PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-mixing5cff177e-b3b5-4c34-818c-e791c231281e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-mixing5cff177e-b3b5-4c34-818c-e791c231281e-415x250-IndiaHerald.jpgమంగళవారం రోజు భారత కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌ల మిక్సింగ్ విషయంపై క్లారిటీ ఇచ్చింది. గత కొద్ది రోజులుగా ప్రజలకు ఇచ్చే వ్యాక్సిన్‌ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఐతే మొదటి డోసులో కొవాగ్జిన్‌ టీకా ఇస్తే.. రెండవ డోసులో కోవిషీల్డ్ టీకా ఇవ్వొచ్చని.. కేంద్రం ప్రకటించే అవకాశాలు ఉన్నాయని నివేదికలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చింది. ప్రజలకు రెండు డోసులు కూడా ఒకటే వ్యాక్సిన్‌ (కొవాగ్జిన్‌ లేదా కోవిషీల్డ్) ఇవ్వాలvaccine mixing{#}tuesday;central government;Minister;INTERNATIONAL;Shakti;NITI Aayogవ్యాక్సిన్‌ల మిక్సింగ్ పై కేంద్రం క్లారిటీ..!వ్యాక్సిన్‌ల మిక్సింగ్ పై కేంద్రం క్లారిటీ..!vaccine mixing{#}tuesday;central government;Minister;INTERNATIONAL;Shakti;NITI AayogTue, 01 Jun 2021 18:16:00 GMTకేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌ల మిక్సింగ్ విషయంపై క్లారిటీ ఇచ్చింది. గత కొద్ది రోజులుగా ప్రజలకు ఇచ్చే వ్యాక్సిన్‌ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఐతే మొదటి డోసులో కొవాగ్జిన్‌ టీకా ఇస్తే.. రెండవ డోసులో కోవిషీల్డ్ టీకా ఇవ్వొచ్చని.. కేంద్రం ప్రకటించే అవకాశాలు ఉన్నాయని నివేదికలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చింది.

ప్రజలకు రెండు డోసులు కూడా ఒకటే వ్యాక్సిన్‌ (కొవాగ్జిన్‌ లేదా కోవిషీల్డ్) ఇవ్వాలని కేంద్రం విస్పష్టం చేసింది. వ్యాక్సిన్‌లు మిక్సింగ్ చేయాలని ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని.. ప్రస్తుతానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కి (సమాన ప్రక్రియ పద్ధతి) కట్టుబడి ఉంటామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ లో వెల్లడించింది.

మొదటి డోసులో ఒక రకం టీకా తీసుకొని రెండవ డోసులో మరొక రకం టీకా తీసుకోవడం వల్ల తీవ్ర దుష్ప్రభావాలకు దారితీసే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాక్సినేషన్ మిక్సింగ్ ప్రక్రియ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. టీకాలను కలపడం వలన ఎలాంటి హానికరమైన ప్రభావాలు కలుగుతాయో తెలుసుకోవడానికి అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయని.. ఈ విషయాన్ని తేల్చాలని శాస్త్రవేత్తలు జిజ్ఞాస తో ఉన్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

రెండు డోసులలో వేర్వేరు టీకాలు ఇవ్వడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందా లేదా అనే విషయం పై తాము పరిశోధన చేస్తున్నామని నీతి అయోగ్ సభ్యులు చెప్పారు. కోవిషీల్డ్ సెకండ్ డోసు పన్నెండు వారాల తర్వాత ఇస్తే.. కొవాగ్జిన్‌ సెకండ్ డోసు 4 - 6 వారాల తర్వాత ఇవ్వాలని నీతి ఆయోగ్ సభ్యులు చెప్పుకొచ్చారు. ఇదే షెడ్యూల్ ని పాటిస్తూ ప్రజలకు వ్యాక్సినేషన్ పక్రియ కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చరణ్ తో దేవిశ్రీ కాంబో .... రచ్చ రచ్చే .... ??

సొంత వైద్యం మానండి.. లేదంటే బ్లాక్‌ఫంగ‌స్‌?

ఈట‌ల‌పై అన‌ర్హ‌త వేటుకు రంగం సిద్ధం ..?

రోజూ రూ.160 ఆదా చేస్తే.. చేతికి 23 లక్షలు.. అదిరిపోయే స్కీమ్?

టబు అక్క కూడా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా.. ?

మా సినిమాను ఒంటరిగా చూడొద్దు : ఫిలిం మేకర్స్

గెలుపుతో హిస్టరీ క్రియేట్ చేస్తాం : బౌల్ట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>