PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/shocking-harish-rao-taget-ga-sharmilabb67495d-23cb-4151-b051-18ba23825bee-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/shocking-harish-rao-taget-ga-sharmilabb67495d-23cb-4151-b051-18ba23825bee-415x250-IndiaHerald.jpgఆ మధ్య తెలంగాణలో దూకుడు ప్రదర్శించిన షర్మిల.. కొన్ని రోజులగా సైలంట్ అయ్యారు. ఖమ్మం జిల్లాలో పార్టీ తరపున తొలి సభ.. ఆ తర్వాత కొద్దిరోజులకే హైదరాబాద్‌లో నిరుద్యోగుల తరపున దీక్ష.. ఆ దీక్ష ఉద్రిక్తం కావడం వంటి వరుస ఘటనలతో తెలంగాణ రాజకీయాల్లో షర్మిల పేరు మారుమోగింది. అయితే.. ఆ తర్వాత అనూహ్యంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభించటం.. అనూహ్యంగా ఈటల ఇష్యూ తెరపైకి రావడంతో షర్మిలపై ఫోకస్ తగ్గిపోయింది. ఆమె కూడా ట్వీట్లు, ప్రెస్‌ నోట్లతోనే గడిపేశారు. అయితే పార్టీ ప్రకటిస్తానన్న జూలై 8 దగ్గరకు వస్తుండటంతో ఆమె మళ్sharmila{#}Dookudu;Khammam;Party;Telangana;Sharmila;Thanneeru Harish Rao;Minister;Medak;Telangana Rashtra Samithi TRS;king;Cheque;Districtషాకింగ్: హరీశ్‌ రావును టార్గెట్ చేసిన షర్మిల..?షాకింగ్: హరీశ్‌ రావును టార్గెట్ చేసిన షర్మిల..?sharmila{#}Dookudu;Khammam;Party;Telangana;Sharmila;Thanneeru Harish Rao;Minister;Medak;Telangana Rashtra Samithi TRS;king;Cheque;DistrictTue, 01 Jun 2021 07:00:00 GMTఆ మధ్య తెలంగాణలో దూకుడు ప్రదర్శించిన షర్మిల.. కొన్ని రోజులగా సైలంట్ అయ్యారు. ఖమ్మం జిల్లాలో పార్టీ తరపున తొలి సభ.. ఆ తర్వాత కొద్దిరోజులకే  హైదరాబాద్‌లో నిరుద్యోగుల తరపున దీక్ష.. ఆ దీక్ష ఉద్రిక్తం కావడం వంటి వరుస ఘటనలతో తెలంగాణ రాజకీయాల్లో షర్మిల పేరు మారుమోగింది. అయితే.. ఆ తర్వాత అనూహ్యంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభించటం.. అనూహ్యంగా ఈటల ఇష్యూ తెరపైకి రావడంతో షర్మిలపై ఫోకస్ తగ్గిపోయింది. ఆమె కూడా ప్రెస్‌ నోట్లతోనే గడిపేశారు.

అయితే పార్టీ ప్రకటిస్తానన్న జూలై 8 దగ్గరకు వస్తుండటంతో ఆమె మళ్లీ యాక్టివ్ కావాలని నిర్ణయించారు. ఈసారి ఏకంగా ఆమె టీఆర్ఎస్‌ ట్రబుల్ షూటర్ హరీశ్‌ రావునే టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఆమె తదుపరి క్షేత్రస్థాయి పర్యటన హరీశ్ రావు సొంత జిల్లాలో ఉండనున్నట్టు సమాచారం. మంత్రి హరీశ్ రావును టార్గెట్ చేసుకొన్న షర్మిల ఉమ్మడి  మెదక్ జిల్లా పర్యటనకు వెళ్లనున్నట్లు  తెలుస్తోంది. టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ గా చెప్పుకునే హరీశ్ రావునే ముందుగా ఢీకొట్టేందుకు షర్మిల సిద్ధమయ్యారట.

నిరుద్యోగుల్లో భరోసా కల్పించేందుకు షర్మిల చేపట్టిన మూడు రోజుల నిరాహార దీక్ష ముగింపు సమయంలోనూ గజ్వేల్ కు చెందిన అమరులు మురళి, కొప్పు రాజు కుటుంబీకులు వచ్చి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా షర్మిల మెదక్ జిల్లాలోనే పర్యటించాలని నిర్ణయించుకోవడం  కేసీఆర్, హరీశ్ రావులకు చెక్ పెట్టేందుకేనని షర్మిల పార్టీ నేతలు భావిస్తున్నారు .

మెదక్ జిల్లా  పర్యటనలో షర్మిల అమరవీరుల కుటుంబాలను కానీ.. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడం లేదని బలవన్మరణానికి పాల్పడిన నిరుద్యోగుల కుటుంబాలను కలిసే అవకాశాలున్నాయి. బాధితులను కలిసి వారి కుటుంబాలకు భరోసా కల్పించేందుకు  షర్మిల ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. వారికి కొంత చేయూతనందించే ఆలోచన కూడా ఉందట. పార్టీ ప్రకటన వరకూ ఏదో ఒక కార్యక్రమం నిర్వహించాలని షర్మిల ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఔరా అనిపించేలా చరణ్.. ఆ సినిమా కోసమేనా..?

చిరంజీవి,మణిశర్మ సూపర్ హిట్ కాంబో.. ఏమేం సినిమాలు వచ్చాయో తెలుసా?

హెరాల్డ్ సెటైర్ : కృష్ణపట్నానికీ కరోనా వైరస్ అంటించేశారుగా ?

మూడేళ్లకు ముందే టికెట్ కంఫర్మ్ చేసిన బాబు ..... ?

కృష్ణ ఇంట్లో చెక్కుల మూట ... కారణం అదేనట .... ??

ఏపీకి గుడ్ న్యూస్.. డబుల్ రికవరీ రేట్...

వామ్మో జక్కన్నా ..... ఇదేమి ప్లానింగు అన్నా .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>