MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ott2413990a-71f0-4661-9d67-0f654839e102-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ott2413990a-71f0-4661-9d67-0f654839e102-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమ డైలమాలో ఉంది. సినిమాలు నిర్మించకపోతే ఓ విధమైన పరిస్థితి సినిమాలు నిర్మిస్తే మరో విధమైన పరిస్థితి నెలకొనడంతో హీరోలు నిర్మాతలు దర్శకులు ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆల్రెడీ చాలామంది నిర్మాతలు రెండేసి మూడేసి సినిమాలను ప్రకటించి నిర్మాణదశలో ఉంచారు. రేపోమాపో రిలీజ్ అని అనౌన్స్ చేశారు కూడా కొన్ని సినిమాలను. కానీ కరోనా రెండోదశ వారి సినిమాల రిలీజ్ లకు అడ్డుకట్ట వేసింది. దాంతో ఒక్కసారిగా ప్రకటించిన సినిమాల విడుదల తేదీలు పోస్ట్ పోన్ అవక తప్పలేదు. OTT{#}Tollywood;Cinema;cinema theaterమన హీరోలు అదే ఎందుకు కావాలంటున్నారు.. జరిగే పనేనా..మన హీరోలు అదే ఎందుకు కావాలంటున్నారు.. జరిగే పనేనా..OTT{#}Tollywood;Cinema;cinema theaterThu, 03 Jun 2021 11:00:00 GMTప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమ డైలమాలో ఉంది. సినిమాలు నిర్మించకపోతే ఓ విధమైన పరిస్థితి సినిమాలు నిర్మిస్తే మరో విధమైన పరిస్థితి నెలకొనడంతో హీరోలు నిర్మాతలు దర్శకులు ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆల్రెడీ చాలామంది నిర్మాతలు రెండేసి మూడేసి సినిమాలను ప్రకటించి నిర్మాణదశలో ఉంచారు. రేపోమాపో రిలీజ్ అని అనౌన్స్ చేశారు కూడా కొన్ని సినిమాలను. కానీ కరోనా రెండోదశ వారి సినిమాల రిలీజ్ లకు అడ్డుకట్ట వేసింది. దాంతో ఒక్కసారిగా ప్రకటించిన సినిమాల విడుదల తేదీలు పోస్ట్ పోన్ అవక తప్పలేదు.

తలలు పట్టుకుంటూనే నిర్మాతలు తమ సినిమాలను ఎలా రిలీజ్ చేయాలనే ఆలోచనలో పడ్డారు. అప్పుడే వారికి ప్రత్యామ్నాయంగా ఓ టీ టీ లు కనిపించాయి. ఓ టి టి లకు మంచి డిమాండ్ ఏర్పడటంతో నిర్వాహకులు కూడా కోట్లు పెట్టి సినిమాలను కొనేస్తున్నారు. నిర్మాతలు కూడా ఏదైతే అదే అయిందని సినిమాలు అమ్మడానికి రెడీ అవుతున్నారు. కానీ ఈ తరహా విడుదలైన సినిమాల ఫలితాలు దారుణంగా ఉండడంతో హీరోలు తమ క్రేజ్ పడిపోతుందనే ఉద్దేశంతో నిర్మాతల ఆలోచన కు వ్యతిరేకంగా ఉన్నారు. ఎన్ని రోజులు అయినా థియేటర్లు ఓపెన్ అయ్యాకే సినిమా రిలీజ్ అవ్వాలి OTT లలో సినిమా రిలీజ్ అవ్వడానికి వీలు లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట.

ఇది నిర్మాతలకి కొంత చేదు విషయమే అయినా హీరోలు చెప్పే దాంట్లో కూడా న్యాయం ఉందని అనుకుంటున్నారట. ఇప్పటికే టాలీవుడ్ లో రిలీజ్ అవ్వాల్సిన చాలా సినిమాలు థియేటర్ ఓపెనింగ్ కోసం ఎదురుచూస్తుండగా ఇంకొన్ని చిన్న చిన్న సినిమాలు OTT లలో విడుదలయ్యాయి. ‘టక్ జగదీష్’ ‘ఖిలాడీ’ ‘లవ్ స్టోరీ’ ‘సీటిమార్’ వంటి సినిమాలకు పెద్ద ఎత్తున బిజినెస్ జరిగింది. వాళ్ళు చాలా కాలం నుండీ థియేటర్లలో వాళ్ళ బొమ్మని దింపాలని ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటిలో థియేటర్లో ఓపెన్ అయ్యే ఛాన్సు లేకపోవడంతో నిర్మాతల గుండెల్లో గుబులు పుడుతున్నాయట. అందరూ థియేటర్లకు చూస్తే ఎలా నిర్మాతల కోసం OTT ల వైపు చూసి వారిని కాపాడాలని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి మన హీరోలు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చెప్పులు కూడా లేని స్థాయి నుంచి మంత్రిగా ఎదిగిన హరీష్ రావు!

లింగుస్వామి నిర్ణయం తో ఫ్లాప్ అవుతుందన్న భయం లో రామ్ ఫ్యాన్స్!!

నాగార్జున కోసం భారీ రిస్క్.. లెక్కకు మించి!

రాజీపడి విషయాన్ని బయటపెట్టిన సమంత !

షాకింగ్: రైలు పట్టాలపై 9 వేల శవాలు..?

త‌ర్వ‌లోనే పోల‌వ‌రం నిర్వాసితుల‌తో స‌మావేశం - ఏపీ సీపీఐ

దేవరకొండ - సుకుమార్ సినిమా షురూ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>