మారిస్తే కృష్ణ‌చైత‌న్య భ‌విష్య‌త్తును సందేహంలో ప‌డేశాయి. ఇటువంటి ప‌రిస్థితులు చూసైనా ఇక‌నుంచి ద‌ర్శ‌కులు క‌థానాయ‌కుల‌ను కాకుండా క‌థ‌ను న‌మ్ముకొని వాటికి అనుగుణంగా హీరోల‌ను ఎంపిక చేసుకుంటే బాగుంటుంద‌ని సినీ విశ్లేష‌కులు సూచిస్తున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సోనూసూద్ ని కలిసేందుకు సాహసం.. ఇంతకీ ఏం చేశాడంటే?

నాగార్జున కోసం భారీ రిస్క్.. లెక్కకు మించి!

రాజీపడి విషయాన్ని బయటపెట్టిన సమంత !

త‌ర్వ‌లోనే పోల‌వ‌రం నిర్వాసితుల‌తో స‌మావేశం - ఏపీ సీపీఐ

దేవరకొండ - సుకుమార్ సినిమా షురూ?

సల్మాన్ బాటలో మెగా హీరో..!

కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇస్తున్న ప్రముఖ నిర్మాత ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>