MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegdec2298b06-0c34-4cb9-9e23-cf5a8048577b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegdec2298b06-0c34-4cb9-9e23-cf5a8048577b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న ఆమె చేతిలో ఆరు సినిమాలు పైగా ఉన్నాయంటే నమ్మాల్సిందే. ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన పూజాహెగ్డే తెలుగులో సరిగ్గా అవకాశాలేవీ లేని టైంలో బాలీవుడ్ కి వెళ్లి అక్కడ మంచి అవకాశాలు దక్కించుకుంది. అయితే అక్కడ ఆమెకు దక్కిన పాపులారిటీ దృష్ట్యా పూజా హెగ్డే పై టాలీవుడ్ కళ్ళు మళ్లీ పడ్డాయి. దాంతో మళ్ళీ టాలీవుడ్ ఆమెకు పిలిచి అవకాశాలు ఇవ్వగా దాన్ని ఒడిసి పట్టుకొని వరుస సినpooja hegde{#}Pooja Hegde;Tollywood;Heroine;Oka Laila Kosam;bollywood;Duvvada Jagannadham;akhil akkineni;Telugu;India;Tamil;vijay;Joseph Vijay;Wanted;media;Cinema;Allariనీ ఒళ్లో తల వాల్చి సేద తీరాలని ఉంది: పూజా హెగ్డేనీ ఒళ్లో తల వాల్చి సేద తీరాలని ఉంది: పూజా హెగ్డేpooja hegde{#}Pooja Hegde;Tollywood;Heroine;Oka Laila Kosam;bollywood;Duvvada Jagannadham;akhil akkineni;Telugu;India;Tamil;vijay;Joseph Vijay;Wanted;media;Cinema;AllariTue, 01 Jun 2021 16:03:15 GMTటాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న ఆమె చేతిలో ఆరు సినిమాలు పైగా ఉన్నాయంటే నమ్మాల్సిందే. ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన పూజాహెగ్డే తెలుగులో సరిగ్గా అవకాశాలేవీ లేని టైంలో బాలీవుడ్ కి వెళ్లి అక్కడ మంచి అవకాశాలు దక్కించుకుంది. అయితే అక్కడ ఆమెకు దక్కిన పాపులారిటీ దృష్ట్యా పూజా హెగ్డే పై టాలీవుడ్ కళ్ళు మళ్లీ పడ్డాయి. దాంతో మళ్ళీ టాలీవుడ్ ఆమెకు పిలిచి అవకాశాలు ఇవ్వగా దాన్ని ఒడిసి పట్టుకొని వరుస సినిమాలు చేస్తూ వచ్చింది.

తన సెకండ్ ఇన్నింగ్స్ లో దువ్వాడ జగన్నాథం సినిమా తో హిట్ కొట్టి ఆ తరువాత వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం ఆమె చేతిలో అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ సినిమాలు ఉన్నాయి. తెలుగు సినిమాల్లో నటిస్తూనే ఆమె బాలీవుడ్ ఆఫర్స్ ను కూడా కాదనకుండా చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్ గా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ నే ఉంది. తమిళ్ లో కూడా ఆమె విజయ్ సరసన నటిస్తోంది.

సౌత్ లో మరియు నార్త్ లో ఈమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఉండగా ప్రస్తుతం ఆమె సోషల్ మీడియా లో పెట్టిన ఓ పోస్టు తెగ వైరల్ అవుతుంది. దేశంలో లాక్ డౌన్ కావడంతో సినిమా షూటింగ్ లు లేకపోవడంతో సెలబ్రిటీలు అందరూ ఇంటిపట్టునే ఉంటూ సేద తీరుతున్నారు. అలా పూజా హెగ్డే కూడా ఆమె కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతూ ప్రేక్షకులను అలరిస్తుంది. గతేడాది కూడా లాక్ డౌన్ సమయంలో ఇంటి సభ్యులందరితో కలిసి గడిపి పూజ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఇప్పుడు కూడా ఈ లాక్ డౌన్ సమయాన్ని కుటుంబంతో చక్కగా గడిపేస్తుంది. తన అమ్మమ్మ వడిలో సేదతీరుతున్న ఫోటో నీ షేర్ చేసింది ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ ఫోటో వైరల్ గా మారింది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గెలుపుతో హిస్టరీ క్రియేట్ చేస్తాం : బౌల్ట్

అమ్మ: గర్భిణీలకు గుండెల్లో మంటగా ఉందా..?

ఆ నలుగురు...వైసీపీ ఎమ్మెల్యేలు ఎప్పుడు అవుతారు?

కేసీఆర్ న్యూ స్ట్రాట‌జీ .. ప‌వ‌న్‌తో జ‌ట్టుక‌డ‌తారా?

బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది.. కానీ ఇండియన్ ఫ్యాన్స్ కు నిరాశే.?

ఆ విటమిన్ లోపమే కరోనా రావడానికి కారణమా ? డాక్టర్ల సలహా ఇదే ?

అక్కడ కేసిఆర్ ని.. ఇక్కడ జగన్ ని.. టైం చూసి కొడుతున్నారుగా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>