CrimeMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/black-fungusd94d20a4-bd20-40a8-bc10-79af645814dd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/black-fungusd94d20a4-bd20-40a8-bc10-79af645814dd-415x250-IndiaHerald.jpgప్ర‌స్తుతం బ్లాక్ ఫంగ‌స్ మ‌హ‌మ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. బ్లాక్ ఫంగ‌స్ కేసుల సంఖ్య పెరుగుతుండ‌టంతో మందుల కొర‌త ఏర్ప‌డింది. దాంతో మందుల కొర‌త‌ను అదునుగా తీసుకుని కేటుగాళ్లు బ్లాక్ లో అమ్ముతున్నారు. అయితే ఎవ‌రో చ‌దువుకోని వాళ్లు..ఆక‌తాయిలు మందుల‌ను బ్లాక్ లో అమ్మితే ఏమో అనుకోవ‌చ్చు...కానీ ప్రాణం విలువ భాగా తెలిసి.. వైద్యం చేయాల్సిన వైద్యుడు వ‌క్ర‌బుద్ధి ప్ర‌ద‌ర్శించాడు. బ్లాక్ ఫంగ‌స్ మందును బ్లాక్ మార్కెట్ చేస్తూ అమ్ముకుంటున్నాడు. విష‌యం పోలీసుల‌కు తెలియ‌డంతో క‌ట‌క‌టాల పాల‌య్యాడు. పూర్తి వblack fungus{#}Mandula;vegetable market;Huzur Nagar;Reddy;contract;suchitra singer;manasa;sridhar;News;Madhapurవైద్యుడి వ‌క్ర‌బుద్ధి..వైద్యం చేయ‌మంటే బ్లాక్ దందా..చివ‌రికి !వైద్యుడి వ‌క్ర‌బుద్ధి..వైద్యం చేయ‌మంటే బ్లాక్ దందా..చివ‌రికి !black fungus{#}Mandula;vegetable market;Huzur Nagar;Reddy;contract;suchitra singer;manasa;sridhar;News;MadhapurThu, 03 Jun 2021 21:30:55 GMTప్ర‌స్తుతం బ్లాక్ ఫంగ‌స్ మ‌హ‌మ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. బ్లాక్ ఫంగ‌స్ కేసుల సంఖ్య పెరుగుతుండ‌టంతో మందుల కొర‌త ఏర్ప‌డింది. దాంతో మందుల కొర‌త‌ను అదునుగా తీసుకుని కేటుగాళ్లు బ్లాక్ లో అమ్ముతున్నారు.  అయితే ఎవ‌రో చ‌దువుకోని వాళ్లు..ఆక‌తాయిలు మందుల‌ను బ్లాక్ లో అమ్మితే ఏమో అనుకోవ‌చ్చు...కానీ ప్రాణం విలువ భాగా తెలిసి.. వైద్యం చేయాల్సిన వైద్యుడు వ‌క్ర‌బుద్ధి ప్ర‌ద‌ర్శించాడు. బ్లాక్ ఫంగ‌స్ మందును బ్లాక్ మార్కెట్ చేస్తూ అమ్ముకుంటున్నాడు. విష‌యం పోలీసుల‌కు తెలియ‌డంతో క‌ట‌క‌టాల పాల‌య్యాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే...ప్రగతి నగర్ లో ఉండే సెలోన్  లేబరేటరీస్ లో తయారయ్యే బ్లాక్ ఫంగస్ డ్రగ్ ఆంబిలాన్ 50ఎంజీ ని సంస్థ అనుమతి లేకుండా ఎర్రగడ్డ ESI ప్రభుత్వ ఆస్ప‌త్రికి చెందిన వైద్యుడు ఓబుల్ రెడ్డి అక్ర‌మంగా అమ్ముకుంటున్నారు. ఓబుల్ రెడ్డి తనకు తెలిసిన చింతల్ లోని నందిని మెడికల్ దుకాణం యజమాని వికాస్ రెడ్డి అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. 

మందులు అమ్మేందుకు ఒప్పందం చేసుకుని క‌మీష‌న్ మాట్లాడుకున్నాడు. కాగా వికాస్ రెడ్డి కొంత లాభంతో నాగరాజు అనే మ‌రో వ్య‌క్తి ద్వారా సుచిత్ర కు చెందిన మానస మెడికల్ దుకాణం నిర్వహకుడు శ్రీధర్ కి అమ్ముకునేవాడు. శ్రీధర్ దానిని ఆధారంగా చేసుకుని ఆన్లైన్ లో సెర్చ్ చేసి ఒరిజినల్ ఇంజక్షన్ సీసా పోలి ఉండే యాంటిబయోటిక్ డ్రగ్ సెఫిరాక్సిన్ టాజోబాక్ట‌మ్ ఫ‌ర్ ఇంజ‌క్ష‌న్ ఓల్సిఫోన్ దీని లేబుల్ ను తొల‌గించి ఆంబిలోన్ 50 ఎంజీ లేబుల్ స్టిక్కర్ వేసి అమ్మడానికి సిద్ధంగా ఉంచాడు. కాగా దీని పై పక్కా సమాచారం రావ‌డంతో మాదాపూర్ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈఎస్ఐ వైద్యుడు ఓబుల్ రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు ఏసీపీ రామలింగరాజు తెలిపారు. నిందితుల వద్ద నుండి రూ.18 లక్షల విలువగల (డ్రగ్స్, ఒక కారు, ఒక బైక్, 4ఫోన్లు, 5వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విజయం మీదే: ఇవి మీరు పాటించకపోతే ఏదీ సాధించలేరు ?

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్..!

ఓటీటీలో రానా సినిమా..?

ష‌ర్మిలా పార్టీపేరుకు ఈసీ ఆమోదం...పేరు ఇదే

భార్య కంటే అదే బెటర్.. పూరీ షాకింగ్ వ్యాఖ్యలు..?

ఆనందయ్య ఐ డ్రాప్స్.. అందుబాటులోకి ఎప్పుడో తెలుసా?

బ్రేకింగ్ : ఏపీలో ఈ రోజు క‌రోనా కేసులు ఎన్నంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>