PoliticsN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/minister-harishrao-develop-to-siddipetaa53f52fe-6f70-46ed-a9b2-f51c9cbcf780-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/minister-harishrao-develop-to-siddipetaa53f52fe-6f70-46ed-a9b2-f51c9cbcf780-415x250-IndiaHerald.jpgతెలంగాణలో అభివృద్ది ప‌థంలో దూసుకెళ్తున్న ఏకైక నియోజ‌క‌వ‌ర్గం సిద్దిపేట‌.ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న హ‌రీష్‌రావు రెండ‌వ సారి మంత్రిగా కొన‌సాగుతున్నారు.2014 నుంచి 18 వ‌ర‌కు నీటిపారుద‌ల శాఖ మంత్రిగా,ప్ర‌స్తుతం ఆర్థిక శాఖ మంత్రిగా హ‌రీష్‌రావు కేసీఆర్ క్యాబినెట్‌లో కొన‌సాగుతున్నారు. మంత్రిగా హ‌రీష్ రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్నా...త‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని మాత్రం విస్మ‌రించ‌డంలేదు.ఖాళీ స‌మ‌యం దొరికితే చాలు త‌న నియోజ‌క‌వ‌ర్గంలోకి వెళ్లి అభివృద్ది సంక్షేమ ప‌థ‌కాల‌పై స‌మీక్ష‌లు చేస్harishrao{#}KCR;CM;contract;Anandamఅల్లుడు బంగారం: అభివృద్దిలో మావకే సవాల్ చేసిన అల్లుడు... కేసీఆర్ మురిసిపోతడు గదే...!అల్లుడు బంగారం: అభివృద్దిలో మావకే సవాల్ చేసిన అల్లుడు... కేసీఆర్ మురిసిపోతడు గదే...!harishrao{#}KCR;CM;contract;AnandamThu, 03 Jun 2021 11:09:00 GMTకేసీఆర్ క్యాబినెట్‌లో కొన‌సాగుతున్నారు. మంత్రిగా హ‌రీష్ రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్నా...త‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని మాత్రం విస్మ‌రించ‌డంలేదు.ఖాళీ స‌మ‌యం దొరికితే చాలు త‌న నియోజ‌క‌వ‌ర్గంలోకి వెళ్లి అభివృద్ది సంక్షేమ ప‌థ‌కాల‌పై స‌మీక్ష‌లు చేస్తున్నారు.త‌న నియోజ‌క‌వ‌ర్గంలో కావాల్సిన ప‌నుల‌న్నీ సీఎం కేసీఆర్‌తో మంజూరు చేయించుకుంటున్నారు.అయితే సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గాన్ని మించి ఇక్కడ అభివృద్ది జ‌రిగుతుంద‌నే చెప్పాలి.
సిద్దిపేట అభివృద్ది విష‌యంలో మంత్రి హ‌రీష్‌రావు అస‌లు రాజీప‌డ‌టం లేదు. త‌న నియోజ‌క‌వ‌ర్గాన్నిదేశంలోనే ఆద‌ర్శ నియోజ‌క‌వ‌ర్గంగా తీర్చిదిద్దాల‌నే త‌ప‌న హ‌రీష్‌రావులో ఉంది.త‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ది చేసి త‌న మామ సీఎం కేసీఆర్‌కు స‌వాల్ విసురుతున్నారు హ‌రీష్‌.అయితే హ‌రీష్ రావు ని ఇదే విష‌యంలో ప‌లుమార్లు కేసీఆర్ సైతం పొగుడుతూ మురిసిపోతున్నారు.గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో సిద్దిపేట‌లో జ‌రిగిన స‌భ‌లో సీఎం కేసీఆర్ త‌న అల్లుడు హ‌రీష్‌రావును పొగ‌డ్త‌ల‌తో ముంచే ముంచెత్తారు.త‌న మాదిరిగానే ప‌నిచేసే వ్య‌క్తి కావాల‌నే ఉద్దేశ్యంతోనే సిద్దిపేట‌కు హ‌రీష్‌రావును ఇచ్చాన‌ని సీఎం కేసీఆర్ చెప్పారు.
హ‌రీష్ రావు ఆణిముత్యంమంటూ..అందుకే ఆయ‌న్ని మీకు ఇచ్చాన‌ని ప్ర‌జ‌ల‌ను ఉద్దేశిస్తూ కేసీఆర్ ప్ర‌సంగించారు.హ‌రీష్‌రావు త‌న పేరు నిల‌బెట్టాడ‌ని కేసీఆర్ బ‌హిరంగంగానే చెప్పారు.సిద్దిపేట పరిధిలో నాగుల బండ వద్ద ఐటీ టవర్ కు సీఎం శంకుస్థాపన చేశారు.ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మ‌క్షంలో నాలుగు ఐటీ కంపెనీలు సిద్దిపేట ఐటీ ట‌వ‌ర్‌లోవారి సంస్ధ‌లు ఏర్పాటు చేసుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు.జోలాన్ టెక్నాల‌జీ,విసాన్ టెక్‌,ఎంబ్రోడ్స్ టెక్నాల‌జీ, సెట్విన్ కంపెనీలు రాష్ట్ర ప్ర‌భుత్వంతో ఒప్పందం చేసుక‌న్నాయి. త్వ‌ర‌లోనే సిద్దిపేట‌కు ఎయిర్‌పోర్టు కూడా వ‌స్తుంద‌ని సీఎం కేసీఆర్ చెప్ప‌డంతో సిద్దిపేట ప్ర‌జ‌లు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.ఈఏడాది ఏప్రిల్‌లో ఉగాది రోజున అనేక అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.

