MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh4cc6a28a-ded6-4d0f-840a-c6ee2ff86234-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh4cc6a28a-ded6-4d0f-840a-c6ee2ff86234-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమకి చాలా మంది హీరోయిన్స్ పరిచయం అవుతుంటారు. అందులో కొంతమందికి మాత్రమే సరైన గుర్తింపు వస్తుంది. అలాంటి వారిలో ఒక్కరే నివేదా థామస్. ఇక జెంటిల్ మేన్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది నివేదా థామస్.mahesh{#}NTR;Heroine;Nivetha Thomas;Jr NTR;Jai Lavakusa;BEAUTY;mahesh babu;Cinema;Industry;trivikram srinivasమహేష్ సినిమాలో ఎన్టీఆర్ హీరోయిన్..!మహేష్ సినిమాలో ఎన్టీఆర్ హీరోయిన్..!mahesh{#}NTR;Heroine;Nivetha Thomas;Jr NTR;Jai Lavakusa;BEAUTY;mahesh babu;Cinema;Industry;trivikram srinivasThu, 03 Jun 2021 11:00:00 GMTచిత్ర పరిశ్రమకి చాలా మంది హీరోయిన్స్ పరిచయం అవుతుంటారు. అందులో కొంతమందికి మాత్రమే సరైన గుర్తింపు వస్తుంది. అలాంటి వారిలో ఒక్కరే నివేదా థామస్. ఇక జెంటిల్ మేన్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది నివేదా థామస్. తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినా మంచి గుర్తింపును తెచ్చిపెట్టే పాత్రల్లో నివేదా థామస్ ఎక్కువగా నటించారు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది నివేదా. ఆ తర్వాత వకీల్ సాబ్ సినిమాలో పల్లవి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ టాలెంటెడ్ హీరోయిన్ ఏ సినిమాలో నటించినా ఆమె క్యారెక్టర్ స్పెషల్ గా ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. అయితే ఈ బ్యూటీ సూపర్ స్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తోంది.

అయితే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్ కోసం నివేదా థామస్ ఎంపికయ్యారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. తన ప్రతి సినిమాలో సెకండ్ హీరోయిన్స్ కు సైతం మంచి పాత్ర ఉండేలా జాగ్రత్త పడే త్రివిక్రమ్ శ్రీనివాస్ నివేదా థామస్ కొరకు ఎలాంటి పాత్రను డిజైన్ చేశారో చూడాల్సి ఉంది. నివేదాకు స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా ఆఫర్లు రావడానికి మరో కారణం కూడా ఉంది.

కాగా.. మిగతా హీరోయిన్లలా నివేదా థామస్ పాత్రకు సంబంధించి షరతులు పెట్టదు. ఇక పాత్ర గుర్తింపు తెచ్చిపెట్టేలా ఉంటే కచ్చితంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే మల్లూ బ్యూటీ నివేదా. మహేష్ సినిమాలో నటిస్తే మాత్రం నటిగా మరింత బిజీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. నటనలోనే కాదు డ్యాన్స్ లో కూడా సత్తా చాటుతుండటం నివేదా థామస్ కు ప్లస్ అవుతోంది. ఎలాంటి పాత్రకైనా పూర్తిస్థాయిలో న్యాయం చేసే నివేదా థామస్ కు ఛాన్స్ ఇవ్వడానికి నిర్మాతలు సైతం ఆసక్తి చూపుతున్నారని చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చెప్పులు కూడా లేని స్థాయి నుంచి మంత్రిగా ఎదిగిన హరీష్ రావు!

మన హీరోలు అదే ఎందుకు కావాలంటున్నారు.. జరిగే పనేనా..

లింగుస్వామి నిర్ణయం తో ఫ్లాప్ అవుతుందన్న భయం లో రామ్ ఫ్యాన్స్!!

నాగార్జున కోసం భారీ రిస్క్.. లెక్కకు మించి!

రాజీపడి విషయాన్ని బయటపెట్టిన సమంత !

షాకింగ్: రైలు పట్టాలపై 9 వేల శవాలు..?

త‌ర్వ‌లోనే పోల‌వ‌రం నిర్వాసితుల‌తో స‌మావేశం - ఏపీ సీపీఐ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>