PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp63756e59-5701-44fd-8760-2ba1c80f06f9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp63756e59-5701-44fd-8760-2ba1c80f06f9-415x250-IndiaHerald.jpgరాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పరిస్తితి మరీ ఘోరంగా తయారైన విషయం తెలిసిందే. ఆ పార్టీ ఏపీలో కనుమరుగయ్యే స్థితికి వచ్చేసింది. అసలు రాష్ట్ర విభజన జరగగానే అంటే 2014 ఎన్నికల ముందు చాలామంది నాయకులు టీడీపీ, వైసీపీల్లోకి వెళ్ళిపోయారు. అయితే కొందరు నాయకులు మాత్రం 2014 ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయారు. ఇక పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్ కష్టమని చెప్పి, 2019 ఎన్నికల ముందు కొందరు నాయకులు వైసీపీ, టీడీపీల్లోకి జంప్ కొట్టేశారు.TDP{#}2019;Congress;Party;YCP;MP;surya sivakumar;Kanigiri;central government;Minister;Araku Valley;TDP;Kurnool;Cycleసైకిల్‌ తొక్కలేకపోతున్న మాజీ హస్తం నేతలు...సైకిల్‌ తొక్కలేకపోతున్న మాజీ హస్తం నేతలు...TDP{#}2019;Congress;Party;YCP;MP;surya sivakumar;Kanigiri;central government;Minister;Araku Valley;TDP;Kurnool;CycleThu, 03 Jun 2021 04:00:00 GMTరాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పరిస్తితి మరీ ఘోరంగా తయారైన విషయం తెలిసిందే. ఆ పార్టీ ఏపీలో కనుమరుగయ్యే స్థితికి వచ్చేసింది. అసలు రాష్ట్ర విభజన జరగగానే అంటే 2014 ఎన్నికల ముందు చాలామంది నాయకులు టీడీపీ, వైసీపీల్లోకి వెళ్ళిపోయారు. అయితే కొందరు నాయకులు మాత్రం 2014 ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయారు. ఇక పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్ కష్టమని చెప్పి, 2019 ఎన్నికల ముందు కొందరు నాయకులు వైసీపీ, టీడీపీల్లోకి జంప్ కొట్టేశారు.


అయితే వైసీపీలోకి వెళ్ళిన కాంగ్రెస్ నాయకులు పరిస్తితి బాగానే ఉంది. పలువురు వైసీపీ తరుపున ఎమ్మెల్యేలుగా గెలిచారు. అలాగే కొందరు మంత్రులుగా సెటిల్ అయ్యారు. కానీ టీడీపీలోకి వెళ్ళిన హస్తం నేతల పరిస్థితే ఘోరంగా ఉంది. టీడీపీలోకి వచ్చి 2019 ఎన్నికల్లో పోటీ చేసిన హస్తం నేతలు ఘోరంగా ఓడిపోయారు. అలా ఓడిపోయిన మాజీ హస్తం నేతలు, టీడీపీలో యాక్టివ్‌గా లేకుండా పోయారు.


భవిష్యత్‌లో టీడీపీలో ఉంటారో లేదో తెలియడం లేదు. అలా 2019 ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చి పోటీ చేసి ఓడిపోయి అడ్రెస్ లేని నాయకుల్లో మాజీ మంత్రులు కొండ్రు మురళి, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, మాజీ ఎంపీలు కిషోర్ చంద్రదేవ్, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డిలు ఉన్నారు. గత ఎన్నికల్లో కొండ్రు, రాజాం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక మళ్ళీ పార్టీలో కనిపించలేదు.


అటు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, కనిగిరి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక ముక్కు పార్టీలో యాక్టివ్‌గా కనిపించడం లేదు. ఇక కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్, అరకు పార్లమెంట్ స్థానంలో టీడీపీ తరుపున పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఓడిపోయాక రాష్ట్ర రాజకీయాల్లోనే కనిపించడం లేదు. అటు కోట్ల సూర్యపకాశ్ రెడ్డి, కర్నూలు పార్లమెంట్ స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక ఈయన కూడా పార్టీలో పెద్దగా కనిపించడం లేదు. మొత్తానికైతే మాజీ హస్తం నేతలు సైకిల్ తొక్కలేకపోతున్నారు.   




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సోనియామ్మా.. అంతా ద్వేషం ఎందుకమ్మా?

కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇస్తున్న ప్రముఖ నిర్మాత ?

స్పోర్ట్స్: ఇకపై టీ20 లో ఎన్ని జట్లు.. ఆడుతాయో తెలుసా ?

బుల్లి పిట్ట: ఆధార్ కు ఫోన్ నెంబర్ లింక్ ఎలా చేయాలో తెలుసా ?

ఏడేళ్ల తెలంగాణ: తెలంగాణ సాధనలో తొలి మహిళగా పోరాటం ?

తెలంగాణా ప్రజలకు ఏడేళ్ళలో బాగా దగ్గరైన సంక్షేమం...?

విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా ఆవిర్భవించి తొలి విజయాన్ని అందుకున్న తెలంగాణ!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>