MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/telangana-directors49de27aa-cb07-4c9c-a55d-d563133be1dd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/telangana-directors49de27aa-cb07-4c9c-a55d-d563133be1dd-415x250-IndiaHerald.jpgఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో ఆంధ్ర వాళ్లే ఎక్కువగా ఉన్నారనేది నిజం. చాలా కాలం పాటు ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులే సినిమా పరిశ్రమలో అగ్రతారలుగా, దర్శకులుగా కొనసాగారు. అప్పట్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు నాటకాలపై మిక్కిలి మక్కువ ఉండేది. కేవీ రెడ్డి, కే.రాఘవేంద్ర రావు, నందమూరి తారక రామారావు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, గుణశేఖర్, మోహన కృష్ణ ఇంద్రగంటి, పూరి జగన్నాథ్, శేఖర్ కమ్ముల ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వారే. అయితే గత కొద్ది కాలంగా తెలంగాణ నుంచి కూడా గొప్ప డైరెక్టర్లు, నటీtelangana directors{#}Telangana;Telugu;Andhra Pradesh;Cinema;krishna;puri jagannadh;sekhar;Tollywood;Joseph Vijay;CBN;vennela;Hyderabad;News;Director;Darsakudu;Adilabad;Peddapalli;Blockbuster hit;sandeep;Warangal;bollywood;nag ashwin;Success;mandalamటాలీవుడ్‌‌ని షేక్ చేస్తున్న తెలంగాణ దర్శకులు వీరే..?టాలీవుడ్‌‌ని షేక్ చేస్తున్న తెలంగాణ దర్శకులు వీరే..?telangana directors{#}Telangana;Telugu;Andhra Pradesh;Cinema;krishna;puri jagannadh;sekhar;Tollywood;Joseph Vijay;CBN;vennela;Hyderabad;News;Director;Darsakudu;Adilabad;Peddapalli;Blockbuster hit;sandeep;Warangal;bollywood;nag ashwin;Success;mandalamThu, 03 Jun 2021 13:30:00 GMTసినిమా పరిశ్రమలో ఆంధ్ర వాళ్లే ఎక్కువగా ఉన్నారనేది నిజం. చాలా కాలం పాటు ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులే సినిమా పరిశ్రమలో అగ్రతారలుగా, దర్శకులుగా కొనసాగారు. అప్పట్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు నాటకాలపై మిక్కిలి మక్కువ ఉండేది. కేవీ రెడ్డి, కే.రాఘవేంద్ర రావు, నందమూరి తారక రామారావు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, గుణశేఖర్, మోహన కృష్ణ ఇంద్రగంటి, పూరి జగన్నాథ్, శేఖర్ కమ్ముల ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వారే.


అయితే గత కొద్ది కాలంగా తెలంగాణ నుంచి కూడా గొప్ప డైరెక్టర్లు, నటీనటులు పుట్టుకొస్తున్నారు. వారు తమ ప్రతిభతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమాలలో తెలంగాణ యాస కూడా ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తోంది. విజయ్ దేవరకొండ, బాబు మోహన్, వేణుమాధవ్, కాంతారావు, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నిఖిల్ సిద్ధార్థ్, విశ్వక్‌సేన్‌, శ్రీనివాసరెడ్డి వంటి తెలంగాణ సినీ కళాకారులు టాలీవుడ్ ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత హైదరాబాద్ నుంచి టాలీవుడ్ పరిశ్రమ ఆంధ్ర కి షిఫ్ట్ అవుతుందని అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ నటీ నటులు మాత్రం తెలంగాణలోని హైదరాబాద్ ని మాత్రమే టాలీవుడ్ పరిశ్రమకి కేంద్రంగా మారుస్తున్నారు. అయితే ఈ ఆర్టికల్ లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన టాలీవుడ్ దర్శకులు ఎవరో తెలుసుకుందాం.



బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి.. వంటి సూపర్ హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన దర్శకుడు వంశీ పైడిపల్లి ఆదిలాబాద్ కి చెందిన వారు. దర్శకుడు సంపత్ నంది కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారే. ఆయన పెద్దపల్లి జిల్లాలో పుట్టి పెరిగారు. బ్లాక్ బస్టర్ చిత్రాలైన ‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’ లను ఆయన డైరెక్ట్ చేశారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాకి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా తెలంగాణలోని వరంగల్ లో పుట్టి పెరిగారు. ప్రస్తుతం ఆయన టాలీవుడ్ నుంచి బాలీవుడ్ రేంజ్ కి ఎదిగారు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’ వంటి అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన నాగ్ అశ్విన్ హైదరాబాద్ లో పుట్టి పెరిగారు. ఇతను దర్శకుడిగా పేరు తెచ్చుకోవడమే కాదు నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారు. రానాతో కలిసి ‘విరాటపర్వం’ సినిమా రూపొందిస్తున్న దర్శకుడు వేణు ఉడుగుల వరంగల్ జిల్లాలోని చెన్నారావుపేట మండలం లోని ఒక గ్రామంలో పుట్టి పెరిగారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సామాన్యుడు కాదు.. అపర భగీరథుడు హరీష్?

వివాదాలకు దూరంగా.. ప్రజలకు దగ్గరగా.. ఇదే హరీష్ నైజం?

ఏపీ సీఎం గుడ్ న్యూస్..ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రికి ఇల్లు.. !

హీరోలకు ఇష్టం.. నిర్మాతలకు కష్టం.. ఓటీటీలపై తొలగని సందిగ్ధం..

తెలుగోళ్ళు బోర్ కొట్టేశారా రామ్.. అరవోళ్ళపై పడ్డావు..

ప్రతిపక్ష పార్టీ నేతల మనసులు గెలిచి.. మచ్చ లేని నాయకుడైన హరీష్?

చెప్పులు కూడా లేని స్థాయి నుంచి మంత్రిగా ఎదిగిన హరీష్ రావు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>