BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/cbse-exams9b73418c-2393-4db8-b6da-0ed2d65681f8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/cbse-exams9b73418c-2393-4db8-b6da-0ed2d65681f8-415x250-IndiaHerald.jpgన్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండ‌టంతో సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల‌పై కేంద్ర కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.సీబీఎస్ఈ 12వ తర‌గ‌తి ప‌రీక్ష‌లు ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది.ప‌రీక్ష‌ల నిర్వ‌హించాలా వ‌ద్దా అనే దానిపై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అధ్య‌క్ష‌త‌న నేడు స‌మావేశం జ‌రిగింది.ఈ స‌మావేశంలో పరీక్షల నిర్వహణకు సంబంధించిన అంశంపై చర్చించారు. సుదీర్ఘ సమాలోచనల అనంతరం ఈ పరీక్షలను రద్దు చేయడానికే కేంద్రం మొగ్గు చూపించింది .అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెటcbse exams{#}central government;Modi;Prime Minister;Delhiబ్రేకింగ్ : సీబీఎస్ఈ పరీక్ష‌ల‌పై కేంద్ర కీల‌క నిర్ణ‌యం..బ్రేకింగ్ : సీబీఎస్ఈ పరీక్ష‌ల‌పై కేంద్ర కీల‌క నిర్ణ‌యం..cbse exams{#}central government;Modi;Prime Minister;DelhiTue, 01 Jun 2021 20:02:24 GMT
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండ‌టంతో సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల‌పై కేంద్ర కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.సీబీఎస్ఈ 12వ తర‌గ‌తి ప‌రీక్ష‌లు ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది.ప‌రీక్ష‌ల నిర్వ‌హించాలా వ‌ద్దా అనే దానిపై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అధ్య‌క్ష‌త‌న నేడు స‌మావేశం జ‌రిగింది.ఈ స‌మావేశంలో పరీక్షల నిర్వహణకు సంబంధించిన అంశంపై చర్చించారు. సుదీర్ఘ సమాలోచనల అనంతరం ఈ పరీక్షలను రద్దు చేయడానికే  కేంద్రం మొగ్గు చూపించింది .అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సీబీఎస్ఈ 12వ తరగతితో పాటు సీఐఎస్‌సీఈ పరీక్షలను కూడా రద్దు చేయాలని నిర్ణయించింది.

అయితే ఇటీవ‌ల సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల‌పై జ‌రిగిన స‌మావేశంలో సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. కరోనా ఉద్ధ‌తి, స్కూళ్ల మూసివేతల నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకున మే 4 . నుంచి జరగాల్సిన సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేసి... 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్న‌ట్లు కేంద్ర మంత్రి ర‌మేష్ పోఖ్రియాల్ తెలిపారు అయితే ఈ రోజు జ‌రిగిన స‌మావేశంలో 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను కూడా ర‌ద్దు చేయాల‌ని కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది.

కరోనా రెండో వేవ్ నేపధ్యంలో విద్యార్ధుల పరిస్థితి అయోమయంగా తయారైంది. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్నాయి. మరి కొన్ని రాష్ట్రాలు ప్రస్తుతానికి వాయిదా వేశాయి. కరోనా విపరీత పరిస్థితులలో చేజేతులా విద్యార్ధులను కరోనా కోరల్లోకి నెట్టవద్దని చాలామంది డిమాండ్ చేస్తూ వ‌చ్చారు. ప్రధాని సమావేశం నేపధ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా ప‌రీక్ష‌లపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని 12 వ తరగతి బోర్డులను రద్దు చేయాలని కేంద్రాన్ని ఆయన కోరారు. గత పనితీరు ఆధారంగా విద్యార్థుల పరీక్షల మార్కులు మదింపు చేసి ఫలితాలు ఇవ్వాలని ఆయన సూచించారు.ఈ నేప‌థ్యంలో సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల‌పై కేంద్రం తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని ప‌లువురు రాజ‌కీయ నేత‌లు, విద్యార్థుల త‌ల్లిదండ్రులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తనకు కరోనా వచ్చిందని..కావాలనే కోడలిని కౌగలించుకున్న అత్త..చివరికి.. ?

ప్ర‌పంచ పాల దినోత్స‌వం .. ఉత్ప‌త్తిలో అగ్ర‌స్థానం, వినియోగంలో మాత్రం ..

కన్నీరు పెడుతున్న తెలుగు వాకిలి... ఏడిపిస్తున్న ముగ్గు...!

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ సంక్షోభం దిశ‌గా ప‌య‌నిస్తోందా..?

సొంత వైద్యం మానండి.. లేదంటే బ్లాక్‌ఫంగ‌స్‌?

ఈట‌ల‌పై అన‌ర్హ‌త వేటుకు రంగం సిద్ధం ..?

రోజూ రూ.160 ఆదా చేస్తే.. చేతికి 23 లక్షలు.. అదిరిపోయే స్కీమ్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>