PoliticsShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronac47fffcf-22ba-4eb0-9abc-d33a9a22a17a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronac47fffcf-22ba-4eb0-9abc-d33a9a22a17a-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రపంచం దేశాలు నమ్మిన ఆయుధం వ్యాక్సిన్. ఈ క్రమంలో దాదాపు అన్ని దేశాలు వ్యాక్సినేషన్‌ను చేపట్టాయి. ఇందులో భారత్‌ కూడా ఒకటి. మునుపెన్నడూ లేని విధంగా భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఈ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భారత్ స్వదేశీ సంస్థలు భారత్ బయోటెక్, సీరమ్ ఉత్పత్తి చేస్తున్న కోవ్యాక్సిన్, కోవీషీల్డ్‌ టీకాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలో టీకాలు వేయించుకున్న వారిలో ఎక్కువ శాతం మంది..corona{#}India;students;vidya;Chief Ministerనిలిచిన విదేశీ పయనాలు.. కేంద్రం చేతిలోనే..నిలిచిన విదేశీ పయనాలు.. కేంద్రం చేతిలోనే..corona{#}India;students;vidya;Chief MinisterThu, 03 Jun 2021 15:09:00 GMTకరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రపంచం దేశాలు నమ్మిన ఆయుధం వ్యాక్సిన్. ఈ క్రమంలో దాదాపు అన్ని దేశాలు వ్యాక్సినేషన్‌ను చేపట్టాయి. ఇందులో భారత్‌ కూడా ఒకటి. మునుపెన్నడూ లేని విధంగా భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఈ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భారత్ స్వదేశీ సంస్థలు భారత్ బయోటెక్, సీరమ్ ఉత్పత్తి చేస్తున్న కోవ్యాక్సిన్, కోవీషీల్డ్‌ టీకాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలో టీకాలు వేయించుకున్న వారిలో ఎక్కువ శాతం మంది కోవ్యాక్సిన్‌ టీకాలు వేయించుకున్నారు. అయితే కోవ్యాక్సిన్ టీకాలు వేయించుకున్న వారిని తమ దేశాలకు అనుమతించమని ఇటీవల కొన్ని దేశాలు ప్రకటించాయి.
 అయితే కోవ్యాక్సిన్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్‌గా గుర్తించలేదని, డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన వ్యాక్సిన్‌ల జాబితాలో కోవ్యాక్సిన్‌‌ను చేర్చలేదని ఈ కారణంగానే కోవ్యాక్సిన్ టీకాలు వేయించుకున్న వారిని తమ దేశాలలోకి అనుమతించడం లేదని పలు దేశాలు పేర్కొన్నాయి. దాంతో భారత్‌ నుంచి విదేశాలకు వెళ్ళనున్న విద్యార్థులు, ఉద్యోగులు అందరికీ గుండెల్లో గుబులు పట్టుకొచ్చింది. విద్యార్థులు తమ విద్య గురించి, ఉద్యోగులు తమ ఉద్యోగాల గురించి, వ్యాపారులు తమ వ్యాపార నష్టాల గురించి బెంబేలెత్తిపోతున్నారు. విదేశాలు తీసుకున్న నిర్ణయంతో వ్యాపారులు తీవ్ర ఆర్థిక సంక్షోభానికి గురవుతున్నారు. ఈ విషయంలో అనేక మంది నిపుణులు స్పందించారు. దీనికి ఒకేఒక పరిష్కారం ఉందని వారు అంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద నుంచి కోవ్యాక్సిన్‌కు అనుమతులు తెచ్చుకోవడమే మార్గమని నిపుణులు చెబుతున్నారు.


ఇందులో భాగంగా ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రులు, నేతలు అందరూ ఒక తాటిపైకి వచ్చి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, అప్పుడు కేంద్రం కోవ్యాక్సిన్‌ను కూడా వ్యాక్సిన్ జాబితాలో చేర్చే విధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థతో మంతనాలు జరిపి వారి నుండి అనుమతులు పొందాలని నిపుణులు చెప్పారు. ఇందుకోసం ఒక్కో రాష్ట్ర  ముఖ్యమంత్రి విడివిడిగా కాకుండా కలిసి కట్టుగా కేంద్రాన్ని కదిలించాలని అప్పుడే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇతరత్రా కారణాలతో విదేశాలకు వెళ్లే వారు వెళ్ళగలుగుతారని నిపుణులు అంటున్నారు. మరి ఈ విషయంలో ముఖ్యమంత్రులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బండి సంజయ్ ని వేధిస్తున్నారా...? రాజా సింగ్ చిచ్చు

టాలీవుడ్‌‌ని షేక్ చేస్తున్న తెలంగాణ దర్శకులు వీరే..?

వివాదాలకు దూరంగా.. ప్రజలకు దగ్గరగా.. ఇదే హరీష్ నైజం?

ఏపీ సీఎం గుడ్ న్యూస్..ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రికి ఇల్లు.. !

హీరోలకు ఇష్టం.. నిర్మాతలకు కష్టం.. ఓటీటీలపై తొలగని సందిగ్ధం..

తెలుగోళ్ళు బోర్ కొట్టేశారా రామ్.. అరవోళ్ళపై పడ్డావు..

ప్రతిపక్ష పార్టీ నేతల మనసులు గెలిచి.. మచ్చ లేని నాయకుడైన హరీష్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>