PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/maganti-babu14d2e541-d84b-4516-8d3a-005ff8b4e50d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/maganti-babu14d2e541-d84b-4516-8d3a-005ff8b4e50d-415x250-IndiaHerald.jpgమాజీ ఎంపీ మాగంటి బాబు ఇంట మరో విషాదం నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు రెండో కుమారుడు రవీంద్రనాథ్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైదరాబాద్ లో కన్నుమూశారు. కొద్ది కాలం క్రితమే మాగంటి బాబు ప్రధమ కుమారుడు రాంజీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ విషాదం నుంచి కోలుకోక ముందే మాగంటి కుటుంబం మరోసారి విషాదంలో కూరుకుపోయింది. మొదటి కుమారుడి మరణ వార్త మర్చిపోకుండానే రెండో కుమారుడు మృతి వార్త మాగంటి కుటుంబాన్ని మరింత కుంగదీసింది. ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు రెండో కుమారుడు మాగంటి రవీంద్రmaganti-babu{#}CBN;MP;West Godavari;Eluru;Hyderabad;Maganti Venkateswara Rao;Kollu Ravindra;Ishtam;police;Vijayawada;TDP;Partyమాగంటి బాబు ఇంట మరో విషాదం.. రెండో కొడుకు మృతి..!మాగంటి బాబు ఇంట మరో విషాదం.. రెండో కొడుకు మృతి..!maganti-babu{#}CBN;MP;West Godavari;Eluru;Hyderabad;Maganti Venkateswara Rao;Kollu Ravindra;Ishtam;police;Vijayawada;TDP;PartyTue, 01 Jun 2021 22:31:00 GMTమాజీ ఎంపీ మాగంటి బాబు ఇంట మరో విషాదం నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు రెండో కుమారుడు రవీంద్రనాథ్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైదరాబాద్ లో కన్నుమూశారు. కొద్ది కాలం క్రితమే మాగంటి బాబు ప్రధమ కుమారుడు రాంజీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ విషాదం నుంచి కోలుకోక ముందే మాగంటి కుటుంబం మరోసారి విషాదంలో కూరుకుపోయింది. మొదటి కుమారుడి మరణ వార్త మర్చిపోకుండానే రెండో కుమారుడు మృతి వార్త  మాగంటి కుటుంబాన్ని మరింత కుంగదీసింది.

ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు రెండో కుమారుడు మాగంటి రవీంద్రనాద్ చౌదరిను మద్యం అలవాటు మాన్పించేందుకు హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో  కొద్దికాలంగా ట్రీట్ మెంట్ ఇప్పిస్తున్నారు. మద్యానికి బానిస అయిన రవీంద్ర ను ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఆ చికిత్స ఇష్టం లేని రవీంద్ర ఆసుపత్రి నుంచి తప్పించుకుని వచ్చి ఓ హోటల్ లో ఉంటున్నారు. హయత్‌ ప్యాలస్‌లో ఉంటున్న రవీంద్ర.. రక్తపు వాంతులు చేసుకుని చనిపోయినట్టు తెలుస్తోంది.

మాగంటి రవీంద్ర మృతివార్త తెలుసుకున్న పోలీసులు మాగంటి రవీంద్ర మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు. రవీంద్ర మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

కొద్దికాలం క్రితమే మాగంటి బాబు పెద్ద కుమారుడు రాంజీ మరణించారు. ఆయన మరణం నుంచి మాగంటి కుటుంబం ఇంకా కోలుకోనేలేదు. మాగంటి బాబు పెద్ద కుమారుడు రాంజీ అనారోగ్య కారణాలతో ఏలూరు ఆంధ్ర ఆస్పత్రిలో కొంత కాలం చికిత్స పొందారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఆయనను విజయవాడ ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించింది. దీంతో ఆయన తుది శ్వాస విడిచారు.

మాగంటి రాంజీ టీడీపీ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరించేవారు పార్టీ వ్యవహారాల్లో మాగంటి బాబుకు సహాయసహకారాలు అందించారు. రాంజీతో పాటు.. కేవలం 3 నెలల వ్యవధిలోనే ఇప్పుడు చిన్న కుమారుడు రవీంద్ర కూడా మరణించడంతో మాగంటి బాబు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్ర‌పంచ పాల దినోత్స‌వం .. ఉత్ప‌త్తిలో అగ్ర‌స్థానం, వినియోగంలో మాత్రం ..

కన్నీరు పెడుతున్న తెలుగు వాకిలి... ఏడిపిస్తున్న ముగ్గు...!

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ సంక్షోభం దిశ‌గా ప‌య‌నిస్తోందా..?

సొంత వైద్యం మానండి.. లేదంటే బ్లాక్‌ఫంగ‌స్‌?

ఈట‌ల‌పై అన‌ర్హ‌త వేటుకు రంగం సిద్ధం ..?

రోజూ రూ.160 ఆదా చేస్తే.. చేతికి 23 లక్షలు.. అదిరిపోయే స్కీమ్?

టబు అక్క కూడా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>