PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp679a8436-0b9c-43dc-bdcb-5ed56eb00c76-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp679a8436-0b9c-43dc-bdcb-5ed56eb00c76-415x250-IndiaHerald.jpgఅనంతపురం జిల్లా....తెలుగుదేశం పార్టీకి కలిసొచ్చే జిల్లా. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లా ఎప్పుడు టీడీపీకి అనుకూలంగానే ఉంటూ వచ్చింది. ప్రతి ఎన్నికల్లో ఇక్కడ టీడీపీకి మంచి ఫలితాలే వచ్చేవి. అయితే 2019లో మాత్రం జగన్ వేవ్‌లో సైకిల్ కొట్టుకుపోయింది. జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ సీట్లలో వైసీపీ 12 గెలిస్తే, టీడీపీ 2 మాత్రమే గెలిచింది. అటు రెండు ఎంపీ సీట్లు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి.TDP{#}Cycle;YCP;Ananthapuram;Anantapuram;Party;District;Jagan;Assembly;TDP;MP;local language;Hindupuram;Bandaru Sravani;Uravakonda;Dookudu;Dharmavaram;paritala ravindraకంచుకోటలో సైకిల్ స్పీడ్ పెరిగిందా? వైసీపీ హవా తగ్గిస్తుందా?కంచుకోటలో సైకిల్ స్పీడ్ పెరిగిందా? వైసీపీ హవా తగ్గిస్తుందా?TDP{#}Cycle;YCP;Ananthapuram;Anantapuram;Party;District;Jagan;Assembly;TDP;MP;local language;Hindupuram;Bandaru Sravani;Uravakonda;Dookudu;Dharmavaram;paritala ravindraTue, 01 Jun 2021 11:59:00 GMTఅనంతపురం జిల్లా....తెలుగుదేశం పార్టీకి కలిసొచ్చే జిల్లా. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లా ఎప్పుడు టీడీపీకి అనుకూలంగానే ఉంటూ వచ్చింది. ప్రతి ఎన్నికల్లో ఇక్కడ టీడీపీకి మంచి ఫలితాలే వచ్చేవి. అయితే 2019లో మాత్రం జగన్ వేవ్‌లో సైకిల్ కొట్టుకుపోయింది. జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ సీట్లలో వైసీపీ 12 గెలిస్తే, టీడీపీ 2 మాత్రమే గెలిచింది. అటు రెండు ఎంపీ సీట్లు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి.


ఇక ఎన్నికలై రెండేళ్ళు అయిపోయింది. ఓ వైపు అధికారంలో ఉన్న వైసీపీ దూసుకుపోతుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఇంకా పుంజుకున్నట్లు కనిపించలేదు. ఇటీవల జరిగిన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలో టీడీపీకి అనుకూల ఫలితాలు రాలేదు. ఎక్కువ పంచాయితీలు వైసీపీనే గెలిచింది. అటు మున్సిపాలిటీల్లో సత్తా చాటింది. టీడీపీ కేవలం తాడిపత్రికే పరిమితమైంది.


ఈ ఫలితాలని బట్టి చూస్తే అనంతలో టీడీపీ పరిస్తితి అంత మెరుగ్గా లేదని అర్ధమవుతుంది. కాకపోతే పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు మాత్రం కష్టపడుతున్నట్లే కనిపిస్తోంది. మిగిలిన జిల్లాలతో పోలిస్తే అనంతలో టీడీపీ నాయకులు బాగానే కష్టపడుతున్నారు. కానీ వైసీపీ అధికారంలో ఉండటంతో లోకల్ బాడీ ఎన్నిక్ల ఫలితాలు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. జిల్లాలో అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడుగా ఉన్న కాల్వ శ్రీనివాసులు, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడుగా ఉన్న బి‌కే పార్థసారథిలు పార్టీ తరుపున గట్టిగానే కష్టపడుతున్నారు.


తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీ యాక్టివ్‌గానే ఉంది. మొన్న మున్సిపాలిటీలో సత్తా చాటింది. అటు శింగనమలలో బండారు శ్రావణి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. అనంతపురం అర్బన్‌లో ప్రభాకర్, రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసులు పార్టీ తరుపున వర్క్ చేస్తున్నారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌లు కాస్త దూకుడు తగ్గించారు.


కదిరిలో కందికుంట వెంకటప్రసాద్, పెనుగొండలో పార్థసారథి, రాప్తాడు, ధర్మవరం బాధ్యతలు పరిటాల ఫ్యామిలీ చూసుకుంటుంది. ఇలా జిల్లాలోని మెజారిటీ నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు యాక్టివ్‌గానే పనిచేస్తున్నారు. మూడు, నాలుగు చోట్ల తప్ప, మిగతా చోట్ల నాయకులు పార్టీని బలోపేతం చేసి, వైసీపీ హవా తగ్గించేందుకు కృషి చేస్తున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దాదాపు 6 ఏళ్ళుగా క్లీన్ హిట్ కి దూరం అయిన హీరో..అంత పెద్ద బడ్జెట్ తో రీ ఎంట్రీ.

ఆ విటమిన్ లోపమే కరోనా రావడానికి కారణమా ? డాక్టర్ల సలహా ఇదే ?

అక్కడ కేసిఆర్ ని.. ఇక్కడ జగన్ ని.. టైం చూసి కొడుతున్నారుగా...?

హీరో అత్త పాత్రలో అనుష్క.. షాకవుతున్న అభిమానులు?

మందుబాబులకి గుడ్ న్యూస్

ఆ హీరో పక్కన నటించేందుకు ఎదురుచూస్తున్న : ప్రియమణి

ఆనందయ్య ఊరు కృష్ణపట్నంలో కరోనా కలకలం ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>