MLAProgressM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla-0eaa8c70-65db-4ae1-a7c4-4d8b9c7d4a31-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla-0eaa8c70-65db-4ae1-a7c4-4d8b9c7d4a31-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ ఆవిర్భావించక చాలామంది నాయకులకు రాజకీయంగా అండగా దొరికిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ పార్టీల్లో ఉన్న నాయకులు టీడీపీలో ఓనమాలు నేర్చుకున్నవారే. అలాగే టీడీపీలో రాజకీయం నేర్చుకుని, పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఇప్పుడు అదే పార్టీకి చెక్ పెడుతున్న నాయకుడు శంబంగి వెంకట చిన అప్పలనాయుడు.ysrcp mla{#}రాజీనామా;2019;MLA;Telugu Desam Party;Telugu;Onamalu;Cheque;Party;Vijayanagaram;Vizianagaram;Bobbili;TDP;YCP;krishna;Ministerహెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: శంబంగికి గట్టి పోటీ ఇస్తున్న సుజయ సోదరుడు...హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: శంబంగికి గట్టి పోటీ ఇస్తున్న సుజయ సోదరుడు...ysrcp mla{#}రాజీనామా;2019;MLA;Telugu Desam Party;Telugu;Onamalu;Cheque;Party;Vijayanagaram;Vizianagaram;Bobbili;TDP;YCP;krishna;MinisterThu, 03 Jun 2021 05:00:00 GMTతెలుగుదేశం పార్టీ ఆవిర్భావించక చాలామంది నాయకులకు రాజకీయంగా అండగా దొరికిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ పార్టీల్లో  ఉన్న నాయకులు టీడీపీలో ఓనమాలు నేర్చుకున్నవారే. అలాగే టీడీపీలో రాజకీయం నేర్చుకుని, పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఇప్పుడు అదే పార్టీకి చెక్ పెడుతున్న నాయకుడు శంబంగి వెంకట చిన అప్పలనాయుడు.


టీడీపీలో రాజకీయ జీవితం మొదలుపెట్టిన శంబంగి, 1983,1985,1994 ఎన్నికల్లో విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున విజయం సాధించారు. 1989, 1999, 2004 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే తర్వాత 2009 ఎన్నికల్లో ఈయనకు సీటు దక్కలేదు. దీంతో టీడీపీలో ప్రాధాన్యత దక్కడం లేదని వైసీపీలోకి వెళ్లారు. అక్కడ కూడా సరిగా లేదని చెప్పి, మళ్ళీ వైసీపీకి రాజీనామా చేసి, సైలెంట్‌గా ఉండిపోయారు.


ఇక 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున బొబ్బిలి నుంచి గెలిచిన సుజయ కృష్ణ రంగారావు టీడీపీలోకి వెళ్ళిపోయారు. దీంతో ఆయనకు చెక్ పెట్టేందుకు జగన్...మళ్ళీ శంబంగిని వైసీపీలోకి తీసుకొచ్చారు. 2019 ఎన్నికల్లో బొబ్బిలి సీటు కూడా ఇచ్చారు. ఇక వైసీపీ తరుపున పోటీ చేసి రాజకీయ జీవితం ఇచ్చిన టీడీపీకే చెక్ పెట్టారు.


టీడీపీ నుంచి పోటీ చేసిన సుజయకృష్ణ రంగారావుని చిత్తుగా ఓడించారు. నాలుగోసారి ఎమ్మెల్యే అయిన శంబంగికి నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. అలాగే సమస్యలపై అవగాహన ఉంది. దాని వల్ల సులువుగా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. సీనియర్ నేత కావడంతో అధికారులతో చెప్పి త్వరగానే పనులు చేయించుకోగలుగుతున్నారు.


అటు టీడీపీలో మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు ఉన్నారు. ఈయన పార్టీలో పెద్దగా యాక్టివ్ గా ఉన్నట్లు కనిపించడం లేదు. దీంతో బొబ్బిలి బాధ్యతలు సుజయ సోదరుడు బేబీ నాయన చూసుకుంటున్నారు. ఈయన నియోజకవర్గంలో దూకుడుగా పనిచేస్తున్నారు. పార్టీ తరుపున ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, అధికార వైసీపీపై పోరాడుతున్నారు. ఇటీవల పంచాయితీ ఎన్నికల్లో బొబ్బిలిలో వైసీపీ ఎక్కువ స్థానాలు గెలిచింది. అలాగే టీడీపీ కూడా పలుచోట్ల విజయం సాధించింది. బొబ్బిలి మున్సిపాలిటీ వైసీపీ ఖాతాలోనే పడినా, టీడీపీ మాత్రం గట్టి పోటీ ఇచ్చింది. మొత్తానికైతే శంబంగికి బేబీ నాయన గట్టి పోటీనే ఇస్తున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సోనియామ్మా.. అంతా ద్వేషం ఎందుకమ్మా?

కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇస్తున్న ప్రముఖ నిర్మాత ?

స్పోర్ట్స్: ఇకపై టీ20 లో ఎన్ని జట్లు.. ఆడుతాయో తెలుసా ?

బుల్లి పిట్ట: ఆధార్ కు ఫోన్ నెంబర్ లింక్ ఎలా చేయాలో తెలుసా ?

ఏడేళ్ల తెలంగాణ: తెలంగాణ సాధనలో తొలి మహిళగా పోరాటం ?

తెలంగాణా ప్రజలకు ఏడేళ్ళలో బాగా దగ్గరైన సంక్షేమం...?

విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా ఆవిర్భవించి తొలి విజయాన్ని అందుకున్న తెలంగాణ!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>