PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/---5---------d6091559-6e09-4790-9385-e78ceea5a855-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/---5---------d6091559-6e09-4790-9385-e78ceea5a855-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కరోనా కారణంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే చాలామంది ప్రజలు ఈ లాక్ డౌన్ వలన ఉపాధి కోల్పోయి అర్థాక‌లితో అల‌మ‌టిస్తున్నారు. అలాంటి వారికి ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. పేద‌లకు ఉచితంగా బియ్యం సరఫరా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ ఆధ్వర్యంలో జూన్ నెలలో ప్ర‌తీ వ్య‌క్తికి 15 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అంద‌జేయ‌నున్నారు. రాష్ట్రంలోని 2 కోట్ల 79 లక్షల 24 వేల 300 మందికి ల‌బ్ధి చేకూరుతుంద‌ని తెలిపారు పౌర‌స‌ర‌ఫ‌రజూన్ 5 నుంచి ఉచిత రేషన్{#}Government;Telangana;CM;June;Minister;central governmentజూన్ 5 నుంచి ఉచిత రేషన్..?జూన్ 5 నుంచి ఉచిత రేషన్..?జూన్ 5 నుంచి ఉచిత రేషన్{#}Government;Telangana;CM;June;Minister;central governmentTue, 01 Jun 2021 11:13:25 GMTతెలంగాణలో కరోనా కారణంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే చాలామంది ప్రజలు ఈ లాక్ డౌన్ వలన ఉపాధి కోల్పోయి అర్థాక‌లితో అల‌మ‌టిస్తున్నారు. అలాంటి వారికి ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. పేద‌లకు ఉచితంగా బియ్యం సరఫరా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ ఆధ్వర్యంలో జూన్ నెలలో ప్ర‌తీ వ్య‌క్తికి 15 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అంద‌జేయ‌నున్నారు. రాష్ట్రంలోని 2 కోట్ల 79 లక్షల 24 వేల 300 మందికి ల‌బ్ధి చేకూరుతుంద‌ని తెలిపారు పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌.. రాష్ట్రంలోని మొత్తం 87లక్షల 42వేల 590 కార్డులకు ఎలాంటి పరిమితి లేకుండా 4లక్షల 31వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉచితంగా అందిచ‌నున్న‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు. కాగా, క‌రోనా క‌ష్ట‌కాలంలో పేద‌ల‌ను ఆదుకోవ‌డానికి 5 కిలోల చొప్పున ఉచితంగా అందించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్రంలో 87.43 లక్షల మంది రేషన్‌కార్డుదారులతో పాటు ప్రైవేటు ఉపాధ్యాయులకూ ప్రభుత్వం ఉచిత బియ్యం అందిస్తోంది.

తద్వారా సుమారు 2.80 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. చౌకధరల దుకాణాల సిబ్బందికి టీకాల ప్రక్రియ సాగుతుండటంతో 1వ తేదీ కాకుండా 5 నుంచి బియ్యం పంపిణీ ప్రారంభించనున్నారు. జూన్‌లో అదనపు కోటా సహా సుమారు 4.6 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అందజేయనున్నారు. కేంద్ర నిబంధనల మేరకు 53.56 లక్షల కార్డుదారులకే బియ్యం అందుతాయి. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను సడలించటంతో మరో 33.86 లక్షల మంది అర్హులయ్యారు. అందరికీ ఉచితంగానే బియ్యం పంపిణీ చేస్తాం’ అని మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. మొద‌టి ద‌శ లాక్‌డౌన్‌లో మే నుంచి అక్టోబ‌ర్ వ‌ర‌కూ ఉచితంగా రేష‌న్ అందించిన విష‌యం తెలిసిందే. మ‌రోసారి అలాంటి ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యంలో గ‌తంలో 12 కిలోల‌ బియ్యం ఇచ్చిన విధంగానే ఈసారి 15 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందజేస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు అస్వస్థత

ఆ విటమిన్ లోపమే కరోనా రావడానికి కారణమా ? డాక్టర్ల సలహా ఇదే ?

అక్కడ కేసిఆర్ ని.. ఇక్కడ జగన్ ని.. టైం చూసి కొడుతున్నారుగా...?

హీరో అత్త పాత్రలో అనుష్క.. షాకవుతున్న అభిమానులు?

మందుబాబులకి గుడ్ న్యూస్

ఆ హీరో పక్కన నటించేందుకు ఎదురుచూస్తున్న : ప్రియమణి

ఆనందయ్య ఊరు కృష్ణపట్నంలో కరోనా కలకలం ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>