PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccination-drive-phase-343798704-0bd9-45d8-af00-a838f95859d9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccination-drive-phase-343798704-0bd9-45d8-af00-a838f95859d9-415x250-IndiaHerald.jpgప్రపంచం అంతా కరోనా కోరల్లో చిక్కుకుపోయింది. ఇప్పటికి చాలా దేశాలు కరోనా నుండి తేరుకున్నారు. కానీ మన ఇండియా ప్రజలు మాత్రం కరోనా ధాటికి తాళలేక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. గత వారం రోజుల నుండి కేసుల సంఖ్యలో కాస్త తగ్గుదల కనిపించింది. VACCINATION DRIVE PHASE 3{#}central government;India;Houseవ్యాక్సినేషన్ కేంద్రానికి కేంద్ర మంత్రి ... జరిగిందిదే ?వ్యాక్సినేషన్ కేంద్రానికి కేంద్ర మంత్రి ... జరిగిందిదే ?VACCINATION DRIVE PHASE 3{#}central government;India;HouseTue, 01 Jun 2021 18:06:00 GMT" style="height: 659px;">
ప్రపంచం అంతా కరోనా కోరల్లో చిక్కుకుపోయింది. ఇప్పటికి చాలా దేశాలు కరోనా నుండి తేరుకున్నాయి. కానీ మన ఇండియా ప్రజలు మాత్రం కరోనా ధాటికి తాళలేక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. గత వారం రోజుల నుండి కేసుల సంఖ్యలో కాస్త తగ్గుదల కనిపించింది. దీనితో కొంచెం ఉపశమనం లభించినట్లయింది. కాగా ఒకానొక దశలో మరణాల శాతం పెరుగుతుంటే ప్రజలంతా తీవ్ర ఆందోళన చెందారు. ఈ కరోనాకు రకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నా కూడా వ్యాక్సిన్ వేసుకోవడమే ఉత్తమమైన పని అని ప్రభుత్వాలు ప్రజలను చైతన్యపరుస్తున్నాయి.

అయితే మొదటి దశ తరువాత వచ్చిన వ్యాక్సిన్ లను సరిగ్గా ఉపయోగించుకొని ప్రజలు చాలా వరకు వేస్ట్ చేశారు. కానీ ఆ తరువాత వ్యాక్సిన్ విలువ తెలుసుకుని ఇప్పుడు వ్యాక్సిన్ వెంట పరుగులు పెడుతున్నారు. అయినప్పటికీ వ్యాక్సిన్ సకాలంలో దొరకని పరిస్థితి. తెలంగాణాలో వ్యాక్సిన్ డ్రైవ్ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇప్పటికే రెండు దశల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోగా, మూడవ దశ విజయవంతంగా కొనసాగుతోంది. కరోనా మొదటి దశ కాలంలో 45 సంవత్సరాలు పైబడినవారికి వ్యాక్సిన్ ఇవ్వగా, ప్రస్తుతం 18 నుండి 45 సంవత్సరాల వయసున్న వారికి ఇస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో హైద్రాబాద్ లేక్ వ్యూ బంజారా గార్డెన్ లోని వ్యాక్సినేషన్ సెంటర్ ను కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు.

ఈయన వ్యాక్సినేషన్ జరిగే విధానం, నిబంధనలు మరియు సౌకర్యాలను పరిశీలించారు. వ్యాక్సినేషన్ కి వచ్చిన వారందరూ ఈ కార్యక్రమానికి సహకరించి కోవిడ్ ను నిర్మూలించే ప్రక్రియలో భాగం కావాలని ట్విట్టర్ ద్వారా కోరడమైనది. కిషన్ రెడ్డి విజిట్ పై పలువురు ప్రశంసలు తెలుపుతున్నారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇలాగే జరిగి అందరికీ వ్యాక్సిన్ అందితే కరోనా నుండి పూర్తిగా రక్షణ పొందగలం. కానీ వ్యాక్సిన్ కొరత దేశవ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ సమస్యపై రాష్ట్రాలు కేంద్రంతో చర్చించి పరిష్కరించాలని కొందరు కోరుకుంటున్నారు.


 


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సొంత వైద్యం మానండి.. లేదంటే బ్లాక్‌ఫంగ‌స్‌?

ఈట‌ల‌పై అన‌ర్హ‌త వేటుకు రంగం సిద్ధం ..?

రోజూ రూ.160 ఆదా చేస్తే.. చేతికి 23 లక్షలు.. అదిరిపోయే స్కీమ్?

టబు అక్క కూడా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా.. ?

మా సినిమాను ఒంటరిగా చూడొద్దు : ఫిలిం మేకర్స్

గెలుపుతో హిస్టరీ క్రియేట్ చేస్తాం : బౌల్ట్

స్పోర్ట్స్ : ఒకప్పుడు రోహిత్ శర్మ ను కాదనుకున్న చెన్నై..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>