PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/rojad4610e9b-3030-4204-abe0-7fbcf5ba4935-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/rojad4610e9b-3030-4204-abe0-7fbcf5ba4935-415x250-IndiaHerald.jpgదివంగత గాలి ముద్దుకృష్ణమనాయుడు...దశాబ్దాల పాటు ఏపీ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన నాయకుడు. తెలుగుదేశం పార్టీలో అనేక ఏళ్ళు పని చేసిన నేత. పలుమార్లు ఎమ్మెల్యేగా సేవలందించారు. అయితే అలాంటి సీనియర్ నాయకుడుకు రోజా చెక్ పెట్టేశారు. గతంలో రోజా టీడీపీలో పనిచేసిన విషయం తెలిసిందే. 2004లో నగరి నుంచి, 2009లో చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు.roja{#}2019;Varasudu;Roja;Air;Andhra Pradesh;Telugu Desam Party;Nagari;Chandragiri;MLA;YCP;bhanu;Cheque;TDPగాలి వారసుడు సెట్ అయ్యారా? రోజా డామినేషన్ ఉందా?గాలి వారసుడు సెట్ అయ్యారా? రోజా డామినేషన్ ఉందా?roja{#}2019;Varasudu;Roja;Air;Andhra Pradesh;Telugu Desam Party;Nagari;Chandragiri;MLA;YCP;bhanu;Cheque;TDPTue, 01 Jun 2021 03:00:00 GMTదివంగత గాలి ముద్దుకృష్ణమనాయుడు...దశాబ్దాల పాటు ఏపీ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన నాయకుడు. తెలుగుదేశం పార్టీలో అనేక ఏళ్ళు పని చేసిన నేత. పలుమార్లు ఎమ్మెల్యేగా సేవలందించారు. అయితే అలాంటి సీనియర్ నాయకుడుకు రోజా చెక్ పెట్టేశారు. గతంలో రోజా టీడీపీలో పనిచేసిన విషయం తెలిసిందే. 2004లో నగరి నుంచి, 2009లో చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు.


అయితే టీడీపీలో ప్రాధాన్యత లేదని చెప్పి వైసీపీలోకి వెళ్ళి 2014లో నగరి నుంచి పోటీ చేసి గాలి ముద్దుకృష్ణమనాయుడుపై గెలిచారు. కేవలం 900 ఓట్ల తేడాతో గెలిచి రోజా తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక అప్పుడు వైసీపీ ప్రతిపక్షానికే పరిమితమైన సమర్ధవంతంగా పనిచేసుకుంటూ వచ్చారు. 2019 ఎన్నికలోచ్చేసరికి సీన్ మారింది. మధ్యలో గాలి ముద్దుకృష్ణమనాయుడు అనారోగ్యంతో మృతి చెందడంతో నగరి టీడీపీ టిక్కెట్ ఆయన వారసుడు గాలి భాను ప్రకాశ్‌కు దక్కింది.


ఇక ఎన్నికల్లో రోజా మరొకసారి నగరి నుంచి గెలిచారు. 2700 ఓట్ల తేడాతో భానుపై గెలిచారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా దూసుకెళుతున్నారు. పైగా అధికారంలో ఉండటంతో రోజాకు తిరుగులేకుండాపోయింది. ప్రభుత్వ పథకాలు బాగా ప్లస్ అవుతున్నాయి. అటు నియోజకవర్గాల ప్రజల సమస్యలు తీర్చడానికి రోజా కృషి చేస్తున్నారు. అయితే సొంత పార్టీలో వేరే వర్గం రోజాకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయినా సరే రోజా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పనిచేస్తున్నారు.


ఇక టీడీపీ వైపు భాను అంత దూకుడుగా పనిచేయడం లేదు. ఓడిపోయాక నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు పెద్దగా చేయలేదు. అటు తన కుటుంబమే భాను ఎదుగుదలకు బ్రేక్ వేస్తుంది. ఈ పరిస్తితుల్లో నగరిలో టీడీపీ పుంజుకోలేకపోయింది. భాను కూడా నాయకుడుగా సెట్ కాలేకపోయారు. ఇక వచ్చే ఎన్నికల సమయంలో భాను దూకుడుగా ఉండొచ్చు. ఎంత దూకుడుగా ఉన్న రోజా ముందు భాను తేలిపోయేలా ఉన్నారు. మరి చూడాలి నెక్స్ట్ ఎన్నికల్లో రాజకీయం ఎలా ఉంటుందో?




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మూడేళ్లకు ముందే టికెట్ కంఫర్మ్ చేసిన బాబు ..... ?

కృష్ణ ఇంట్లో చెక్కుల మూట ... కారణం అదేనట .... ??

ఏపీకి గుడ్ న్యూస్.. డబుల్ రికవరీ రేట్...

వామ్మో జక్కన్నా ..... ఇదేమి ప్లానింగు అన్నా .... ??

భారతీయ సినిమాకి ఆల్ టైం సూపర్ స్టార్... కృష్ణ బర్త్ డే పిక్స్ వైరల్..

రాత్రే ఆ పాలు ఎందుకు తాగాలో తెలుసా ?

పోస్ట్ ఆఫీసులో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>