CrimeN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/sucidie78e6a0c5-0f32-4229-8462-6fc58436d4dd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/sucidie78e6a0c5-0f32-4229-8462-6fc58436d4dd-415x250-IndiaHerald.jpgఇద్దరు ఒక్కరిని ఒక్కరు ఇష్టపడ్డారు. ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చూసుకోవాలని అనుకున్నారు. కానీ వారి పెళ్ళికి అమ్మాయి తండ్రి ఒప్పుకోలేదు. యువతీ ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటా అని ఇంట్లో వాదించింది. దానికి తల్లిదండ్రులు ససేమీరా అన్నారు.sucidie{#}prema;Love;marriage;Girl;Parents;Karnataka - Bengaluru;Wife;policeకూతురి ప్రేమ పెళ్లి.. తల్లిదండ్రులకు గొడవలు.. చివరికి..?కూతురి ప్రేమ పెళ్లి.. తల్లిదండ్రులకు గొడవలు.. చివరికి..?sucidie{#}prema;Love;marriage;Girl;Parents;Karnataka - Bengaluru;Wife;policeThu, 03 Jun 2021 10:16:20 GMTఇద్దరు ఒక్కరిని ఒక్కరు ఇష్టపడ్డారు. ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చూసుకోవాలని అనుకున్నారు. కానీ వారి పెళ్ళికి అమ్మాయి తండ్రి ఒప్పుకోలేదు. యువతీ ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటా అని ఇంట్లో వాదించింది. దానికి తల్లిదండ్రులు ససేమీరా అన్నారు. ఇక యువతీ ఇంట్లో నుండి వెళ్ళిపోయి ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది. కూతురు చేసిన పనికి తీవ్ర మనస్తాపం చెందిన తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రంలోని చెన్నపట్టణ తాలూకా తెంకనహళ్లిదొడ్డి అనే గ్రామంలో రమేశ్, ఆయన భార్య శ్యామల జీవనం సాగిస్తున్నారు. వారికీ ఒక్క కూతురు ఉంది. ఇక రమేశ్ తనకు ఉన్న పొలంలో వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించేవాడు. శిల్పకు తమ గ్రామానికే చెందిన పునీత్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. ఆ స్నేహం కొన్నాళ్లకు ప్రేమగా మారింది. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం కావడంతో ఇరు కుటుంబాలకు అభ్యంతరం తెలిపే అవకాశం కూడా లేదని శిల్ప, పునీత్ భావించారు.

ఇక వారి ప్రేమ గురించి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పింది. పునీత్ కి వాళ్ళ ఊరిలో మంచి పేరు లేదని, అతడిని పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటావని తల్లిదండ్రులు ఆమెకు చెప్పారు. దానికి శిల్ప పునీత్ తప్ప వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోనని ఇంట్లో తెగేసి చెప్పింది. దీంతో శిల్పాకు, తల్లిదండ్రుల మధ్య గొడవలు తలెత్తాయి. తల్లిదండ్రులు వారిద్దరికీ పెళ్లి చేయరని తెలుసుకొని శిల్ప ఇంట్లో నుండి వెళ్ళిపోయి ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఈ విషయం ఊర్లో అందరికి తెలియడంతో పరువు పోయినట్టు అయ్యిందని భర్యతో చెప్పి చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. దంపతులు మామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనతో తెంకనహళ్లిదొడ్డి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గుడ్ న్యూస్.. 60 రూపాయలకే కరోనా టెస్ట్?

నాగార్జున కోసం భారీ రిస్క్.. లెక్కకు మించి!

రాజీపడి విషయాన్ని బయటపెట్టిన సమంత !

త‌ర్వ‌లోనే పోల‌వ‌రం నిర్వాసితుల‌తో స‌మావేశం - ఏపీ సీపీఐ

దేవరకొండ - సుకుమార్ సినిమా షురూ?

సల్మాన్ బాటలో మెగా హీరో..!

కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇస్తున్న ప్రముఖ నిర్మాత ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>