PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan758736b9-4030-4bb5-9485-6d0caa8c13ad-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan758736b9-4030-4bb5-9485-6d0caa8c13ad-415x250-IndiaHerald.jpgఒక్క‌సారి అమ‌ల్లోకి వ‌చ్చిన సంక్షేమ ప‌థ‌కాన్ని తొల‌గించాలంటే కొత్త‌గా వ‌చ్చిన ప్ర‌భుత్వాల‌కు ఇబ్బందే. అయినా వైసీపీ స‌ర్కార్ గ‌త తెదేపా హ‌యాంలో అమ‌లు చేసిన అన్నక్యాంటిన్‌ల‌ను తొల‌గించింది. దీంతో ప‌లు వ‌ర్గాల నుంచి తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేఖ‌త వ‌చ్చింది. ఇలా ప్ర‌భుత్వాలు ఏ ప‌థ‌కాన్ని నిలిపివేయాల‌న్నా ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేఖ‌త వ‌స్తుండ‌టం స‌ర్వ‌సాధార‌ణం. ప్ర‌స్తుతం ఏపీలో అమ‌లు చేయాల్సిన ప‌థ‌కాలు ప్ర‌భుత్వానికి త‌ల‌కుమించిన భార‌మ‌వుతున్న క్ర‌మంలో ప‌థ‌కాల అమ‌లు ఆల‌స్య‌మైనా ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేఖ‌త వ్య‌కys jagan{#}YCP;TDPసంక్షేమం పులిమీద స‌వారి .. అవునన్నా ఇబ్బందే.. కాద‌న్నా ఇబ్బందే!సంక్షేమం పులిమీద స‌వారి .. అవునన్నా ఇబ్బందే.. కాద‌న్నా ఇబ్బందే!ys jagan{#}YCP;TDPTue, 01 Jun 2021 11:21:00 GMTఏపీ ప్ర‌భుత్వం పేద‌ల అభ్యున్న‌తికి అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తోంది.. గత ప్ర‌భుత్వాలు అమ‌లు చేసిన ప‌థ‌కాల‌తో పాటు ప్ర‌స్తుత వైకాపా ప్ర‌భుత్వం అనేక ప‌థ‌కాల‌ను అమ‌ల్లోకి తెచ్చింది. మొత్తం 23 ప‌థ‌కాల‌కు నెల‌వారీ షెడ్యూల్‌ను కూడా ఆ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. రాష్ట్రంలో 8నుంచి 12కోట్ల మంది ల‌బ్ధిదారుల‌కు ఈ ప‌థ‌కాల ల‌బ్ధి చేకూరుతుంద‌ని, ఇప్ప‌టికే ల‌క్ష‌38వేల కోట్లు ఖ‌ర్చు చేశామ‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. అయితే ప్ర‌స్తుతం ఈ ప‌థ‌కాల అమ‌లు ప్ర‌భుత్వానికి భారంగా ప‌రిణ‌మించాయి. అప్పులు తెచ్చి మ‌రీ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌న్న వాద‌న ప్ర‌భుత్వ వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది.

ఏపీలో 2014 నుంచి అనేక సంక్షేమ ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్నాయి. లోటు బ‌డ్జెట్ ఉన్నా మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప‌థ‌కాలను అమ‌లు చేసుకుంటూ వ‌చ్చారు. 2019లో సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిసైతం ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ ప్ర‌కారం ప్ర‌తీఒక్క ప‌థ‌కాన్ని అమ‌లు చేసుకుంటూ వ‌స్తున్నారు. త‌ద్వారా ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందుతున్నారు. అయితే ఇక్క‌డ ప‌థ‌కాల అమ‌లు క‌ష్ట‌త‌రంగా మారింద‌నే చెప్పాలి. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఏపీలో ఇన్ని ప‌థ‌కాల అమ‌లు చేయాలంటే త‌ప్ప‌నిస‌రిగా అప్పులు చేయాల్సిన ప‌రిస్థితి. ఈ క్ర‌మంలో వైకాపా ప్ర‌భుత్వం సైతం అప్పులు ద్వారా తెచ్చిన సొమ్మును సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుకు మ‌ళ్లిస్తుంద‌న్న వాద‌న ఉంది. ఇచ్చిన హామీమేర‌కు ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నా.. రాష్ట్రంలో ఆ మేర‌కు ఆదాయం వ‌న‌రులు స‌మ‌కూర్చుకోగ‌లుగుతున్నామా అంటే అదీ క‌నిపించ‌డం లేదు.

ఒక్క‌సారి అమ‌ల్లోకి వ‌చ్చిన సంక్షేమ ప‌థ‌కాన్ని తొల‌గించాలంటే కొత్త‌గా వ‌చ్చిన ప్ర‌భుత్వాల‌కు ఇబ్బందే. అయినా వైసీపీ స‌ర్కార్ గ‌త తెదేపా హ‌యాంలో అమ‌లు చేసిన అన్నక్యాంటిన్‌ల‌ను తొల‌గించింది. దీంతో ప‌లు వ‌ర్గాల నుంచి తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేఖ‌త వ‌చ్చింది. ఇలా ప్ర‌భుత్వాలు ఏ ప‌థ‌కాన్ని నిలిపివేయాల‌న్నా ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేఖ‌త వ‌స్తుండ‌టం స‌ర్వ‌సాధార‌ణం.  ప్ర‌స్తుతం ఏపీలో అమ‌లు చేయాల్సిన ప‌థ‌కాలు ప్ర‌భుత్వానికి త‌ల‌కుమించిన భార‌మ‌వుతున్న క్ర‌మంలో ప‌థ‌కాల అమ‌లు ఆల‌స్య‌మైనా ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేఖ‌త వ్య‌క్త‌మ‌వుతుంది. ఒక‌వేళ అవి క‌చ్చిత‌మైన స‌మ‌యానికి కొన‌సాగించాల‌న్నా వాటికి ఆదాయం స‌మ‌కూర్చుకోవాలంటే ఇబ్బందులు ప‌డాల్సిందే. ఈ క్ర‌మంలో ఏపీలో సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు తీరు ప్ర‌భుత్వానికి పులిమీద స‌వారిలా మారిద‌న్న వాద‌న రాజ‌కీయ విశ్లేష‌కుల నుంచి వినిపిస్తుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు అస్వస్థత

ఆ విటమిన్ లోపమే కరోనా రావడానికి కారణమా ? డాక్టర్ల సలహా ఇదే ?

అక్కడ కేసిఆర్ ని.. ఇక్కడ జగన్ ని.. టైం చూసి కొడుతున్నారుగా...?

హీరో అత్త పాత్రలో అనుష్క.. షాకవుతున్న అభిమానులు?

మందుబాబులకి గుడ్ న్యూస్

ఆ హీరో పక్కన నటించేందుకు ఎదురుచూస్తున్న : ప్రియమణి

ఆనందయ్య ఊరు కృష్ణపట్నంలో కరోనా కలకలం ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>