MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/narakasurudu-movie-4ceb6171-8be1-4237-834e-33f4c45ac450-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/narakasurudu-movie-4ceb6171-8be1-4237-834e-33f4c45ac450-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినీ ఇండస్ట్రీలో వస్తున్న సినిమాలు చాలా వరకు భారీ అంచనాలతో విడుదలవుతున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ కొన్ని సినిమాలు మాత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ, ఏవో కారణాల చేత విడుదలకు కూడా నోచుకోకుండా మూలకు పడిపోతున్నాయి. అవి ఆర్థిక సమస్యలు అయినా కావచ్చు, మరే ఇతర సమస్యలు అయినా కావచ్చు.. ఇక ఈ కారణాల వల్ల ఎంతో పెద్ద బడ్జెట్ లతో సినిమాలు నిర్మించి, చివరకు విడుదల చేసే సమయంలో ఏదో కారణం చేత ఆగిపోవాల్సి వస్తుంది. ఇలా దాదాపుగా మూడు సంవత్సరాల క్రితమే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని, విడుదలకు సిద్NARAKASURUDU MOVIE{#}Cinema;Coronavirus;Tamil;Darsakudu;Director;producer;Producer1;Sony;V;sundeep kishanగత 3 సంవత్సరాలుగా విడుదలకు నోచుకోని సినిమా.. ఇకపై ఓటీటీ లో..గత 3 సంవత్సరాలుగా విడుదలకు నోచుకోని సినిమా.. ఇకపై ఓటీటీ లో..NARAKASURUDU MOVIE{#}Cinema;Coronavirus;Tamil;Darsakudu;Director;producer;Producer1;Sony;V;sundeep kishanThu, 03 Jun 2021 13:00:00 GMT
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో వస్తున్న సినిమాలు చాలా వరకు భారీ అంచనాలతో విడుదలవుతున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ కొన్ని సినిమాలు మాత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ, ఏవో కారణాల చేత విడుదలకు కూడా నోచుకోకుండా మూలకు పడిపోతున్నాయి. అవి ఆర్థిక సమస్యలు అయినా కావచ్చు, మరే ఇతర సమస్యలు అయినా కావచ్చు.. ఇక ఈ కారణాల వల్ల ఎంతో పెద్ద బడ్జెట్ లతో సినిమాలు నిర్మించి, చివరకు విడుదల చేసే సమయంలో ఏదో కారణం చేత ఆగిపోవాల్సి వస్తుంది. ఇలా దాదాపుగా మూడు సంవత్సరాల క్రితమే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల చేత ఆ సినిమా రిలీజ్ కాలేకపోయింది అయితే ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఆ సినిమా ఏమిటో? విడుదలకు ఎందుకు ఇంత సమయం పట్టిందో ? అనే విషయాలను ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా థియేటర్లన్నీ మూసివేయబడ్డాయి. అందుకే సినీ ఇండస్ట్రీలో చాలావరకు సినిమాలన్నీ థియేట్రికల్ విడుదలకు నోచుకోకుండా, డిజిటల్ రిలీజ్ బాట పడుతున్నాయి. ఇక అందులో భాగంగానే తమిళ యువ దర్శకుడు కార్తీక్ నరేన్ తెరకెక్కించిన నరకాసురుడు సినిమా కూడా ఒకటి. ఇక ఈ సినిమా గత మూడు సంవత్సరాలుగా ఆర్థిక సమస్యలతో మూలకు పడిపోయింది. అయితే ఏదో విధంగా గత సంవత్సరం థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్రొడ్యూసర్ గౌతమ్ మీనన్, అలాగే దర్శకుడు కార్తీక్ నరేన్ భావించారు. కానీ కరోనా కారణంగా సినిమా మరింత వాయిదా పడాల్సి వచ్చింది.
కానీ ఇప్పుడు థియేటర్లలో విడుదల చేయాలన్న ఆలోచనను పక్కన పెట్టి , ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు కూడా  సోనీ ఎల్ ఐ వి కి అమ్ముడు పోయాయట. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. అంతేకాదు ప్రొడ్యూసర్ గౌతమ్మీనన్ కూడా తన ఆర్థిక సమస్యల తీరినట్లు సమాచారం. అందుకే ఇక ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఓ టీ టీ  ప్లాట్ఫాం పై విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో అరవిందస్వామి, శ్రేయ , సందీప్ కిషన్ ,రెజీనా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సామాన్యుడు కాదు.. అపర భగీరథుడు హరీష్?

వివాదాలకు దూరంగా.. ప్రజలకు దగ్గరగా.. ఇదే హరీష్ నైజం?

ఏపీ సీఎం గుడ్ న్యూస్..ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రికి ఇల్లు.. !

హీరోలకు ఇష్టం.. నిర్మాతలకు కష్టం.. ఓటీటీలపై తొలగని సందిగ్ధం..

తెలుగోళ్ళు బోర్ కొట్టేశారా రామ్.. అరవోళ్ళపై పడ్డావు..

ప్రతిపక్ష పార్టీ నేతల మనసులు గెలిచి.. మచ్చ లేని నాయకుడైన హరీష్?

చెప్పులు కూడా లేని స్థాయి నుంచి మంత్రిగా ఎదిగిన హరీష్ రావు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>