PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/telanga-sarkar-acc66cfb-1d92-4a6a-a76e-261b041790d4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/telanga-sarkar-acc66cfb-1d92-4a6a-a76e-261b041790d4-415x250-IndiaHerald.jpg తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడు, రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్ రావు రాజ‌కీయాల్లో విభిన్న‌మైన వ్య‌క్తిత్వం ఉన్న నేత అనే సంగ‌తి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ ట్ర‌బుల్ షూట‌ర్ అనే గుర్తింపు పొందిన ఈ ముఖ్య నేత పుట్టిన రోజు నేడు. హ‌రీష్ రావు కు పార్టీలోనే కీల‌క నాయ‌కుడిగా గుర్తింపు ఉంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సిద్ధిపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న వ‌రుస‌గా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 32 ఏళ్ల వ‌య‌సులో తొలిసారి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచిన హ‌రీష్ రావు, అప్ప‌టి నుంచి వెనుతిరిగి చూసుకోకుండా తెలంగాharish rao{#}KCR;Minister;Telangana Rashtra Samithi TRS;Assembly;Parliamentదటీజ్ హరీష్ : ఎక్కడా తగ్గేదేలే!దటీజ్ హరీష్ : ఎక్కడా తగ్గేదేలే!harish rao{#}KCR;Minister;Telangana Rashtra Samithi TRS;Assembly;ParliamentThu, 03 Jun 2021 12:00:00 GMT

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడు, రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్ రావు రాజ‌కీయాల్లో విభిన్న‌మైన వ్య‌క్తిత్వం ఉన్న నేత అనే సంగ‌తి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ ట్ర‌బుల్ షూట‌ర్ అనే గుర్తింపు పొందిన ఈ ముఖ్య నేత పుట్టిన రోజు నేడు. 

హ‌రీష్ రావు కు పార్టీలోనే కీల‌క నాయ‌కుడిగా గుర్తింపు ఉంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సిద్ధిపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న వ‌రుస‌గా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 32 ఏళ్ల వ‌య‌సులో తొలిసారి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచిన హ‌రీష్ రావు, అప్ప‌టి నుంచి వెనుతిరిగి చూసుకోకుండా తెలంగాణ‌లో బ‌ల‌మైన రాజ‌కీయ నాయ‌కుడిగా ఎదిగారని చెప్పచ్చు. 


2004లో తొలిసారిగా సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం నుంచి శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు. వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి కేబినెట్‌లో యువజన సర్వీసులు, ప్రింటింగ్‌ స్టేషనరీ శాఖ మంత్రిగా కూడా పని చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిద్దిపేట శాసనసభ, కరీంనగర్ పార్లమెంటు స్థానాలకు ఎన్నికైనందుకు గాను సిద్దిపేట స్థానాన్ని ఆయన ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆ ఖాళీ స్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో హరీష్ రావు ఎన్నికైనారు. ఇక అప్పటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ సందర్భంగా ఆయన ఈ ట్రబుల్ షూటర్ అనే పేరును ఎలా సార్ధకం చేసుకున్నారు అనే ఒక ఎలక్షన్ ని పరిశీలిద్దాం.



 నిజానికి గత ఏడాది జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఊహించని దెబ్బ తగిలింది. అనుకున్న స్థాయిలో సీట్లు గెలుచుకోలేకపోయింది. అయితే హరీష్ రావు మాత్రం తన వ్యూహాన్ని అమలు పరచి.. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించారు. తనకు అప్పగించిన మూడు డివిజన్లలో హరీష్ రావు పార్టీ అభ్యర్థులను గెలిపించారు. గతం కంటే ఒక సీటు అధికంగా సాధించి మరీ దటీజ్ హరీష్ రావు అని అనిపించుకున్నారు. జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్‌ చాలా సిట్టింగ్‌ డివిజన్లను కోల్పోగా.. హరీశ్‌ పర్యవేక్షించిన పటాన్‌చెరు నియోజకవర్గంలో మాత్రం అన్నిట్లోనూ విజయం సాధించారని అంటుంటారు. దీని వెనుక ఆయన అమలు చేసిన మూడంచెల వ్యూహం కీలక పాత్ర పోషించిందని అంచనా.  

అలా మొత్తం మీద అన్ని ఎన్నికల్లో ఆయన తనదైన ప్రత్యేకత చాటుకుంటూ ఉంటారు. 

 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సామాన్యుడు కాదు.. అపర భగీరథుడు హరీష్?

వివాదాలకు దూరంగా.. ప్రజలకు దగ్గరగా.. ఇదే హరీష్ నైజం?

ఏపీ సీఎం గుడ్ న్యూస్..ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రికి ఇల్లు.. !

హీరోలకు ఇష్టం.. నిర్మాతలకు కష్టం.. ఓటీటీలపై తొలగని సందిగ్ధం..

తెలుగోళ్ళు బోర్ కొట్టేశారా రామ్.. అరవోళ్ళపై పడ్డావు..

ప్రతిపక్ష పార్టీ నేతల మనసులు గెలిచి.. మచ్చ లేని నాయకుడైన హరీష్?

చెప్పులు కూడా లేని స్థాయి నుంచి మంత్రిగా ఎదిగిన హరీష్ రావు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>