PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ttd-alipiri------------c32266d9-349b-4a9e-ba4d-c1d2f211bd8f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ttd-alipiri------------c32266d9-349b-4a9e-ba4d-c1d2f211bd8f-415x250-IndiaHerald.jpgశ్రీవారి భక్తులకు బ్యాడ్ న్యూస్. ఆవైకుంఠ దేవుని సన్నిధికి వెళ్లాలంటే ఇప్పుడు ఆ మార్గం మూతపడనుంది. దీంతో చాలా మంది నిరుత్సాహపడుతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వెళ్లే ప్రధాన మార్గం అయిన అలిపిరి మార్గం మూడపడనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులు నడుచుకుంటూ వెళ్లి శ్రీవారిని దర్శించుకునే అలిపిరి నడకమార్గాన్ని మూసివేయాలని నిర్ణయించింది. రెండు నెలల పాటు అలిపిరి మెట్ల మార్గం అందుబాటులో ఉండదని టీటీడీ అధికారులు ప్రకటనలో చెప్పారుttd, alipiri, అలిపిరి మార్గం మూసివేత{#}Tirupati;Tirumala Tirupathi Devasthanam;Juneశ్రీవారి భక్తులకు బ్యాడ్ న్యూస్..?శ్రీవారి భక్తులకు బ్యాడ్ న్యూస్..?ttd, alipiri, అలిపిరి మార్గం మూసివేత{#}Tirupati;Tirumala Tirupathi Devasthanam;JuneTue, 01 Jun 2021 12:15:00 GMTశ్రీవారి భక్తులకు బ్యాడ్ న్యూస్. ఆవైకుంఠ దేవుని సన్నిధికి వెళ్లాలంటే ఇప్పుడు ఆ మార్గం మూతపడనుంది. దీంతో చాలా మంది నిరుత్సాహపడుతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వెళ్లే ప్రధాన మార్గం అయిన అలిపిరి మార్గం మూడపడనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులు నడుచుకుంటూ వెళ్లి శ్రీవారిని దర్శించుకునే అలిపిరి నడకమార్గాన్ని మూసివేయాలని నిర్ణయించింది. రెండు నెలల పాటు అలిపిరి మెట్ల మార్గం అందుబాటులో ఉండదని టీటీడీ అధికారులు ప్రకటనలో చెప్పారు. తిరుమలకు వెళ్లే అలిపిరి కాలినడక మార్గంలో పైకప్పు పునర్నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసేందుకు జూన్ 1 2021, నుంచి జూలై 31 వరకు ఆ మార్గాన్ని మూసివేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లాలనుకునే భక్తులు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్లాలని కోరింది. ఇందుకోసం అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు వరకు ఉచిత బస్సుల ద్వారా భక్తులను తరలించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని, అటు తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే దారిలో అలిపిరి చెక్‌ పాయింట్‌ వద్ద ఇవాళ్టి నుంచి ఫాస్టాగ్‌ అమల్లోకి రానుంది. ఇప్పటికే తిరుమల-తిరుపతి మధ్య టాక్సీవాలాలతో సమావేశమైన అధికారులు ఫాస్టాగ్‌ అమలుపై సమీక్ష నిర్వహించారు. దీంతో పాటు పెంచిన కొత్త టోల్‌ చార్జీలను కూడా అమలు చేయనున్నట్లుగా తెలిపారు. గతంలో ద్విచక్ర వాహనాలకు 2 రూపాయల చార్జీ వసూలు చేస్తుండగా.. ఇకపై ఉచితంగానే వాటిని అనుమతిస్తారు. నాలుగు చక్రాల వాహనాలకు గతంలో 15 రూపాయల చార్జీ ఉండగా ఇకపై 50 రూపాయలు వసూలు చేయనున్నారు. 13 సీటర్ల నుంచి రూ.100, లారీలు వంటి వాటి నుంచి రూ. 250 వసూలు చేయనున్నారు. మరో రెండు నెలల్లో మార్గం తిరిగి తెరవబడుతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రజల సొమ్ము లూటీ చేసిన వారెవరినీ వదలబోము !

ఆ విటమిన్ లోపమే కరోనా రావడానికి కారణమా ? డాక్టర్ల సలహా ఇదే ?

అక్కడ కేసిఆర్ ని.. ఇక్కడ జగన్ ని.. టైం చూసి కొడుతున్నారుగా...?

హీరో అత్త పాత్రలో అనుష్క.. షాకవుతున్న అభిమానులు?

మందుబాబులకి గుడ్ న్యూస్

ఆ హీరో పక్కన నటించేందుకు ఎదురుచూస్తున్న : ప్రియమణి

ఆనందయ్య ఊరు కృష్ణపట్నంలో కరోనా కలకలం ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>