PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-virusc4e36b76-9bcb-4171-902e-eeb97977e803-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-virusc4e36b76-9bcb-4171-902e-eeb97977e803-415x250-IndiaHerald.jpgప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా మన భారత్‌లో సెకండ్ వేవ్ విరుచుకుపడుతోంది. వైరస్ నియంత్రణకు పూర్తిస్థాయి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక అదే సంజీవని అని చెబుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ ఏడాది జనవరిలో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. ప్రారంభంలో దశల వారీగా టీకాలు ఇచ్చారు. ఇప్పుడు అయితే 18 ఏళ్ళ పైబడిన అందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కేవలం 45 పైబడిన వారికే వేస్తున్నా ఇప్పుడు వాక్సిన్ కి సంబంధించి అనేక అనుమానాలుCorona virus{#}Uttarakhand;policeవ్యాక్సిన్ సంజీవనా.. మిధ్యనా ?వ్యాక్సిన్ సంజీవనా.. మిధ్యనా ?Corona virus{#}Uttarakhand;policeThu, 03 Jun 2021 15:16:38 GMT

కొన్ని రాష్ట్రాల్లో కేవలం 45 పైబడిన వారికే వేస్తున్నా ఇప్పుడు వాక్సిన్ కి సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యాక్సిన్ ఎంతవరకు సేఫ్ అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ పోలీస్ డిపార్ట్మెంట్  లో 2,300 మంది సిబ్బంది కరోనా పాజిటివ్ అని తేలినట్లు ఆ విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఇందులో 93 శాతం మంది పోలీసు అధికారులు కోవిడ్ -19కు టీకాలు వేసుకున్నారట.  రాష్ట్రంలో కోవిడ్ -19 కు 2,382 మంది పోలీసు సిబ్బందికి పాజిటివ్ అని తేలగా వారిలో ఐదుగురు వైరస్ బారిన పడి మరణించారు. 751 మంది పోలీసులు బంధువులకి కరోనా సోకగా అందులో ఐదుగురు పోలీసు అధికారుల బంధువుల ప్రాణాలను కూడా బలిగొందని అంటున్నారు. నిజానికి దేశవ్యాప్తంగా కరోనా కేసులను పరిశీలిస్తే రెండు డోసులు వేసుకున్న వారిలో 90 శాతం మందికి కరోనా సోకడం లేదని అంటున్నారు.



సోకినా ప్రభావం చూపడం లేదని, ఈ రెండు డోసులు వేసుకున్నవారిలో యాంటీబాడీస్ అభివృద్ధి చెందడంతో కరోనాను ఎదుర్కొనే రక్షణ లభిస్తోందని అంటున్నారు. ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పా.. టీకా వేయించుకున్నవారు కరోనాతో చనిపోయిన దాఖలాలు లేకపోవడం ఇందుకు నిదర్శనం అని నిపుణులు అంటున్నారు. వ్యాక్సిన్‌ తో లాభమేగానీ నష్టం లేదని అంటున్నారు. అయితే మరి కొందరు మాత్రం వ్యాక్సిన్ కంటే కూడా కరోనా వచ్చి పోయిన తర్వాతే యాంటీ బాడీస్ ఎక్కువగా ఉంటున్నాయని అంటున్నారు. మొత్తం మీద ఈ అంశం మాత్రం ఇప్పటికీ ఒక చేదించలేని అంశంగా మారింది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బండి సంజయ్ ని వేధిస్తున్నారా...? రాజా సింగ్ చిచ్చు

టాలీవుడ్‌‌ని షేక్ చేస్తున్న తెలంగాణ దర్శకులు వీరే..?

వివాదాలకు దూరంగా.. ప్రజలకు దగ్గరగా.. ఇదే హరీష్ నైజం?

ఏపీ సీఎం గుడ్ న్యూస్..ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రికి ఇల్లు.. !

హీరోలకు ఇష్టం.. నిర్మాతలకు కష్టం.. ఓటీటీలపై తొలగని సందిగ్ధం..

తెలుగోళ్ళు బోర్ కొట్టేశారా రామ్.. అరవోళ్ళపై పడ్డావు..

ప్రతిపక్ష పార్టీ నేతల మనసులు గెలిచి.. మచ్చ లేని నాయకుడైన హరీష్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>