PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/china-shocking-nirnayam-nakkajithulu-phalistaya7d5a2585-f511-4dcc-b58a-96eb03053d6f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/china-shocking-nirnayam-nakkajithulu-phalistaya7d5a2585-f511-4dcc-b58a-96eb03053d6f-415x250-IndiaHerald.jpgచైనా.. ఇప్పుడు ఈ పేరు చెబితేనే ప్రపంచం వణుకుతోంది. వైరస్‌ల కర్మాగారంగా ఈ దేశం మారిపోయింది. ఇప్పటికే ఈ చైనా నుంచి పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. ఇక ఇప్పుడు చైనా నుంచి మరో మహమ్మారి రాబోతోందా.. అన్నట్టు చైనా నుంచి మరో వైరస్ వెలుగు చూసింది. అంతే కాదు.. చైనా ప్రజాస్వామ్య దేశం కాదు. ఏక పార్టీ పాలన ఉన్న దేశం.. అంటే ఇంచుమించు నియంతృత్వమే. అయితే.. ఇలా నియంతృత్వ దేశంగా, కరోనాకు పుట్టినిల్లుగా ఉన్న చెడ్డపేరు పొగొట్టుకునేందుకు చైనా ఇప్పుడు నక్కజిత్తులు వినియోగిస్తోంది. ప్రపంchina{#}Coronavirus;Party;Dookuduచైనా షాకింగ్ నిర్ణయం.. నక్కజిత్తులు ఫలిస్తాయా..?చైనా షాకింగ్ నిర్ణయం.. నక్కజిత్తులు ఫలిస్తాయా..?china{#}Coronavirus;Party;DookuduThu, 03 Jun 2021 07:00:00 GMTకరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. ఇక ఇప్పుడు చైనా నుంచి మరో మహమ్మారి రాబోతోందా.. అన్నట్టు చైనా నుంచి మరో వైరస్ వెలుగు చూసింది. అంతే కాదు.. చైనా ప్రజాస్వామ్య దేశం కాదు. ఏక పార్టీ పాలన ఉన్న దేశం.. అంటే ఇంచుమించు నియంతృత్వమే.


అయితే.. ఇలా నియంతృత్వ దేశంగా, కరోనాకు పుట్టినిల్లుగా ఉన్న చెడ్డపేరు పొగొట్టుకునేందుకు చైనా ఇప్పుడు నక్కజిత్తులు వినియోగిస్తోంది. ప్రపంచ యవనికపై తన ఇమేజ్‌ మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఓ ప్లాన్ రెడీ చేసింది. చైనా కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌ బ్యూరో సమావేశంలో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఈ విషయం బయటపెట్టారు. ఈ విషయాన్ని చైనా అధికారిక న్యూస్‌ ఏజెన్సీ షినోవా కూడా ప్రకటించింది.


ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి అంటారా.. అదే మిస్టర్ మంచివాడు.. అంటే.. తన ఇమేజ్ మార్చుకునేందుకు.. నమ్మకమైన, గౌరవప్రదమైన, ప్రేమపూర్వక దేశంగా  పేరు తెచ్చుకునేందుకు చైనా మంచి దేశం అనే ఇమేజ్ కోసం ట్రై చేస్తోందట. చైనా రాయబారులు తమ దుందుడుకు వ్యవహార శైలిని, వైఖరిని మార్చుకుని కాస్త సౌమ్యంగా వ్యవహరిస్తారట. అలా ఉండాలని.. మిత్రుల్ని పెంచుకోవాలని జిన్‌పింగ్‌ స్వయంగా వారికి సూచించారు.


ప్రపంచంలో మిత్రులను విస్తృతంగా పెంచుకోవాలని, అత్యధిక మందిని ఏకతాటి మీదకు తీసుకురావాలని జిన్‌పింగ్ వారికి బోధించారట.  చైనాను అర్థం చేసుకొని స్నేహపూర్వకంగా ఉండేవారి సంఖ్యను గణనీయంగా పెంచుకోవాలని సూచించారట. అలా ఎందుకు ప్రత్యేకించి అన్నారంటే.. ఇటీవలి కాలంలో చైనా దౌత్యవేత్తల దూకుడు వ్యవహార శైలి కారణంగా ఆ దేశానికి ప్రపంచవ్యాప్తంగా ఎదురుదెబ్బలు తగిలాయి. యూరోపియన్ యూనియన్ తో పాటు ఫిలిప్పీన్స్‌ తోనూ సంబంధాలు చెడిపోవడానికి దౌత్య వేత్తల దుందుడుకువైఖరే కారణమట. అందుకే కాస్త సాఫ్ట్‌గా ఉండి ప్రపంచం మనసు గెలుచుకోవాలని చైనా ప్రయత్నిస్తుందన్నమాట.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం... !

దేవరకొండ - సుకుమార్ సినిమా షురూ?

కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇస్తున్న ప్రముఖ నిర్మాత ?

స్పోర్ట్స్: ఇకపై టీ20 లో ఎన్ని జట్లు.. ఆడుతాయో తెలుసా ?

బుల్లి పిట్ట: ఆధార్ కు ఫోన్ నెంబర్ లింక్ ఎలా చేయాలో తెలుసా ?

ఏడేళ్ల తెలంగాణ: తెలంగాణ సాధనలో తొలి మహిళగా పోరాటం ?

తెలంగాణా ప్రజలకు ఏడేళ్ళలో బాగా దగ్గరైన సంక్షేమం...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>