MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-music-director-combination6590d0a8-a355-471c-8170-466a5f553481-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-music-director-combination6590d0a8-a355-471c-8170-466a5f553481-415x250-IndiaHerald.jpgఆర్పి పట్నాయక్ - ఉదయ్‌కిరణ్ కాంబోకి తిరుగు లేదు..? ఉదయ్‌కిరణ్ హీరోగా నటించిన ఎన్నో సినిమాలకు ఆర్.పి.పట్నాయక్ బ్రహ్మాండమైన సంగీత బాణీలు సమకూర్చారు. నువ్వు నేను, మనసంతా నువ్వే, నీ స్నేహం, చిత్రం, అవునన్నా కాదన్నా, నీకు నేను నాకు నువ్వు, శ్రీరామ్, హోలీ చిత్రాల్లో ఉదయ్‌కిరణ్ హీరోగా నటించగా ఆ సినిమాలన్నిటికీ ఆర్.పి.పట్నాయకే సంగీతం అందించారు. నువ్వు నేను(2001) చిత్రంలోని "ప్రియతమా ఓ ప్రియతమా", "నా గుండెలో" వంటి పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఆయన ఈ సినిమాకి సంగీతం సమకూర్చడమే కాదు ఒక పాట కూడా పాడారు. మనసంతhero-music-director-combination{#}Sangeetha;Holi;Music;Teluguఆర్పి పట్నాయక్ - ఉదయ్‌కిరణ్ కాంబోకి తిరుగు లేదు..?ఆర్పి పట్నాయక్ - ఉదయ్‌కిరణ్ కాంబోకి తిరుగు లేదు..?hero-music-director-combination{#}Sangeetha;Holi;Music;TeluguTue, 01 Jun 2021 13:30:00 GMTసంగీత బాణీలు సమకూర్చారు. నువ్వు నేను, మనసంతా నువ్వే, నీ స్నేహం, చిత్రం, అవునన్నా కాదన్నా, నీకు నేను నాకు నువ్వు, శ్రీరామ్, హోలీ చిత్రాల్లో ఉదయ్‌కిరణ్ హీరోగా నటించగా ఆ సినిమాలన్నిటికీ ఆర్.పి.పట్నాయకే సంగీతం అందించారు. నువ్వు నేను(2001) చిత్రంలోని "ప్రియతమా ఓ ప్రియతమా", "నా గుండెలో" వంటి పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఆయన ఈ సినిమాకి సంగీతం సమకూర్చడమే కాదు ఒక పాట కూడా పాడారు.

మనసంతా నువ్వే చిత్రంలో "తూనీగా తూనీగా" పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రణయవర్ణంగల్(1998) ఓ మలయాళం సినిమాలో "కన్నాడి కూడం కుట్టి" పాట ట్యూన్ ని 'తూనీగా తూనీగా' పాటకు ఆర్పి పట్నాయక్ ఉపయోగించారు. అయితే ఒరిజినల్ పాటను విద్యాసాగర్ స్వరపరిచారు. ఇక ఇదే సినిమాలో మనసంతా నువ్వే, కిటకిట తలుపులు, నీ స్నేహం పాటలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. 20 ఏళ్ల తర్వాత కూడా ఈ పాటలను తరచూ వినేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ చిత్రంలోని పాటలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. మరో విశేషమేమిటంటే ఈ చిత్రాన్ని హిందీ, కన్నడ, తమిళ్, బంగ్లాదేశీ, ఒడియా భాషలో రీమేక్ చేశారు.

ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన నీ స్నేహం చిత్రంలోని (ఊరుకో హృదయమా, వేయి కన్నులతో, చినుకు తడికి -ఎవర్ గ్రీన్ హిట్) పాటలకు కూడా ఆర్.పి.పట్నాయకే చక్కటి సంగీతం సమకూర్చారు. ఆయన "చిత్రం" సినిమాకి కూడా సంగీతం అందించారు. ఊహల పల్లకీలో ఊరేగించనా.. ఆశల వెల్లువై రాగం పలికించనా.. పాట అప్పట్లో తెలుగు శ్రోతల మనసులను పులకరింపజేసింది. ఢిల్లీనుండి గల్లీదాక, మావో మావో పారిపోతున్నాది మామ అంటూ సాగే పాటలు కూడా ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.

ఇకపోతే ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన అవునన్నా కాదన్నా, నీకు నేను నాకు నువ్వు, శ్రీరామ్, హోలీ చిత్రాలకు కూడా ఆర్పి పట్నాయకే సంగీతం అందించారు. ఈ సినిమాలు సూపర్ హిట్ కాలేదు పాటలు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఏదేమైనా ఉదయ్‌కిరణ్, ఆర్పి పట్నాయక్ కాంబోలో వచ్చిన సినిమాల పాటలకు ఎదురు లేదని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పన్ను నొప్పిని అశ్రద్ధ చేస్తున్నారా..?

బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది.. కానీ ఇండియన్ ఫ్యాన్స్ కు నిరాశే.?

ఆ విటమిన్ లోపమే కరోనా రావడానికి కారణమా ? డాక్టర్ల సలహా ఇదే ?

అక్కడ కేసిఆర్ ని.. ఇక్కడ జగన్ ని.. టైం చూసి కొడుతున్నారుగా...?

హీరో అత్త పాత్రలో అనుష్క.. షాకవుతున్న అభిమానులు?

మందుబాబులకి గుడ్ న్యూస్

ఆ హీరో పక్కన నటించేందుకు ఎదురుచూస్తున్న : ప్రియమణి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>