PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ntre64ceedf-98f1-43df-b983-0b2a2826be89-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ntre64ceedf-98f1-43df-b983-0b2a2826be89-415x250-IndiaHerald.jpgసెలబ్రెటీల గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అందుకే.. వాళ్ల ఇంటర్వ్యూలకు అంత ఆదరణ ఉంటుంది. అయితే సెలబ్రెటీల అసలు స్వరూపం తెలుసుకోవాలంటే.. వాళ్ల ఇంటర్వ్యూలు కాదు.. వాళ్లను రోజూ దగ్గర నుంచి చూసే వాళ్లను ఇంటర్వ్య చేస్తే అసలు విషయాలు బయటికొస్తాయి. మరి తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఎన్టీఆర్ గురించి ఆయన్ను దగ్గర నుంచి చూసిన ఓ వ్యక్తి చెబుతున్న రహస్యాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ విషయాలు బయటపెట్టింది.. ఎన్టీఆర్ కు 14 సంవత్సరాల పాటు డ్రైవర్ గా పని చేసిన లక్ష్మణ్. డ్రైవర్లను చాలా మంది పేరుతntr{#}NTR;Driver;Telugu;Chief Minister;lakshman;Wife;January;Evening;Manamసీనియర్ ఎన్టీఆర్ గురించి.. ఆయన డ్రైవర్ చెప్పిన రహస్యాలు..!సీనియర్ ఎన్టీఆర్ గురించి.. ఆయన డ్రైవర్ చెప్పిన రహస్యాలు..!ntr{#}NTR;Driver;Telugu;Chief Minister;lakshman;Wife;January;Evening;ManamThu, 03 Jun 2021 22:27:02 GMTసెలబ్రెటీల గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అందుకే.. వాళ్ల ఇంటర్వ్యూలకు అంత ఆదరణ ఉంటుంది. అయితే సెలబ్రెటీల అసలు స్వరూపం తెలుసుకోవాలంటే.. వాళ్ల ఇంటర్వ్యూలు కాదు.. వాళ్లను రోజూ దగ్గర నుంచి చూసే వాళ్లను ఇంటర్వ్య చేస్తే అసలు విషయాలు బయటికొస్తాయి. మరి తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఎన్టీఆర్ గురించి ఆయన్ను దగ్గర నుంచి చూసిన ఓ వ్యక్తి చెబుతున్న రహస్యాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఈ విషయాలు బయటపెట్టింది.. ఎన్టీఆర్ కు 14 సంవత్సరాల పాటు  డ్రైవర్ గా పని చేసిన లక్ష్మణ్. డ్రైవర్లను చాలా మంది పేరుతో పిలుస్తారు. అందులోనూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎన్టీఆర్.. కానీ.. ఆయన 14 ఏళ్లలో ఒక్కసారి కూడా లక్ష్మణ్ ను అరేయ్ అని కానీ.. డ్రైవర్ అని కానీ పిలవలేదట. ఎప్పడూ లచ్చన్నా.. అనే సంబోధించేవారట. అంతే కాదు. తన కుటుంబంలో ఎవరినీ డ్రైవర్ అని పిలవనిచ్చేవారు కాదట.

ఎన్టీఆరే కాదు.. ఆయన భార్య బసవతారకం కూడా చాలా బాగా చూసుకునేవారట. ఎన్టీఆర్ కారులో ఎటైనా వెళ్తుంటే.. రామన్న, లచ్చన్న.. బాగున్నారు జోడి.. అనేవారట. ఓసారి లక్ష్మణ్‌ కుటుంబ సమేతంగా సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నప్పుడు ఎన్టీఆర్ ను ఆహ్వానించారట. డ్రైవర్ ఇంటికి వ వెళ్లేదేమిటని ఎన్టీఆర్ అనుకోలేదు. సతీసమేతంగా వచ్చి.. ఆ దంపతులకు బట్టలు కూడా పెట్టారట. విచత్రం ఏంటంటే.. ఆ బట్టలను ఇంతవరకు లక్ష్మణ్‌ కుట్టించుకోలేదట. బీరువాలో భద్రంగా దాచుకున్నారట. ఎందుకో తెలుసా.. తాను చచ్చినపుడు వాటిని తన శవం మీద కప్పాలన్నది లక్ష్మణ్‌ కోరికట.  

ఇక చివరగా ఎన్టీఆర్ మరణించే ముందు రోజును గుర్తు చేసుకున్నారు లక్ష్మణ్.. 1996 జనవరి 17న సాయంత్రం లక్ష్మణ్‌ను పిలిపించారట ఎన్టీఆర్.. ఒకటో తారీఖు నుంచి మనం ప్రజల్లోకి వెళ్లాలి.. చైతన్యరథం సిద్ధం చేయండి.. అని చెప్పారట. సరే అన్నారట లక్ష్మణ్‌.. ఆ తర్వాత ఉదయం నాలుగు గంటలకే ఎన్టీఆర్ మరణవార్త తెలిసిందంటూ కన్నీరు పెట్టుకున్నాడు లక్ష్మణ్‌.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విజయం మీదే: ఇవి మీరు పాటించకపోతే ఏదీ సాధించలేరు ?

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్..!

ఓటీటీలో రానా సినిమా..?

ష‌ర్మిలా పార్టీపేరుకు ఈసీ ఆమోదం...పేరు ఇదే

భార్య కంటే అదే బెటర్.. పూరీ షాకింగ్ వ్యాఖ్యలు..?

ఆనందయ్య ఐ డ్రాప్స్.. అందుబాటులోకి ఎప్పుడో తెలుసా?

బ్రేకింగ్ : ఏపీలో ఈ రోజు క‌రోనా కేసులు ఎన్నంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>