న‌గ‌రంలో మినీట్యాంక్ బండ్‌గా పిల‌వ‌బ‌డే కోమ‌టి చెరువును స‌ర్వాంగ‌సుంద‌రంగా తీర్చిదిద్దారు. హైద‌రాబాద్‌కి 103 కిలోమీట‌ర్ల దూరంలో సిద్దిపేట ఉంది.వీకెండ్‌లో హైద‌రాబాద్ నుంచి చాలా మంది ప‌ర్యాట‌కులు ఇక్క‌డి వ‌స్తున్నారు. సిద్దిపేట‌లో ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌రణం క‌ల్పించేలా గ్లోగార్డెన్ డాన్నింగ్ ఫౌంటెన్‌ని ఏర్పాటు చేశారు.ఈ చెరువుకు క‌ల‌ర్‌ఫుల్ లైటింగ్‌ని ఏర్పాటు చేయ‌డంతో జిగేల్‌మంటుంది.దీంతో చాలా మంది ఇక్క‌డికి ఎంజాయ్‌చేయ‌డానికి వ‌స్తున్నారు.సిద్దిపేట‌లో రెండు బ‌స్‌స్టాండ్‌లు ఉన్నాయి..చుట్టుప్ర‌క్క‌లా గ్రామాల‌కు వేళ్లే ఆర్డిన‌రీ బ‌స్సుల‌కు పాత బ‌స్‌స్టాండ్‌ను ఉప‌యోగిస్తున్నారు.ఇత‌ర జిల్లాల‌కు వెళ్లే బ‌స్సుల కోసం కొత్త‌బ‌స్‌స్టాండ్‌ను ఉప‌యోగిస్తున్నారు. 2018లో సిద్దిపేట‌లో ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజ్ ఏర్పాటైంది. మెడిక‌ల్ కాలేజీ ఏర్పాటు కోసం హ‌రీష్ రావు తీవ్రంగా కృషి చేశారు.ప్ర‌తి ఇంటికి మంచి నీళ్లు,ప్రభుత్వం నుంచే వ‌చ్చే ప‌థ‌కాల‌ను ప్ర‌తి ల‌బ్దిదారుడికి అందేలా హ‌రీష్ కృషి చేస్తున్నారు.ఒక్క విష‌యంలో చెప్పాలంటే హ‌రీష్ హాయాంలో సిద్దిపేట ముఖ‌చిత్ర‌మే మార్చార‌నే చెప్పాలి.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చెప్పులు కూడా లేని స్థాయి నుంచి మంత్రిగా ఎదిగిన హరీష్ రావు!

మన హీరోలు అదే ఎందుకు కావాలంటున్నారు.. జరిగే పనేనా..

లింగుస్వామి నిర్ణయం తో ఫ్లాప్ అవుతుందన్న భయం లో రామ్ ఫ్యాన్స్!!

నాగార్జున కోసం భారీ రిస్క్.. లెక్కకు మించి!

రాజీపడి విషయాన్ని బయటపెట్టిన సమంత !

షాకింగ్: రైలు పట్టాలపై 9 వేల శవాలు..?

త‌ర్వ‌లోనే పోల‌వ‌రం నిర్వాసితుల‌తో స‌మావేశం - ఏపీ సీపీఐ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>